కాళ్లు, చేతులు కట్టేసి జబర్దస్త్‌ను చూపించడం లేదు..అలాంటి పాత్ర కూడా చేస్తా..రష్మీ సెన్సేషనల్ పోస్ట్

తమకంటూ ఓ పేరు తెచ్చిన షో, జీవితాన్ని ఇచ్చిన కార్యక్రమంపై ఎవరైనా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవ్వరూ ఒప్పుకోరు. అయితే జబర్దస్త్ షోపై కొంత నెగెటివిటీ ఎప్పటి నుంచో ఉంది. బుల్లితెరపై టాప్ రేటింగ్‌తో దూసుకుపోతోన్న జబర్దస్త్‌కు సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఆ కార్యక్రమంలో యాంకర్స్ అయిన అనసూయ, రష్మీలకు మరింత నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

ఫ్రాన్స్ చర్యలు..

ఫ్రాన్స్ చర్యలు..

కరోనాతో ప్రపంచమంతా వణికిపోతుండగా.. ఫ్రాన్స్ దేశంలో కరెంట్ బిల్, గ్యాస్ బిల్ అన్నీ రద్దు అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీటిని ట్వీట్ చేసిన రష్మీ.. ఇక్కడ కూడా ఇలాంటివి అమలు చేసేందుకు రెడీగా ఉన్నారా? అంటూ కామెంట్ చేసింది.

నెటిజన్ కౌంటర్..

అయితే రష్మీ చేసిన ఈ ట్వీట్‌కు స్పందించిన ఓ నెటిజన్.. గ్యాస్, రెంట్ కాదు కానీ ఫస్ట్ బుల్ షిట్, బాడీ షేమింగ్, వల్గర్ కామెడీ షో జబర్దస్త్ షోను తీసేయండని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌పై రష్మీ సెటైర్ వేసింది. ఇలాంటి పరిస్థితిలోనూ మన మెంటాల్టీ ఇంతేనంటూ ఓ పోస్ట్ చేసింది.

వారికి పరోక్షంగా చెబుతున్నా..

వారికి పరోక్షంగా చెబుతున్నా..

ఎవరైతే కరోనా, జబర్దస్త్‌ను పోల్చి చూస్తున్నారో వారికే చెబుతున్నా.. ముందు ఎదగండి ఆ తర్వాత జబర్దస్త్ గురించి తెలుసుకోండి.. డిమాండ్ అండ్ సప్లై మీదే ఇలాంటివి ఆధారపడతాయని చెప్పుకొచ్చింది.

కాళ్లు చేతులు కట్టేయలేదు..

కాళ్లు చేతులు కట్టేయలేదు..

మీ చేతులు, కాళ్లు క‌ట్టేసి టీవీ ముందు కూర్చోపెట్ట‌లేదని తెలిపింది. మీకు న‌చ్చ‌న‌ట్టు మేము డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న ఇస్తుంటే చూడ‌కుండా క‌ళ్లు మూసుకోండని, లేదంటే చేతిలో రిమోట్‌తో చాన‌ల్ మార్చుకోండని సలహా ఇచ్చింది. షోతో స‌మ‌స్య‌లున్న వాళ్లు చూడ‌కుండా ఉండొచ్చని తెలిపింది.

Recommended Video

Rashmi Gautam Supports Sreemukhi || శ్రీముఖి కి రష్మీ సపోర్ట్ !
అలాంటి పాత్ర కూడా చేస్తా..

అలాంటి పాత్ర కూడా చేస్తా..

లేక‌పోతే మీరు ఏమైనా సినిమా తీస్తుంటే , అందులో నాకు స‌తీ సావిత్రి పాత్ర ఇవ్వండి ఆ క్యారెక్టర్ చేస్తానని పేర్కొంది. అంతేగానీ, తాను ఎంచుకున్న ప‌ని గురించి తనను ప్ర‌శ్నించొద్దని ఫైర్ అయింది. తనకు వ‌చ్చిన అవ‌కాశాల్లో ఉత్త‌మ‌మైన వాటిని ఎంచుకుని అంద‌రిలాగే ప‌నిచేస్తున్నానని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X