నాకో చిన్న కోరిక.. రష్మీ తీర్చుతావా: అభిమాని ప్రపోజల్.. యాంకర్ ఏం చేశారంటే!

Recommended Video

Rashmi Gautam Responds On Her Fan Request || Filmibeat Telugu

సినీ తారలకు ప్రాణాలిచ్చే ఫ్యాన్స్ ఉండటం అనాదికాలంగా వస్తున్నది. సోషల్ మీడియా విజృంభిస్తున్న సమయంలో తారలపై ఫ్యాన్స్ అభిమానం చాలా తేలికగా బయటపడుతున్నది. కొందరూ ఏమీ ఆశించడకుండానే తమ నచ్చిన నటులను ఆరాధిస్తుంటారు. మరి కొందరు తమ ప్రేమను వ్యక్తీకరించి.. వారి నుంచి ఏదో పొందాలని చూడటం ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. తాజాగా యాంకర్, సినీ తార రష్మీకి అలాంటి వింత అనుభవం ఎదురైంది. అదేమిటంటే..

నాకు నీ విషెస్ కావాలి

నాకు నీ విషెస్ కావాలి

బుల్లితెర, వెండితెర మీద రాణిస్తున్న రష్మీ గౌతమ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అలాంటి రష్మిని ఓ అభిమాని ఓ కోరిక కోరాడు. తన బర్త్ డే రోజున నీ నుంచి విషెస్ కావాలి అని ట్విట్టర్‌లో ఆమెకు ఓ మెసేజ్ పెట్టారు. అందుకు ఆమె స్పందించారు. కానీ పూర్తి స్థాయిలో రెస్పాండ్ కాలేకపోయారనేది కనిపించింది.

జీవితం అసంపూర్తిగానే

రష్మికి అభిమాని పెట్టిన సందేశం ఇదే.. రష్మి గారు.. మీకు శుభోదయం. నాదో చిన్న కోరిక. ఈ రోజు నా బర్త్ డే. మీ నుంచి నేను విషెస్ కోరుకొంటున్నాను. మీరు నా పేరును పేర్కొంటూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపండి. మీరు విషెస్ తెలియజేయకుంటే జీవితంలో ఈ రోజుకు అర్ధం ఉండదు. నా బర్త్ డే అసంపూర్తిగానే గడచిపోతుంది. థ్యాంక్యూ మామ్ అంటూ మెసేజ్ పెట్టారు.

రష్మీ స్పందనకు రెస్పాన్స్

రష్మీ స్పందనకు రెస్పాన్స్

అభిమాని కోరికకు బాగానే స్పందించారు. కానీ అభిమాని పేరు చెప్పకుండా హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ చెప్పారు. అభిమాని పేరుతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఉంటే బాగుండేదేమో అనే వాదన సోషల్ మీడియాలో వినిపించింది. కానీ రష్మీ స్పందించిన తీరుపై సానుకూలంగా స్పందన వ్యక్తమైంది.

నెటిజన్ల ప్రశంసలతో

నెటిజన్ల ప్రశంసలతో

అభిమానికి రష్మి విషెస్ చెప్పడంపై నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ‘జన్మదిన శుభాకాంక్షలు చెప్పి అభిమాని రోజు మధురంగా మార్చావు. నాకు కూడా నీవంటే చాలా ఇష్టం. నవ్వుల రాణివి. మీరు అంటే మాకు చాలా ఇష్టం' అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. మీ నవ్వులో మ్యాజిక్ ఉంటుంది. ఆ నవ్వుకు యూత్‌ హృదయాన్ని ముక్కలు చేసేంత పవర్ ఉంటుంది అని మరో నెటిజన్ పేర్కొన్నారు.

బుల్లితెరపై టాప్‌గా

బుల్లితెరపై టాప్‌గా

రష్మీ గౌతమ్ కెరీర్ విషయానికి వస్తే, బుల్లితెరపై టాప్ యాంకర్‌గా మోత మోగిస్తున్నది. ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ జోడి, ఢీ 10, అనుభవించు రాజా, ఢీ 10 స్పెషల్, ఢీ జోడి లాంటి కార్యక్రమాల్లో హడావిడి చేస్తున్నది. గతేడాది రష్మి నటించిన అంతకు మించి సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X