twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైరల్ వీడియో : రంగంలోకి దిగిన రష్మీ.. బకెట్ పట్టుకుని రోడ్లపైకి!!

    |

    కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా అట్టుడికిపోతోంది. విరుగుడే లేని కరోనా వైరస్ ప్రపంచంపై విరుచుకుపడుతోంది. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా కుదేలవుతోంది. మన దేశంలోనూ కరోనా శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే మూడు వేల మందికిపైగా కరోనా సోకింది. కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించడంతో జనమంతా ఇంటికి పరిమితమయ్యారు. అయితే ఈ పరిస్థితుల్లో మూగ జీవుల పరిస్థితి దయనీయంగా మారింది.

    Recommended Video

    Anchor Rashmi Gautam Feeding Road Dogs During Lockdown!
    వైరస్ వ్యాప్తి అంటూ రూమర్స్..

    వైరస్ వ్యాప్తి అంటూ రూమర్స్..

    మూగజీవాల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని రూమర్స్ వ్యాప్తి చెందాయి. దీంతో పెద్ద మొత్తంలో మూగజీవాలను నడి రోడ్డుపై వదిలేశారు. అంతేకాకుండా లాక్ డౌన్ వల్ల జనమంతా ఇంటి పట్టునే ఉండటంతో మూగజీవాలను ఆహారం దొరక్కా బిక్కుబిక్కుమంటున్నాయి.

    మూగజీవాల కోసం రష్మీ ముందడుగు..

    మూగజీవాల కోసం రష్మీ ముందడుగు..


    బుల్లితెరపై జబర్దస్త్ ఎంత ఫేమస్సో.. అందులో యాంకర్స్ అంత ఫేమస్. బుల్లితెరపై రష్మీ ఎలా ఉంటుందో.. వ్యక్తిగత జీవితంలో దానికి భిన్నంగా ఉంటుంది. రష్మీకి మూగజీవాల పట్ల మక్కువ ఎక్కువ. నిత్యం వాటి కోసం, వాటి పరిరక్షణ కోసం పరితపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలోనూ వాటి గురించే పోస్ట్ చేస్తూ ఉంటుంది.

    స్వచ్చంద సంస్థలతో కలిసి..

    స్వచ్చంద సంస్థలతో కలిసి..

    లాక్ డౌన్ సమయంలో మూగ జీవాలకు ఆహారం అందడం లేదని గుర్తించిన రష్మీ.. స్వచ్చంద సంస్థతో కలిసి ముందడుగు వేసింది. మూగజీవాలకు ఆహారాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎవ్వరైనా సరే ఆహారం లేదని ట్వీట్ చేస్తే చాలు వారికి అందేలా చేస్తోంది రష్మీ.

    బకెట్ పట్టుకుని రంగంలోకి..


    తాజాగా రష్మీ బకెట్ పట్టుకుని రంగంలోకి దిగింది. మూతికి మాస్క్, చేతికి గ్లౌవ్స్ పెట్టుకుని వీధి కుక్కలకు ఆహారాన్ని పంచింది. కుక్కులకు ప్రేమగా ఆహారాన్ని పెట్టసాగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

    English summary
    Rashmi Gautam On Road To Feed Dogs. During Lock Down Time Rashmi Gautham Come to Road, ANd Feed The Street Dogs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X