twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సృష్టిలో అన్నీ ముఖ్యమైనవే.. దేన్నీ వదులుకోవద్దు.. విలక్షణత చాటుకున్న యాంకర్ రష్మి

    |

    Recommended Video

    Rashmi Gautam Tweets About Small Species, Tweet Goes Viral || Filmibeat Telugu

    బుల్లితెర యాంకర్‌గా మస్త్ పాపులారిటీ సంపాదించిన రష్మి.. వెండితెరపై కూడా తన సత్తా చాటుతూ వస్తోంది. ఈ రెండింటితో పాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈ భామ తాను చెప్పాలనుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తూ ఉంటుంది. తనకు సంబంధించిందైనా, సమాజానికి సంబంధించిందైనా స్వేచ్ఛగా తనలోని ఆలోచనలను బయట పెట్టేస్తుంది యాంకర్ రష్మి. తాజాగా ఈ సృష్టిలోని చిన్న జీవులను ఉద్దేశిస్తూ ఆమె చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి పోతే..

    మూగ జీవాలపై రష్మి ప్రేమ

    మూగ జీవాలపై రష్మి ప్రేమ

    ఈ సృష్టిలోని మూగ జీవాలంటే రష్మికి మహా ఇష్టం. జంతు ప్రేమికులరాలిగా జీవులను రక్షించే బాధ్యత మనుషులపై ఉందని ఇప్పటికే పలు సార్లు ప్రకటించింది రష్మి. అయితే తాజాగా మూగ జీవాలన్నాక చిన్న, పెద్ద తేడా లేదంటూ సృష్టి లోని జీవాలన్నింటినీ కాపాడుకోవాలని ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

    ఈగలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే

    ఈగలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే

    సృష్టిలో మానవులతో జీవిస్తున్న జీవాలన్నీ ఈ సృష్టికి ఏదో ఒక రకంగా అవసరమైనవే అని పేర్కొంటూ ఓ మ్యాగజైన్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఇందులో చిన్న జీవులైన ఈగల గురించి ప్రస్తావించిన సదరు మ్యాగజైన్.. ఒకప్పటి కంటే ఇప్పుడు ఈగల శాతం తగ్గిపోయిందని పేర్కొంటూ ఈగలను కాపాడుకోవాలని తెలిపింది. మూడింట ఒక వంతుకు ఈగల శాతం పడిపోయిందంటూ ఆ ఆర్టికల్‌ ద్వారా తెలపడం జరిగింది.

    సృష్టిలో అన్నీ ముఖ్యమైనవే.. దేన్నీ వదులుకోవద్దు

    ఈ మేరకు సదరు ఆర్టికల్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన రష్మి.. సృష్టిలో అన్నీ ముఖ్యమైనవే.. దేన్నీ వదులుకోవద్దు అని ట్యాగ్ చేసింది. సృష్టి లోని ఈగలను కాపాడుకోవాలని తెలుపుతూ.. వాటి కోసం ఓ స్పూన్‌ లో కొంచెం పంచదార, లేదంటే తీపి పదార్థాలను ఉచాలని సూచించింది. ఈ సృష్టి లోని జీవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే అని ఈ సందర్బంగా రష్మి పేర్కొంది.

    విలువ ఇవ్వాలి కానీ కంట్రోల్ చేయకూడదు

    చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సృష్టిలోని అన్ని జీవాలకు విలువ ఇవ్వాలని అంటోంది రష్మి. జీవ రాశులన్నీ పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవించేవే అని, కానీ వాటిని మనం కంట్రోల్ లోకి తీసుకుంటున్నామని.. అలా చేయొద్దని రష్మి తెలిపింది. దీంతో రష్మి లోని ఈ కోణం చూసి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు.

    రష్మి కెరీర్.. వెండితెర, బుల్లితెర

    రష్మి కెరీర్.. వెండితెర, బుల్లితెర

    బుల్లితెర యాంకర్ గా పాపులర్ అయిన రష్మి.. ఆ తర్వాత వెండితెరపై కూడా కాలు మోపింది. కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ పోషించినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. దీంతో మంచి కథ దొరికితే తాను ఎలాంటి రోల్ చేయడానికైనా సిద్దమేనని ఇటీవలే ప్రకటించింది యాంకర్ రష్మి.

    English summary
    Rashmi Gautam Opens her voice about small animals. Naturally she loved animals in the world. Now she tweeted about animal caring. This tweet is viral on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X