సుడిగాలి సుధీర్‌తో పెళ్లి గురించి రష్మీ క్లారిటీ.. కులం పేరుతో డిసైడ్ చేస్తారా అని ఆగ్రహం..
టెలివిజన్ స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్, సుధీర్ కలిసి జబర్ధస్త్ కార్యక్రమంలో పాల్గొంటారనేది అందరికీ తెలిసిందే.
Recommended Video

టెలివిజన్ స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్, సుధీర్ కలిసి జబర్ధస్త్ కార్యక్రమంలో పాల్గొంటారనేది అందరికీ తెలిసిందే. అయితే వారి మధ్య ప్రేమాయణం జరుగుతున్నది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకొంటారు అనే ఊహాగానాలు ఇంటర్నెట్‌లో ఇటీవల ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను నటించిన నెక్ట్స్ నువ్వే చిత్రం గురించి రేష్మీ గౌతమ్ ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడింది. అయితే కొందరు నెటిజన్లు రేష్మీని తిక్క తిక్క ప్రశ్నలతో విసిగించారు. లైవ్‌లో ఉన్నందున్న చాలా ఓపికగా సమాధానమిచ్చింది. కొన్నిసార్లు నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్మీ ఆ లైవ్ చాట్‌కు సంబంధించిన వివరాలు ఇదిగో..

గీతా ఆర్ట్స్‌లో నటించడం..
నా తదుపరి చిత్రం నెక్ట్స్ నువ్వే. ఈ చిత్రానికి దర్శకుడు ప్రభాకర్. ఇటీవల ఆడియో రిలీజ్ అయింది. ఒకప్పుడు గీతా అర్ట్స్ సినిమాలు చూసి వావ్ అనుకొనే దానిని. అలాంటి సంస్థలో పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. బన్నీవాసు, అల్లు అరవింద్ నిర్మించే సినిమాలో నటించడం నా జీవితంలో గొప్ప విషయం.

హిట్, ఫ్లాప్ ఒకరిమీద ఆధారపడి..
రేష్మీ ఫేస్ బుక్ లైవ్‌లో మాట్లాడుతుండగా.. నెక్ట్స్ నువ్వే చిత్రం ఫ్లాప్ కావడం ఖాయం. నేను డిసైడ్ అయ్యాను అని ఓ నెటిజెన్ చేసిన వ్యాఖ్యలపై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. సినిమా ఫ్లాప్ లేదా హిట్ అనేది ఏ ఒక్కరిపైనా ఆధారపడి ఉండేది కాదు. కావున మీరు అలా కోరుకుంటే బెస్టాఫ్ లక్ అని రష్మీ వ్యాఖ్యానించింది. నెగిటివ్‌గా థింక్ చేయకూడదు అని సలహా ఇచ్చింది.

సొంత ప్రొఫైల్ పిక్ కూడా..
మేకప్ లేకుండా ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చిన రష్మీని నెటిజన్లు కామెంట్లతో విసిగించారు. మేకప్ లేకుండా కనిపించాలా వద్దా అనేది నా సొంత నిర్ణయం. నాకు నచ్చిన విధంగా ఉండాలని కోరుకొంటాను. ఒకరి కోసం నేను నా నిర్ణయాలు మార్చుకొను. సొంత ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవడం చాతకాని వాళ్లు నా మేకప్ గురించి మాట్లాడుతారా అని రష్మీ మండిపడింది.

భాషతో ప్రతిభను నిర్ధారిస్తారా?
తెలుగు భాష మాట్లాడటం రాని నువ్వు తెలుగు సినిమాల్లో నటించడం మానుకో అని ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను వైజాగ్‌లో పుట్టి పెరిగాను. నా తల్లి ఒరిస్సా, తండ్రి యూపీకి చెందిన వాళ్లు. నేను కేంద్రీయ విద్యాలయాల్లో చదివాను. అక్కడ ప్రాంతీయ భాషను ప్రోత్సహించరు. కేవలం హిందీనే నేర్పిస్తారు. కేవలం భాష, ప్రాంతం, కులాన్ని ఆధారంగా చేసుకొని ఒకరి ప్రతిభను అంచనా వేయవద్దు అని రష్మీ రఫ్ ఆడించింది.

సుడిగాలి సుధీర్‌తో పెళ్లి
సుడిగాలి సుధీర్‌తో పెళ్లి ఎప్పుడు చేసుకొంటున్నారని, ఇంకా ఏదో చాలా మంది అడుగుతుంటారు. కానీ సుధీర్ నేను ప్రొఫెషనల్‌గా మంచి స్నేహితులం. ఇద్దరం కలిసి జబర్దస్త్, ఢీ అనే రెండు షోలు చేస్తున్నాం. అదేకాకుండా చాలా ఈవెంట్లు చేస్తుంటాం.

మా మధ్య రిలేషన్ గురించి
షూటింగ్ సందర్భంగా చాలా క్లోజ్‌గా ఉంటాం. అలా అని మా మధ్య రిలేషన్ గురించి ఓ నిర్ణయానికి మీరు రావొద్దు. అందరితో క్లోజ్‌గా ఉన్నట్టే సుధీర్‌తో కూడా ఉంటాను. అంతా మాత్రాన ఇద్దరం పెళ్లి చేసుకొంటారా అని అడగడం సరికాదు.

ఫిబ్రవరిలో జబర్ధస్త్‌కు ఐదేళ్లు
సుధీర్ చేసే కొన్ని ఎపిసోడ్స్ చాలా ఎక్సైటింగ్‌గా ఉంటాయి. వాళ్లు చేసే స్కిట్స్ ఫన్నీగా బాగా ఉంటాయి. వచ్చే ఫిబ్రవరిలో జబర్ధస్త్‌కు ఐదేళ్లు పూర్తవుతుంది. సుధీర్, చంద్ర, ప్రకాశ్, రాంప్రసాద్ వారితో కలిసి ఐదేళ్లుగా పనిచేస్తున్నాను. కాబట్టి మా మధ్య క్లోజ్ రిలేషన్ ఉంటాయి. ఒకే వయసు ఉండటంతో ఎక్కువగా కనెక్ట్ అవుతాం
నాపై, సుధీర్‌పై దృష్టి..
సుధీర్ చేసే ఎపిసోడ్స్ చూసి ఎక్సైట్ అవుతానని చెప్పడం కరెక్ట్ కాదు. అందరూ చేసే స్కిట్లకు నేను రెస్పాండ్ అవుతాను. మీరందరూ కేవలం నాపై, సుధీర్‌పై మాత్రమే దృష్టిపెడుతారు. అందుకే మీకు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది అని రష్మీ ముఖం మీదే చెప్పేసింది.


Click it and Unblock the Notifications











