twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాటి మీదనా మీ ప్రతాపం.. అది మగతనం అనిపించుకోదు.. రష్మీ సెన్సేషనల్ కామెంట్స్

    |

    జబర్దస్త్ యాంకర్ రష్మీకి పెట్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ట్వీట్స్, చేసే పోస్ట్‌లను పరిశీలిస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఎవరైనా మూగజీవాలకు హాని కలిగిస్తున్నారంటే చాలు.. అంత ఎత్తుకు లేస్తుంది. సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతూ ఉంటుంది. పెట్స్‌ను ఎవరైనా బాధపెట్టినా, అనవసరంగా వాటిని కొట్టినా రష్మీ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ ఉంటుంది. తాజాగా రష్మీ ఓ వీడియోపై, అందులో మనుషులు ప్రవర్తించిన విధానంపై నిప్పులు చెరిగింది. అసలు ఆ వీడియోలో ఏముంది? రష్మీ అంతలా ఎందుకు ఫైర్ అయింది? అనే విషయాలను ఓ సారి చూద్దాం.

    Recommended Video

    Anchor Rashmi Gautam Feeding Road Dogs During Lockdown!
    మూగజీవాల పట్ల మక్కువ..

    మూగజీవాల పట్ల మక్కువ..

    రష్మీ నిత్యం మూగజీవాల కోసం పరితపిస్తూ ఉంటుంది. ఎక్కడ వీధి కుక్కలు కనిపించినా వాటి ఆకలిని తీరుస్తుంది. సోషల్ మీడియాలో ఎవరైనా పెట్స్‌కు బాగా లేదని, ఆహారం దొరకడం లేదని చెబితే చేతనైన సాయాన్ని చేస్తుంది.

     రోడ్లపైకి బకెట్‌తో..

    రోడ్లపైకి బకెట్‌తో..

    లాక్ డౌన్ కారణంగా కుక్కలకు ఆహారం సరిగ్గా దొరకడం లేదు. దీంతో లాభం లేదని భావించిన రష్మీ.. స్వయంగా రంగంలోకి దిగింది. చేతిలో బకెట్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ మూగజీవాల ఆకలిని తీర్చింది. ఆ మధ్య వీటికి సంబంధించిన వీడియోలు ఎంతగానో వైరల్ అయ్యాయి.

    తాజాగా ఓ వీడియో..

    మూగజీవాలను హింసిస్తున్న వీడియో ఒకటి రష్మీ కంటపడింది. ఢిల్లీలోని ఓ కాలనీలో కొందరు యువకులు కలిసి మూగజీవాలను వెంటాడి మరి కొట్టారు.అడ్డు వచ్చిన వారిని సైతం బెదిరించి.. కుక్కలను తరిమి తరిమి కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

    అది మగతనం కాదు..

    అది మగతనం కాదు..

    ఆ వీడియోపై స్పందించిన రష్మీ.. ‘నోరు లేని మూగజీవాలపై మీ బలాన్ని చూపడం మగతనం అనిపించుకోదు.. ఇలాంటి వారికి వ్యతిరేకంగా మనం స్పందించాలి..అది మన హక్కు.. పెట్స్‌ను సంరక్షించడం, పోషించడం తప్పు కాద'ని చెప్పుకొచ్చింది.

    English summary
    Rashmi gautam Fired On Goons Who Beaten Pets. Showing off strength by harming the voiceless does not make u a man. Raise you voice against such goons its ur right. no one can stop u from taking care of them or feeding them
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X