For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీ అడ్రస్ చెప్పు.. నేను చూసుకొంటా.. నెటిజన్‌ ట్వీట్‌పై రష్మీ గౌతమ్ రియాక్షన్

    |

    తెలుగు టెలివిజన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో రష్మీ గౌతమ్ రేంజ్‌ ఏంటో ప్రత్యేకంగా, కొత్తగా చెప్పనక్కర్లేదు. బుల్లితెర మీద చలాకీగా కనిపించే రష్మీ సోషల్ మీడియాలో అంతే చురుకుగా కనిపిస్తారు. కోపం వస్తే విరుచుకుపడుతారు.. మానవత్వం ప్రదర్శించాల్సి వస్తే వెంటనే తన మనసును కరిగించేస్తారు. గతంలో సోషల్ మీడియాలో రష్మీ గౌతమ్ స్పందించిన తీరు ఎంతగానో ఆకట్టుకొన్నది. తాజాగా రష్మీ స్పందించిన తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. టాప్ యాంకర్ స్పందించిన తీరు ఏమిటంటే..

     సామాజిక సమస్యలపై రష్మీ గౌతమ్

    సామాజిక సమస్యలపై రష్మీ గౌతమ్

    యాంకర్ రష్మీ ఇటీవల కాలంలో సామాజిక సమస్యలపై గట్టిగానే స్పందిస్తున్నారు. లాక్‌డౌన్‌లో వీధి కుక్కల కష్టాలపై పలుమార్లు స్పందించారు. రోడ్లపైకి వచ్చి వీధి కుక్కలకు భోజనం, నీళ్లు లాంటి స్వయంగా ఏర్పాటు చేయడమే కాకుండా ఇతరులను కూడా స్పందించాలని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇలా అనేక సామాజిక విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు.

     పుస్తకాలు కొనుక్కొనే స్థోమత లేదు

    పుస్తకాలు కొనుక్కొనే స్థోమత లేదు

    తాజాగా ఓ నిరుద్యోగి సహాయం అందించాలని రష్మీ గౌతమ్‌కు ట్వీట్ చేశారు. మేడమ్ దయచేసి నాకు సహాయం చేయండి. నేను పోటీ పరీక్షలకు కోసం ప్రిపేర్ అవుతున్నాను. డిసెంబర్ 15వ తేదీన నాకు పరీక్ష ఉంది. ఆ పరీక్షకు సన్నద్ధం కావడానికి రెండు పుస్తకాలు కావాలి. వాటిని కొనుక్కొనే స్థోమత నా వద్ద లేదు. ఒకవేళ నాకు మీరు ఆ రెండు పుస్తకాలు కొనిస్తే నా విజయానికి మీరు కారణం అవుతారు. ఎలాగైనా నేను ఈ జాబ్‌ను సంపాదించాలి. దయచేసి నాకు ఈ చిన్న సహాయం చేసిపెట్టు అక్కయ్య. థ్యాంక్యూ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.

     అక్కయ్య.. నాకు సహాయం చేయండి

    అక్కయ్య.. నాకు సహాయం చేయండి

    రష్మీ గౌతమ్‌కు నిరుద్యోగి ట్వీట్‌ చేస్తూ రైల్వే, ఎన్టీపీసీ ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షల కోసం రూపొందించిన రెండు పుస్తకాల ఇమేజ్‌ను పోస్టు చేశాడు. ఆ రెండు పుస్తకాలను తనకు ఇప్పిస్తే ఉద్యోగం సంపాదించేందుకు కష్టపడుతానని చెప్పడంతో రష్మీ మనసు కరిగిపోయింది. దాంతో ఆ నిరుద్యోగి ట్వీట్‌కు స్పందించారు.

     నీ అడ్రస్ చెప్పు.. నేను పంపిస్తా

    నీ అడ్రస్ చెప్పు.. నేను పంపిస్తా

    నిరుద్యోగి ట్వీట్‌కు స్పందిస్తూ.. నీ అడ్రస్ పెట్టు.. నేను వాటిని కొని మీకు పంపిస్తాను అంటూ క్లుప్తంగా సమాధానం ఇచ్చారు. దానికి స్పందిస్తూ మీ అడ్రస్ చెప్పు నేను వాటిని మీకు పంపుతాను అంటూ బదులిచ్చారు. ఈ ట్వీట్‌పై నెటిజన్ స్పందిస్తూ.. మీరేం కంగారు పడొద్దు. రష్మీ ఎలాంటిదో నాకు తెలుసు. మేడమ్ నీకు తప్పుకుండా సహాయం చేస్తుంది. మీ అడ్రస్ ఇచ్చి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

    Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
    రష్మీ గౌతమ్ కెరీర్ ఇలా..

    రష్మీ గౌతమ్ కెరీర్ ఇలా..

    తెలుగు టెలివిజన్‌ రంగంలోనే కాకుండా సినీ రంగంలో కూడా రష్మీ గౌతమ్ తన గ్లామర్‌తో ఆకట్టుకొన్నారు. జబర్దస్త్‌, ఢీ జోడి, ఢీ ఛాంపియన్స్, అనుభవించు రాజా లాంటి రియాలిటీ షోలలో మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే గర్ల్ పవర్.. సరిలేరు నీకెవ్వరు అనే క్రీడా కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే శివరంజని అనే చిత్రంలో నటిస్తున్నారు.

    English summary
    Anchor and Actor Rashmi Gautam is top celebrity in the present day entertainment industry. Rashmi always reacts on social causes. Recently, She reacted to a tweet from unemploy student for competitve exam preparations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X