స్కూల్‌లో క్యాండిల్స్‌ అమ్మా.. 1200 కోసం అలాంటి కష్టం.. యాంకర్ రష్మి ఎమోషనల్

జీవితం ఎవ్వరికి వడ్డించిన విస్తరి కాదు.. ఎంతో కష్టపడితేనే కానీ పోరాడి గెలవలేం. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలుగా వెలుగొందుతున్న వారు కూడా ఎంతో కష్టపడితేనే ఈ స్థాయికి చేరుకున్నారు. పలు ఇంటర్యూలలో స్టార్స్ తాము పడిన బాధలు, కష్టాలు, అవమానాలు, కన్నీళ్లను పంచుకుంటూ ఉంటారు. తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా దూసుకెళ్తున్న రష్మి గౌతమ్ తన చిన్నతనంలో పడ్డ కష్టాల గురించి వివరించారు. ఈ వివరాల్లోకి వెళితే..

హీరోయిన్ కావాలనే ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రష్మీ గౌతమ్.. అప్పుడెప్పుడో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన హోలీ సినిమాలో సునీల్‌తో జంటగా నటించారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్నా చితకా రోల్స్ చేసింది. అయితే సినిమాలలో బ్రేక్ రాకపోవడంతో ఆమె యాంకరింగ్ వైపు అడుగులు వేశారు. తెలుగు పెద్దగా రానప్పటికీ తన గ్లామర్‌తో బుల్లితెరపై సక్సెస్ అయ్యింది. జబర్దస్త్ యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ నాటి నుంచి ఈటీవీలో సందడి మొత్తం రష్మీదే అయ్యింది. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు కొన్ని ప్రోగ్రామ్స్ చేసింది. దాదాపు 13 ఏళ్లుగా ఏ ఛానెల్‌కు వెళ్లకుండా ఈటీవీని, మల్లెమాల సంస్థను అంటిపెట్టుకునే ఉన్నారు.

Rashmi Gautam Reveals Her First Earnings and Childhood Struggles Shares Financial Advice

ఇక జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీ కారణంగా సుడిగాలి సుధీర్- రష్మీ గౌతమ్‌లు ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోందని ఎన్నోసార్లు గాసిప్స్ వచ్చాయి. అయితే ఇదంతా నిజం కాదని కేవలం ప్రేక్షకులను అలరించేందుకు అలా క్రియేట్ చేశారని వీరిద్దరూ పలుమార్లు తెలిపారు కూడా. అయినప్పటికీ ఈ పుకార్లకు మాత్రం చెక్ పడటం లేదు. ఎప్పటికైనా సుధీర్- రష్మిలు ఒక్కటవుతారంటూ వారి అభిమానులు చెబుతున్నారు.

ప్రస్తుతం జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు రష్మి గౌతమ్. ప్రతి వారం బుల్లితెర సెలబ్రిటీలను ఒక చోటికి చేర్చి వారితో సందడి చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రతివారం ఓ థీమ్‌తో ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ వారం ప్రసారమైన ఎపిసోడ్‌లో బుల్లితెర సెలబ్రిటీలను వారి జీవితంలో తొలి సంపాదన ఎంత? దానితో ఏం చేశారు? అని వారి స్వీట్ మెమొరీస్‌ను టచ్ చేసింది రష్మీ. దాంతో హైపర్ ఆది, దీపికా రంగరాజు, పొట్టి నరేష్, ఆర్జే శేఖర్ భాషాతో పాటు జడ్జి ఇంద్రజ తదితరులు తమ మొదటి జీతం, దానితో ఏం చేసింది చెప్పుకొచ్చారు. చివరిలో నీ ఫస్ట్ శాలరీ ఎంత? అంటూ దీపిక రంగరాజు అడగటంతో తన చిన్నప్పటి జ్ఞాపకాలను బయటపెట్టింది రష్మి.

నా స్కూల్ ఫెయిర్‌లో నేను ఫస్ట్ సంపాదించా. నాకు చిన్నప్పటి నుంచి క్యాండిల్స్ చేయడం ఇంట్రెస్ట్. పదో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్ ఫెయిర్ జరిగింది. దానికి నేను క్యాండిల్స్ చేసి.. వాటిని స్కూల్ ఫెయిర్‌లో అమ్మాను. అప్పుడు 1200 రూపాయల లాభం వచ్చింది, చిన్నపిల్లని.. స్కూల్ ఫెయిర్‌లో పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేశారని చెప్పింది రష్మి. మరి ప్రేక్షకులకు ఇచ్చే ఫైనాన్షియల్ అడ్వైజ్ ఏంటీ? అని ఇంద్రజ అడగ్గా.. నేను కూడా హైపర్ ఆదిగారిలా భూమీ మీద, గోల్డ్ మీద ఎక్కు నమ్మకం పెట్టుకుంటా. మీరు 35 శాతం పొదుపు ఉండాలని చెప్పారు.. కానీ మా తాతగారు మాత్రం డబ్బులు రాగానే 70 శాతం సేవింగ్స్‌కే కేటాయించేవారు. కేవలం 30 శాతంతోనే ఖర్చులు, ఇతర అవసరాలు తీర్చుకోవాలని కండీషన్ పెట్టారు అని రష్మీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X