ఔను ప్రేమలో ఉన్నా .. వాడే మొగుడిగా రావాలంటూ శివయ్యకి మొక్కుకున్న రష్మి

కొత్త కొత్త రియాలిటీ షోలు, కార్యక్రమాలతో తెలుగు ఎంటర్‌టైన్మెంట్‌ రంగంలో ఈటీవీ దూసుకెళ్తోంది. ఈ ఛానెల్‌కు ల్యాండ్ మార్క్ అన్నట్లుగా తయారైన జబర్దస్త్‌కు అప్‌డేటెడ్ వెర్షన్ అన్న గుర్తింపు తెచ్చుకున్న ప్రోగ్రామ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. దాదాపుగా జబర్దస్త్‌లోని స్టాండప్ కమెడియన్లే ఈ షోను నడిపిస్తుండటం కామెడీ టైమింగ్ కూడా బాగుండటంతో ప్రేక్షకులు శ్రీదేవి డ్రామా కంపెనీని బాగానే ఆదరిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమోను ఈటీవీ రిలీజ్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.

తాజాగా నవంబర్ 17వ తేదీకి సంబంధించి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోని ఈటీవీ రిలీజ్ చేసింది. కార్తీక పౌర్ణమి కావడంతో దాని బ్యాక్‌డ్రాప్‌లో షోని ప్లాన్ చేశారు నిర్వాహకులు. తొలుత ఆటో రామ్ ప్రసాద్ తన టీమ్ మెంబర్స్‌తో ఈ పండక్కి తన బావ సత్యం వస్తున్నాడని చెబుతాడు. కట్ చేస్తే తాగుబోతు రమేశ్ బ్యాగ్ తగిలించుకుని స్టేజ్ మీదకు ఎంట్రీ ఇస్తాడు. మా వాడు చిన్నప్పుడు సినిమాల్లో యాక్ట్ చేసేవాడని, మూడు పేజీల డైలాగ్స్ ఇచ్చినా చెప్పేసేవాడని రాంప్రసాద్ అంటాడు. ఏం చెప్పేవాడని నూకరాజు అడగ్గా.. నావల్ల కాదని చెప్పేసేవాడని ప్రసాద్ పంచ్ విసరడంతో అంతా నవ్వేస్తారు. అనంతరం లేడీ కంటెస్టెంట్స్‌ని స్టేజ్‌పైకి పిలుస్తారు.

rashmi Gautam open up on her love at Sridevi Drama Company show

అమ్మ విలువ ఎప్పుడు తెలిసింది నీకు అని నూకరాజును రష్మీ అడుగుతుంది. జబర్దస్త్‌కు శివాజీ గారు జడ్జిగా వచ్చినప్పుడు అని ఆన్సర్ ఇస్తాడు నూకరాజు. తర్వాత చిన్నారులు తమ స్వీట్ వాయిస్‌తో అద్భుతంగా పాటలు పాడి కంటెస్టెంట్స్‌ని, ఆడియన్స్‌ని మెప్పించారు. అనంతరం లేడీ కంటెస్టెంట్స్‌ కళ్లకి గంతలు కట్టి.. స్కిప్పింగ్ ఆడిస్తారు. తాడు తిప్పడం ఆపేసినా వారు గాల్లోకి ఎగురుతూనే ఉండటంతో జడ్జి ఇంద్రజ సహా అంతా నవ్వేస్తారు. తర్వాత రామ్ ప్రసాద్ స్కిప్పింగ్ ఆడుతుండగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే పాటతో పంచ్‌లు విసురుతాడు.

అనంతరం లేడీ కంటెస్టెంట్స్‌తో తిరగలి తిప్పించే గేమ్ పెట్టగా.. సీనియర్ నటి శృతి యమ స్పీడుగా తిప్పేస్తారు. తర్వాత నూకరాజు, రామ్ ప్రసాద్, పంచ్ ప్రసాద్ కలిసి ఓ స్కిట్ చేస్తారు. ఎవర్రా వీడిని హీరోగా సెలెక్ట్ చేసిందని రాంప్రసాద్‌ను ఉద్దేశించి నూకరాజు అడగ్గా.. నువ్వేనంటూ పంచ్ ప్రసాద్ సెటైర్లు వేస్తాడు. ఈ స్కిట్‌లోనే శృతి పవర్‌ఫుల్ రోల్‌లో నటించడంతో అంతా షాక్ అవుతారు. కాసేపటికి కార్తీక పౌర్ణిమ సందర్భంగా నీటిలో దీపాలను వదులుతారు లేడీ కంటెస్టెంట్స్.

ఓ మంచి దేవుడా నేను మనసులో ఎవరిని కోరుకుంటున్నానో వాడే నాకు మొగుడిగా రావాలని రష్మి చెబుతుంది. ఎవరిని కోరుకున్నావ్? ఎవరు వాడు? అని రాంప్రసాద్ అడగ్గా రష్మి సిగ్గు పడుతుంది. ఎలా ఉంటాడో ఒక రెండు పోలికలు చెప్పమని నూకరాజు అడగ్గా.. నాకు కాబోయే మొగుడు గుర్రం మీద వస్తాడని రష్మి చెబుతుంది. అంతా కరెక్ట్‌గానే చెప్పారు.. అది గుర్రం కాదు, గోట్ ఏమో చూడండి అని ఇంద్రజ సెటైర్లు వేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. మరి రష్మిని పెళ్లాడబోయే అదృష్టవంతుడు ఎవరు ..? తెలియాలంటే నవంబర్ 17 వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఆ ప్రోమోని మీరు కూడా చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X