సుధీర్ ప్రపోజల్‌ను రిజెక్ట్ చేసిన రష్మీ.. అసలు కారణం అదే అంటూ ప్రచారం

By Manoj

టాలీవుడ్ హీరోయిన్ కమ్ యాంకర్ రష్మీ గౌతమ్ - జబర్ధస్త్ ఫేం సుడిగాలి సుధీర్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగు వారికి దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ఐదేళ్లుగా వీళ్లపై వచ్చినన్ని రూమర్స్ మరే జంటపై వచ్చి ఉండవు. జంటగా షోలు చేయడం.. అప్పుడప్పుడు స్పెషల్ షోలు చేయడంతో వీళ్ల మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ జంటకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఆ వార్త ఏంటి..? పూర్తి వివరాల్లోకి వెళితే..

 రష్మీ - సుధీర్‌.. యూట్యూబ్ జోడీ

రష్మీ - సుధీర్‌.. యూట్యూబ్ జోడీ

రష్మీ - సుధీర్‌ను యూట్యూబ్ జోడీగా పిలుస్తుంటారు. సామాన్య ప్రజలే కాదు.. చాలా మంది ఫ్రెండ్స్ కూడా వాళ్లను ఇలాగే అంటుంటారు. దీనికి కారణం వీళ్లిద్దరిపై యూట్యూబ్‌ చానెళ్లలో వచ్చినన్ని రూమర్లు మరే జోడీపై రాకపోవడమే. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేసుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇలా ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి.

 చెప్పినా వినడం లేదు

చెప్పినా వినడం లేదు

ఒకవైపు సుధీర్.. మరోవైపు రష్మీ తమ మధ్య ఏమీ లేదని ఎన్నో సార్లు క్లారిటీ కూడా ఇచ్చారు. సోషల్ మీడియాలో పలుమార్లు వీళ్లకు ఇదే తరహా ప్రశ్నలు ఎదురయ్యాయి. అప్పుడే దీనిపై స్పష్టత ఇచ్చారు. ఒకానొక సందర్భంలోనైతే రష్మీ ఓ నెటిజన్‌తో గొడవ కూడా పెట్టుకుంది. అయినా, వీళ్లపై వచ్చే పుకార్లు ఆగడం లేదు. నెటిజన్లు మాత్రం తరచూ ఏదో ఒక సందర్భంలో వీళ్ల మధ్య బంధం గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు.

 ఆకట్టుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు

ఆకట్టుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు

బుల్లి తెరపై వస్తున్న ఎన్నో ప్రోగ్రాముల్లో రష్మీ - సుధీర్‌కు ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఈ మేరకు రైటర్లు, డైరెక్టర్లు వీళ్ల మధ్య ఏదో ఉన్నట్లు చూపించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు ఈ తరహా సీన్లను చూపించారు. వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ బాగా పేలుతున్నాయి.

 రష్మీ లేకపోతే సుధీర్ లేడట

రష్మీ లేకపోతే సుధీర్ లేడట

ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే ‘ఢీ' షోలో సుధీర్ తమ బంధంపై కొద్ది రోజుల క్రితం స్పందించిన విషయం తెలిసిందే. ‘రష్మీ అనే అమ్మాయి లేకపోతే నాకు ఇంత పేరు వచ్చేది కాదు. సుధీర్ అంటే నా టాలెంట్ గురించి మాట్లాడరు. సుధీర్ - రష్మీ అంటారు. ఈ అమ్మాయి నా లైఫ్‌లో లేకపోతే నాకు లైఫే లేదు. ఆమె ప్రభావం నాపై ఎంతో ఉంది' అని అప్పుడు చెప్పుకొచ్చాడు.

 సుధీర్ ప్రపోజల్.. రష్మీ రిజెక్ట్

సుధీర్ ప్రపోజల్.. రష్మీ రిజెక్ట్

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన చిత్రం ‘సాఫ్ట్‌వేర్ సుధీర్'. శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై పారిశ్రామికవేత్త కే శేఖర్‌ రాజు నిర్మించిన ఈ సినిమాను రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల తెరకెక్కించాడు. ఇందులో సుధీర్ సరసన ధన్య బాలకృష్ణ నటిస్తోంది. ఈమె చేస్తున్న పాత్రకు ముందు రష్మీని అనుకున్నారట. ఈ మేరకు ఆమెను సుధీర్ సంప్రదించాడట. అయితే, ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా ఈ ప్రపోజల్‌ను తిరస్కరించిందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X