రష్మీ బర్త్ డే.. వాటితో అలా గడిపాను.. జబర్దస్త్ యాంకర్ క్యూట్ స్టెప్పులు వైరల్
జబర్దస్త్ యాంకర్ రష్మీ బుల్లితెరపై ఎంతగా ఆకట్టుకుందో వెండితెరపైనా అందాలను ఆరబోసి ప్రేక్షకులను కట్టిపడేసింది. జబర్దస్త్ తెచ్చిన క్రేజ్, ఫేమ్‌ను వెండితెరపై వాడినా అంతగా వర్కౌట్ కాలేదు. రష్మీ నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ప్రస్తుతం తన సమయాన్ని బుల్లితెరకే కేటాయించింది. జబర్దస్త్, ఢీ షోలతో నిత్యం బిజీగా ఉంటుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండటంటో రష్మీ దినచర్య పూర్తిగా మారిపోయింది. అదేంటో ఓ సారి చూద్దాం.

మూగ జీవాల కోసం తపన..
కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందడంతో దాన్నికట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించారు. దీంతో కొన్ని చోట్ల మనుషులకు కూడా తినడానికి తిండిలేని పరిస్థితి ఏర్పడింది. ఇక మూగ జీవాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీటికి ఆహారాన్ని అందించేందుకు జబర్దస్త్ యాంకర్ రష్మీ నడుంబిగించింది.

బకెట్ పట్టుకుని రోడ్లపైకి..
మూగ జీవాలకు తిండి దొరకడం లేదని గ్రహించిన రష్మీ స్వయంగా రోడ్లపైకి ఎక్కింది. చేతిలో బకెట్ పట్టుకుని వీధి కుక్కలకు ఆహారాన్ని పెట్టసాగింది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. రష్మీ చేసిన మంచి పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపించారు.
నెగెటివ్ కామెంట్లకు ధీటుగా..
రష్మీ ఇలా మూగజీవాల కోసం పాటు పడుతూ ఉంటే వాటిని అనవసరంగా కొట్టి చంపి మానసిక ఆనందాన్ని పొందే వారు కూడా ఉన్నారు. కుక్కలను కాదు మొదట మనుషులను చూడు, ఎంతో మంది ఆకలితో చచ్చిపోతోన్నారని రష్మీపై కామెంట్స్ చేసినా ధీటుగా బదులు చెబుతూ వస్తోంది.
Recommended Video

పుట్టినరోజున కూడా..
రష్మీ పుట్టిన రోజు (ఏప్రిల్ 27)న సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే బర్త్ డేను ఎలా సెలబ్రేట్ చేసుకుందో, ఎలా గడిపిందో తెలుపుతూ ఓ వీడియోను షేర్ చేసింది. నా పుట్టినరోజు నా పెట్స్‌తో ఇలా గడిపాను అంటూ రష్మీ వేసిన క్యూట్ స్టెప్పులు తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











