twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రాత్రి నా తప్పేమీ లేదు.. దారుణంగా ఫొటోలు, వీడియోలు తీశారు.. మనుషులేనా? యాంకర్ రష్మీ

    |

    Recommended Video

    Anchor Rashmi Responded About The Rumours | Filmibeat Telugu

    యాంకర్, యాక్టర్ రష్మీ గౌతమ్ ప్రయాణిస్తున్న కారు ఓ వ్యక్తిని ఢీకొట్టడం వివాదంగా మారింది. ప్రమాదం జరిగినప్పుడు రష్మీ కారు డ్రైవింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి విశాఖపట్నంకు సమీపంలోని గాజువాక వద్ద చోటుచేసుకొన్నది. ఈ ఘటనపై రష్మీ కారు‌ను సీజ్ చేశారని, ఆమెపై కేసు నమోదు చేశారని వచ్చిన వార్తలపై స్పందించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను రష్మీ స్వయంగా మీడియాకు ఇలా వెల్లడించారు.

    నేను డ్రైవర్ పక్క సీటులో

    నేను డ్రైవర్ పక్క సీటులో

    ఆదివారం రాత్రి వెబ్ సిరీస్‌కు సంబంధించిన షూటింగ్ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా, విశాఖపట్నంకు సమీపంలోని అగ్నంపుడి హైవే వద్ద ఓ వ్యక్తి రోడ్డు దాడుతుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో నేను కంపెనీ సమకూర్చిన కారులో ప్రయాణిస్తున్నాను. డ్రైవర్ పక్క సీటులోనే కూర్చున్నాను. నేను కారు నడుపుతున్నట్టు వచ్చిన కథనాల్లో వాస్తవం లేదు అని రష్మి చెప్పారు.

    దువ్వాడ పోలీస్ స్టేషన్‌లో కేసు

    దువ్వాడ పోలీస్ స్టేషన్‌లో కేసు

    కారు ఓ వ్యక్తిని ఢీకొట్టగానే 108 సర్వీస్‌కు ఫోన్ చేశాను. అంబులెన్స్ రావడానికి లేట్ అవుతుండంతో బాధితుడిని ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్పించాం. ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించాం. ఈ ఘటనపై దువ్వాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. డ్రైవర్ ఎంఏ గౌతమ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను. వివరణ ఎందుకు ఇస్తున్నానంటే.. నాపై వస్తున్న రూమర్లు, బాధ్యతారహితమైన కథనాల్లో వాస్తవాలను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అని రష్మీ పేర్కొన్నారు.

    వ్యక్తిని ఢీ కొట్టిన యాంకర్ రష్మీ కారు.. పరిస్థితి విషమం!వ్యక్తిని ఢీ కొట్టిన యాంకర్ రష్మీ కారు.. పరిస్థితి విషమం!

    ఏ ఒక్కరు సహాయం చేయలేదు

    ఏ ఒక్కరు సహాయం చేయలేదు

    ప్రమాదం జరగగానే ఆ ప్రాంతంలో కొందరు వ్యక్తులు గుమిగూడారు. అక్కడ చాలా మంది ఉన్నారు కానీ.. ఏ ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కారు అద్దాలు దించగానే ఫొటోలు, వీడియోలు తీసుకోవడం ప్రారంభించారు. కనీసం సహాయం చేయాలనే ఆలోచన చేయకుండా వారు ప్రవర్తింస్తే కోపం వచ్చింది. మనిషి ప్రాణం పోతుంటే ఇలానే ప్రవర్తిస్తారా? అని ప్రశ్నిస్తే.. ఏంటమ్మా కారు నడిపేది ఇలానేనా? తిరిగి వాళ్లు నన్ను ప్రశ్నించారు అని రష్మి చెప్పారు.

     కనీసం అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదు

    కనీసం అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదు

    గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తీసుకెళ్లమని డిమాండ్ చేసి నాతో గొడవకు దిగారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయలేదు. గాయపడిన వ్యక్తికి కనీసం సహాయం చేయాలనే స్పృహ కూడా లేదు. ఆ సమయంలో పరిస్థితి చూసి కొందరు యువకులు ముందుకు వచ్చారు. కొందరి ప్రవర్తనతో నేను ఆ సమయంలో విసిగిపోయాను అని రష్మి చెప్పారు.

    అందుకే వాహనదారుడు పారిపోతారా?

    అందుకే వాహనదారుడు పారిపోతారా?

    కారు ప్రమాదం జరిగిన వెంటనే వాహనం దారుడు ఎందుకు పారిపోతాడో ఇప్పుడు నాకు అర్థం అయింది. ప్రమాదం జరిగితే సహాయం చేయకపోగా, వాహనదారుడిని నానా రకాలుగా వేధిస్తారు. నాకు అలాంటి పరిస్థితి ఎదురైంది. అలాంటి పరిస్థితుల్లో సహాయం చేయాలనే కోరిక కూడా చచ్చిపోతుంది అని రష్మీ ఆవేదన వ్యక్తం చేసింది.

     గాయపడిన వ్యక్తిదే తప్పని

    గాయపడిన వ్యక్తిదే తప్పని

    భగవంతుడి దయ వల్ల బాధితుడు ఆరోగ్యంతో ఉన్నాడు. గాయపడిన వ్యక్తిదే తప్పని నేను వంద కారణాలు చెబుతాను. కానీ బాధితుడిని ఇంకా మానసికంగా గాయపరుచలేను. మంచి ట్రీట్‌మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించాం. అతడి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని వైద్యులు చెప్పారు. నా ప్రొడక్షన్ టీమ్ అన్ని రకాల సహాయం అందించారు అని రష్మీ చెప్పింది.

    ప్రమాద సంఘటన దురదృష్టకరం

    ప్రమాద సంఘటన దురదృష్టకరం

    రోడ్డు ప్రమాదంలో జరిగిన విషయాలకు నేను చాలా మనస్తాపం చెందాను. ఇందులో నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు మౌనంగా ఉండాలి. జరిగిన ప్రమాదం దురదృష్టకరం. దానికి మేమే పూర్తి బాధ్యతను తీసుకొన్నాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్లకుండా రోడ్డు దాటడం బాధితుడి తప్పు. రోడ్డుకు ఇరువైపుల వీధి దీపాలు వెలుగకపోవడం చీకటిగా ఉంది. అధికారులు కనీసం ఈ విషయాన్ని పట్టించుకోలేదనేది స్పష్గంగా కనిపించింది అని రష్మి చెప్పింది.

    English summary
    A news report claimed that Telugu actress Rashmi Gautam rammed her car into a pedestrian in Kurmannapalem in Gajuwaka of Visakhapatnam. The actress was reportedly driving her car at a high speed and rammed into a pedestrian who was trying to cross the road.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X