ఒకరి తర్వాత మరొకరు... ఆ రెండేళ్లు నరకంలా... రష్మి గౌతమ్ ఎమోషనల్
టాలీవుడ్‌లోని స్టార్ యాంకర్లలో రష్మి గౌతమ్ ఒకరు. సినీరంగం నుంచి బుల్లితెర వైపుకు అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకు జబర్దస్త్ కామెడీ షో మంచి గుర్తింపును తీసుకొచ్చింది. తన అందంతో జబర్దస్త్‌కు గ్లామర్ తీసుకొచ్చారు రష్మి. ఎందరో జడ్జిలు, కమెడియన్లు, యాంకర్లు మారినా తను మాత్రం జబర్దస్త్‌ను వదలకుండా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. మధ్యలో సినిమా ఆఫర్లు వచ్చినా వాటిని చేస్తూనే జబర్దస్త్‌ను నడిపిస్తున్నారు. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్‌కు కూడా రష్మి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ వారం వదిలిన ప్రోమోలో ఎమోషనల్ అయ్యారు రష్మి.. ఈ వివరాల్లోకి వెళితే..
అభిమానులతో సెలబ్రిటీలు
ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో ప్రారంభం కాగానే బుల్లితెర నటులు సుహాసినీ, శోభాశెట్టిలు ఎంట్రీ ఇవ్వగా.. వారి అభిమాన సంఘాలకు అధ్యక్షులమంటూ పొట్టి నరేష్, అజహర్‌లు గొడవపడతారు. ఈ వారం సెలబ్రిటీస్ విత్ ఫ్యాన్స్ థీమ్‌లో శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ డిజైన్ చేసినట్లు ఇంద్రజ, రష్మి గౌతమ్‌లు చెప్పారు. ఆ తర్వాత చిరంజీవి వీరాభిమాని ఒకరు తన భార్యను వీల్ చైర్ మీద నడిపిస్తూ వేదిక మీదకి వచ్చారు.

చిరు ఫోటోతో గృహ ప్రవేశం
అనంతరం సదరు అభిమాని మాట్లాడుతూ... నేను చిన్నప్పుడే నిర్ణయించుకున్నా.. నేను గనుక జీవితంలో సొంతంగా ఇల్లు కట్టుకుంటే అన్నయ్య ఫోటోతోనే గృహ ప్రవేశం చేయాలని చెబుతాడు. అలాగే మా మిసెస్ పద్మావతి 20 సంవత్సరాల నుంచి చక్రాల కుర్చీకే పరిమితం, తను చనిపోయేలోపు అన్నయ్యని చూడాలని కోరిక అని చెప్పి మెగాస్టార్ ఫోటోతో గృహ ప్రవేశం చేసిన వీడియోను, చిరంజీవిని తన కుటుంబంతో కలిసిన వీడియోను చూపించడంతో అంతా ఎమోషనల్ అయ్యారు.
అభిమానులతో ఎమోషనల్ బాండింగ్
అనంతరం సాయి కుమార్ గెటప్‌లో పొట్టి నరేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ వెంటనే అతనిని రకరకాల సాంగ్స్‌తో కన్‌ఫ్యూజ్ చేయడంతో డీజే దగ్గరికి వెళ్లి బాధపడతాడు. దాంతో నరేష్‌ని ఇంద్రజ ఓదార్చి మంచినీళ్లు తాగిస్తుంది. తర్వాత సెలబ్రిటీల అభిమానులు... వారి అభిప్రాయాలను షేర్ చేసుకోవడానికి వేదిక మీదకి వస్తారు. ముందుగా ఓ అమ్మాయి... నా ఫేవరెట్ సెలబ్రిటీ శోభాశెట్టి గారు, డైలీ తన ఫేస్ చూస్తే కానీ నాకు డే స్టార్ట్ అవ్వదు ఎండ్ అవ్వదని చెప్పింది. తర్వాత సౌమ్యా రావు నడిగ్, ఆటో రాంప్రసాద్ ఫ్యాన్స్ వచ్చారు. ఈ సందర్భంగా రాంప్రసాద్‌కి తన అభిమాని వాచ్‌ని గిఫ్ట్‌గా తీసుకొచ్చింది.
రష్మి గౌతమ్ కంటతడి
అనంతరం భానుశ్రీ, సుహాసినీ, ఇంద్రజల అభిమానులు వచ్చారు. ఇంద్రజ మేడం మీద ఇష్టంతో ఓ ఫౌండేషన్ స్టార్ట్ చేసినట్లు చెప్పింది. తర్వాత మరో అమ్మాయి.. తాను రష్మిక గౌతమ్ కోసం వచ్చానని తెలిపి ఓ ఫోటో గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ ఫోటోలో రష్మి.. అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, తన పెట్ డాగ్‌తో ఉంది. దానిని చూడగానే ఈ స్టార్ యాంకర్ ఎమోషనల్ అయ్యింది. 2023లో అమ్మమ్మ, చుప్‌కి (రష్మి పెంపుడు కుక్క), 2024లో తాతయ్యలు తనను వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని కన్నీటి పర్యంతమైంది. తర్వాత తన అభిమానిని హగ్ చేసుకుని ఆమెకు థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అభిమానులు .. తమ ఫెవరెట్ స్టార్స్ గురించి ఏం చెప్పారు? అభిమానుల కోసం సెలబ్రిటీలు ఏం చేశారు? తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











