రష్మీ గౌతమ్ కోసం ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్.. స్టార్ యాంకర్ దిల్ ఖుష్
యాంకర్ రష్మీ గౌతమ్ తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ దక్కించుకుందో తెలిసిందే. తన టాలెంట్ తో తెలుగు టెలివిజన్ రంగంలో సెన్సేషన్ గా మారింది. టెలివిజన్ కంటే ముందే ఈ బ్యూటీ నటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ఎదురుచూసింది. తొలుత సుశాంత్ 'కరెంట్' మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ లో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో మెరిసింది. కానీ పెద్దగా ఫేమ్ దక్కించుకోలేక పోయింది. ఇక 2012లో ప్రారంభమైన 'జబర్దస్త్ : ఖతర్నాక్' కామెడీ షోకు యాంకర్ గా ఎంపికై సంచలనంగా మారింది.
బుల్లితెర ఆడియెన్స్ లో యాంకర్ గా రష్మీ గౌతమ్ నూటికి నూటి పాళ్లు సక్సెస్ అయ్యింది. తన మాటలతో, చలాకీ తనంతో, సదర్భోచిత వ్యాఖ్యలతో, పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే టెలివిజన్ రంగంలో స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరీయర్ కు ఎలాంటి ఢోకా లేదు. ఓవైపు జబర్దస్త్ కామెడీ షోతో పాటు మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.

అయితే ప్రస్తుతం టెలివిజన్ లో అద్బుతమైన షోలు రన్ అవుతున్నాయి. ఇప్పటికే ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షో వారినికి రెండు ఎపిసోడ్స్ ను అందిస్తోంది. మరోవైపు కామెడీ డోస్ ను పెంచేందుకు జబర్దస్త్ కామెడీ షోకు పోటీగా ఈటీవీలోనే శ్రీదేవీ డ్రామా కంపెనీ కామెడీ షోను కూడా పార్లర్ గా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు షోలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అయితే ఈ రెండు షోలకు యాంకర్ గా రష్మీ గౌతమే ఉండటం విశేషం. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ తో రష్మీ గౌతమ్ ప్రేక్షకులను వీక్ లో రెండు నుంచి మూడు రోజులు ఎంటర్ టైన్ చేస్తోంది.
ఇక తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. తాజా ఎపిసోడ్ లో యాంకర్ రష్మీ గౌతమ్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుల్లెట్ భాస్కర్ ఒక సర్ ప్రైజింగ్ వీడియోను చూపించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రష్మీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారని తెలుపుతూ ఒక వీడియో బైట్ ను ప్రదర్శించడం విశేషంగా మారింది. యాంకర్ రష్మీ గౌతమ్ కు ప్రభాస్ బర్త్ డే విషెస్ చెప్పడం ఏంటనీ అంతా షాక్ అయ్యారు.
అయితే, ప్రభాస్ గతంలో ఓ స్పెషల్ పర్సన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ వదిలిన వీడియో కావడం గమనార్హం. ఏదేమైనా ప్రభాస్ ద్వారా ఇలానైనా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయని యాంకర్ రష్మీ ఫుల్ ఖుష్ అయ్యింది. ఆ తర్వాత శ్రీదేవీ డ్రామా కంపెనీ ఆర్టిస్టులు, జడ్జీ ఇంద్రజ, హైపర్ ఆది, రాం ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, తాగుబోతు రమేష్ అందరూ కలిసి రష్మీ గౌతమ్ తో కేక్ కట్ చేయించారు. గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఏప్రిల్ 27న ఫుల్ ఎపిసోడ్ ఈటీవీ ఛానెల్ లో ప్రసారం కానుంది.


Click it and Unblock the Notifications











