ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: పెళ్లి పీటలెక్కబోతున్న రష్మీ సుధీర్.. అసలైంది జరగడంతో ఒప్పుకోక తప్పలేదంటూ!

తెలుగు బుల్లితెరపై సందడి చేసే యాంకర్లకు, మిగిలిన ఆర్టిస్టులకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎంతో మంది ఇలా రెండు రాష్ట్రాల్లో ఎనలేని గుర్తింపుతో పాటు పాపులారిటీని దక్కించుకుని సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. అయితే, కొందరు మాత్రం జంటలుగా క్రేజ్‌ను అందుకున్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన జోడీ రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్. జబర్ధస్త్ షో ద్వారా హైలైట్ అయిన వీళ్ల బంధం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా సుధీర్‌తో వ్యవహారంపై రష్మీ సంచలన ప్రకటన చేసింది. ఆ వివరాలు మీకోసం!

 ఇద్దరి కెరీర్‌లు అలా మొదలు.. ఇలా కలిశారు

ఇద్దరి కెరీర్‌లు అలా మొదలు.. ఇలా కలిశారు

కెరీర్ ఆరంభంలోనే కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపును దక్కించుకోలేకపోయింది రష్మీ గౌతమ్. ఇలాంటి సమయంలోనే జబర్ధస్త్ షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా పాపులర్ అయింది. ఇక, మెజీషియన్‌గా అడుగులు వేస్తూ జబర్ధస్త్ షో ద్వారా టాప్ కమెడియన్‌గా ఎదిగిపోయాడు సుధీర్. ఇప్పుడు బిగ్ సెలెబ్రిటీ అయ్యాడు.

యూట్యూబ్ జోడీగా ఫేమస్.. పెళ్లి కూడా అని

యూట్యూబ్ జోడీగా ఫేమస్.. పెళ్లి కూడా అని

యాంకరింగ్ రంగంలో రష్మీ గౌతమ్ సత్తా చాటుతోంది.. అదే సమయంలో సుడిగాలి సుధీర్ మాత్రం కమెడియన్‌గా అదరగొడుతున్నాడు. జబర్ధస్త్ షోలో వీళ్లిద్దరూ తరచూ తమ మధ్య ప్రేమ ఉన్నట్లు యాక్టింగ్ చేస్తున్నారు. దీంతో ఈ జంట ఫుల్ పాపులర్ అయింది. చాలా ఏళ్ల క్రితమే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు వచ్చాయి. దీంతో యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు కనిపించాయి.

 క్యాష్ చేసుకుంటున్నారుగా.. వీళ్లేమో హల్‌చల్

క్యాష్ చేసుకుంటున్నారుగా.. వీళ్లేమో హల్‌చల్

రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ మధ్య వచ్చిన వార్తలు మరో జంటపై రాలేదు. అంతలా వీళ్లిద్దరూ కొన్నేళ్లుగా బుల్లితెరపై సందడి చేస్తున్నారు. దీంతో వీళ్ల బంధంపై పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో తమ మధ్య ఏమీ లేదని క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. కానీ, షో నిర్వహకుల ప్లాన్ల కారణంగా లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు నటిస్తూ అయోమయానికి గురి చేస్తున్నారు.

 రష్మీ స్పందన ఇలా.. సుధీర్ అలాంటి కామెంట్లు

రష్మీ స్పందన ఇలా.. సుధీర్ అలాంటి కామెంట్లు

సుడిగాలి సుధీర్ విషయంలో రష్మీ గౌతమ్ మొదటి నుంచీ స్పష్టతతోనే ఉంది. అతడు తనకు ఫ్రెండ్ మాత్రమేనని చెబుతూనే ఉంది. అయితే, సుధీర్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే, ఇది స్క్రీన్ వరకే అని చెబుతుంటాడు. నిజానికి తనకు ఆఫర్లు రావడానికి, పేరు ప్రతిష్టలు పెరగడానికి యాంకర్ రష్మీనే కారణం అని సుధీర్ ఎన్నో సందర్భాల్లో ఒప్పుకున్నాడు కూడా.

 ఆయన రాకతో మళ్లీ మొదటికొచ్చిన వ్యవహారం

ఆయన రాకతో మళ్లీ మొదటికొచ్చిన వ్యవహారం

వచ్చే వారం ప్రసారం కానున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అదే సమయంలో ఆయన రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ మధ్య ఉన్న బంధాన్ని ప్రధానంగా హైలైట్ చేశాడు. దీంతో వీళ్లిద్దరూ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. అంతేకాదు, ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌ కూడా చెప్పడం విశేషం.

వెంట పడేది ఎవరు.. గట్టిగా అయిపోయిందంటూ

షోలో భాగంగా రాకేష్ మాస్టర్.. సుడిగాలి సుధీర్‌ను పిలిచి 'నువ్వు ఎవరినైనా లవ్ చేశావా' అని ప్రశ్నించాడు. దీనికి అతడు 'నేనెవరినీ చేయలేదు కానీ.. నా వెనుక ఓ అమ్మాయి పడుతుంది సార్' అంటూ రష్మీని చూపించాడు. దీంతో తన యాంకర్ చైర్ నుంచి వచ్చి 'రోజా గారూ.. నేను అతడి వెంట పడ్డానా' అని అడిగింది. ఆ వెంటనే వీళ్లిద్దరికీ సంబంధించిన కొన్ని విజువల్స్ చూపించారు.

Recommended Video

Mahesh Babu Enroute Dubai | Sarkaru Vaari Paata 2nd Schedule | Filmibeat Telugu
సుధీర్‌తో వ్యవహారంపై రష్మీ సంచలన ప్రకటన

సుధీర్‌తో వ్యవహారంపై రష్మీ సంచలన ప్రకటన

రొమాంటిక్‌ విజువల్స్ వేసిన తర్వాత రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ.. 'ఇష్టపడితే పెళ్లి చేసుకోవచ్చు కదా' అని ఇద్దరినీ అడిగాడు. అప్పుడు సుధీర్.. 'ఆల్రెడీ ఆహా నా పెళ్లంట అనే షోలో గట్టిగా జరిగింది' అంటూ బదులిచ్చాడు. అప్పుడు రష్మీ తనకు సుధీర్ అంటే ఇష్టమే అని చెప్పింది. దీంతో రాకేష్ మాస్టర్ వాళ్లిద్దరి చేతులను ఒక్కటి చేశాడు. దీంతో ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X