సుధీర్ గురుంచి ఎంత గొప్పగా చెప్పిందో.. ప్రేమగా హత్తుకున్న రష్మీ
సుడిగాలి సుధీర్ బుల్లితెరపై స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నాడు. ఇప్పుడైతే సుధీర్ ఓ స్టార్ కాని కొన్నేళ్ల క్రితం ఏంటి? అనేది అందరికీ తెలిసిందే. ఎన్నో ఇంటర్వ్యూల్లో, ఎన్నో వేదికల్లో కూడా తన గతం గురించి తెలిపాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో, ఓ వైపు కుటుంబం, మరో వైపు కెరీర్ ఇలా తాను పడిన బాధలన్నీ కూడా అందరికీ తెలిసిందే. ఇక సుధీర్ జీవితాన్ని ఓ పాటలో ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఢీ కంటెస్టెంట్లకు వచ్చినట్టుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోల్లో సుధీర్ జీవితాన్ని చూపించేశారు.

మ్యాజిక్ షోలు చేసుకుంటూ..
జబర్దస్త్ వేదికపైకి రాకముందు మ్యాజిక్ షోలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇక సినీ అవకాశాల కోసం తిరుగుతూ ఎన్నో కష్టాలు పడ్డాడు సుధీర్. సుధీర్‌కు ఆ సమయంలో తినడానికి కూడా తిండి ఉండేది కాదట. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు వెండితెరపై హీరోగా ఎదిగాడు సుధీర్.

ట్యాప్ వాటర్ తాగి..
కెరీర్ ప్రారంభంలో పడిన కష్టాల గురించి సుధీర్ చెబుతూ.. మంచినీళ్ల బాటిల్ కొనడానికి కూడా డబ్బులు లేకపోతే.. మున్సిపాల్టీ ట్యాప్ వాటర్ తాగి ఆకలిని తీర్చుకునేవాడినని చెప్పిన సందర్భాలెన్నో. ఆ సంఘటలను ఆధారంగా చేసుకుని ఢీ కంటెస్టెంట్ తాజాగా చేసిన పర్ఫామెన్స్ అందర్నీ కంటతడి పెట్టిస్తోంది.

సుధీర్ ఎదుగుదుల..
సుధీర్ ఇటు కెరీర్‌ను అటు ఫ్యామిలీని రెండింటిని చూసుకుంటూ వచ్చాడు. మధ్యలో సుధీర్ తన తండ్రికి యాక్సిడెంట్ అయినప్పుడు పడిన బాధను కూడా డ్యాన్స్ రూపంలో తెలియజేశారు. ఇక ఈ డ్యాన్స్ పర్ఫామెన్స్‌కు సంబంధించిన ప్రోమో తెగ వైరల్ అవుతోంది. సుధీర్ ఆ పర్ఫామెన్స్‌ను చూసి కన్నీరు పెట్టుకున్నాడు. ఇప్పటికీ నాకు ఇచ్చిన డెడికేషన్స్‌లో ఇదే బెస్ట్ అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.
Recommended Video

ప్రేమగా హత్తుకున్న రష్మీ..
సుధీర్ ఎదుగుదలను దగ్గరి నుంచి చూసిన వారిలో రష్మీ ఒకరు. ఈ ఇద్దరూ జబర్దస్త వేదికపై నుంచే స్టార్స్‌గా ఎదిగారు. ఇక ఈ జోడికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుధీర్ సక్సెస్ గురించి మాట్లాడుతూ.. ఇదంతా అతని కష్టం, అతని ప్రయాణం, అతని బాధ అంటూ ఎమోషనల్ అయింది. ఇక సుధీర్‌ను ప్రేమగా హత్తుకోవడంతో సెట్ అంతా సందడిగా మారింది.


Click it and Unblock the Notifications











