సుధీర్ తో గొడవలు.. కారణం చెప్పిన జబర్దస్త్ రష్మీ గౌతమ్

బుల్లితెర ప్రేక్షకుల్లో యంగ్ బ్యూటీ జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ కు మంచి క్రేజీ ఉంది. అలాగే జబర్దస్త్ లో ఎన్నో స్కిట్లను చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన స్టార్ కమెడియన్, హీరో సుడిగాలి సుధీర్ కి కూడా మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి బుల్లితెరపై కనిపిస్తే ఆడియన్స్ లో వచ్చే జోష్ వేరే లెవెల్ లో ఉంటుంది. వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్లు ప్రచారం అవుతున్నాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల మాత్రం రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్ మధ్య గొడవలు జరుగుతున్నాయని ప్రచారం జరిగింది. దీనిపై రష్మీ గౌతమ్ తాజాగా స్పందించింది.

సుధీర్, రష్మీ తొలి పరిచయం..
జబర్దస్త్ యాంకర్ గా రష్మి గౌతమ్ ఆ షో ప్రారంభం నాటి నుంచి కొనసాగుతూనే ఉంది. మధ్యలో పలు సినిమాలకు సమయం కేటాయించాల్సి రావడంతో కాస్త గ్యాప్ తీసుకుంది. మళ్లీ తిరిగి జబర్దస్త్ వేదికపై తన యాంకరింగ్ తో ఆకట్టుకుంటూ ఉంది. ఇక మరోవైపు సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కామెడీ షో కు మొదటగా వేణు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుంచి వరుసగా తనదైన శైలిలో కామెడీ స్కిట్లను ప్రదర్శిస్తూ బుల్లితెర ప్రేక్షకుల్లో అనతి కాలంలోనే మంచి గుర్తింపును తగ్గించుకున్నారు. ఇదే సమయంలో రష్మీ గౌతమ్ సుడిగాలి సుదీర్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వీరి కాంబినేషన్ ఉంటే ఆ స్కిట్ పేలుతుందంటూ అభిమానుల్లో ఒక నమ్మకం కూడా ఏర్పడింది.

Rashmi Gautam gave Clarity on differences with Sudigali Sudheer

ఇద్దరి మధ్య నిజంగానే రిలేషన్ షిప్ ఉందా?
సుడిగాలి సుదీర్ కమెడియన్గా మంచి స్థాయికి చేరుకున్న తర్వాత యాంకర్ రష్మీ గౌతమ్ తో ప్రేమలో పడ్డారంటూ కొన్నాళ్లు ప్రచారం జరిగింది. వీరిద్దరూ ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లోను మంచి జంటగా ఉంటారంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. మొదటగా అలా మొదలైన ప్రచారం కొన్నాళ్లకు తీవ్ర స్థాయికి చేరుకుంది. నిజంగానే వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందా అనేంతగా రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ పలు ఇంటర్వ్యూలో అటు సుడిగాలి సుదీర్, ఇటు యాంకర్ రష్మీ గౌతమ్ వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని, రూమర్లను పట్టించుకోదని చెప్పుకొచ్చారు. అయినా ఆ రూమర్లకు అడ్డుకట్ట పడటం లేదు.

రష్మీపై సుధీర్ కోపం..
కొన్నాళ్లుగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ కొంతకాలంగా మాత్రం వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని, అందుకే బుల్లితెరపై కలిసి కనిపించడం లేదని మరో వార్త వైరల్ అవుతుంది. సుడిగాలి సుదీర్ రష్మీ గౌతమ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడం లేదని, ఆమెను పట్టించుకోవడం లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. దీనిపై తాజాగా రష్మి గౌతమ్ స్పందించింది. మా ఇద్దరి మధ్య గొడవలు ఎలాంటివి లేవని చెప్పారు. కానీ ఏదైనా ఈవెంట్ ఉంటే మాత్రమే కలుస్తామని, ప్రొఫెషనల్ గానే ఉంటామని చెప్పుకొచ్చింది. అంతే తప్ప సుధీర్ తో తనకి ఎప్పుడు ఎలాంటి గొడవలు లేవని వివరించారు. మేమంతా ఒకే దగ్గర కలిసి పని చేయాలి కాబట్టి ఎలాంటి కోపతాపాలకు అవకాశం ఇవ్వబోమని చెప్పారు.

మళ్లీ ఇద్దరూ కలిసి ఆన్ స్క్రీన్ పై..
మళ్ళీ ఇద్దరు కలిసి బుల్లితెరపై నటించే అవకాశం ఉందా? అని అడగ్గా.. అది తన చేతిలో లేదని, అలాంటి నిర్ణయాలు సుధీర్ కు వ్యక్తిగతమైనవని, వాటిపై తాను ఏమీ మాట్లాడలేనని చెప్పింది. జబర్దస్త్ మెనేజ్ మెంట్ అనుమతిస్తే వస్తారని, లేదంటే చెప్పలేమని తెలిసింది. అది తన పరిధిలో లేదని చెప్పింది. ఇక రష్మీ గౌతమ్ చివరిగా యాక్టర్ నందుతో కలిసి 'బొమ్మ బ్లాక్ బాస్టర్' అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X