సుధీర్‌కు షాకిస్తూ రెచ్చిపోయిన రష్మీ: అర్జున్ రెడ్డి తరహాలో ఆయనతో ఘాటుగా.. చివరికి తట్టుకోలేక!

వెండితెరపైన గ్లామర్‌కు పెద్దపీట వేస్తుంటారన్న టాక్ ఉండేది. కానీ, బుల్లితెరపైన వచ్చే కార్యక్రమాల్లో సైతం యాంకరింగ్ చేయడం కోసం అందమైన అమ్మాయిల మధ్యనే పోటీ ఉంటోంది. ఇలా టెలివిజన్ హిస్టరీలో ఎంతో మంది యాంకర్లుగా ఎంట్రీ ఇవ్వగా.. అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును దక్కించుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్ ఒకరు. చాలా కాలంగా తన హవాను చూపిస్తూ దూసుకుపోతోందామె. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

ఆమె వెళ్లడంతో మొదలై.. జబర్ధస్త్‌గా కెరీర్

ఆమె వెళ్లడంతో మొదలై.. జబర్ధస్త్‌గా కెరీర్

తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. ఇందులో మొదట అనసూయ భరద్వాజ్ యాంకర్‌గా ఉండేది. ఆమె అనివార్య కారణాల వల్ల తప్పుకోవడంతో రష్మీ గౌతమ్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన శైలి యాంకరింగ్‌తో ఆకట్టుకుంటోందీ భామ. అదే సమయంలో గ్లామర్‌గా కనిపిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

ఢీ కొడుతోంది.. అప్పుడప్పుడూ రొమాన్స్

ఢీ కొడుతోంది.. అప్పుడప్పుడూ రొమాన్స్

జబర్ధస్త్ షో ద్వారా రష్మీ గౌతమ్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. జనాల్లో క్రేజ్ రావడంతో పాటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవడంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇందులో భాగంగానే డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ'లోనూ ఓ టీమ్‌కు మెంటర్‌గా పని చేస్తోంది. దాదాపు నాలుగేళ్లుగా ఆ షోలో తన మార్క్ చూపిస్తోంది. అప్పుడప్పుడూ సుధీర్‌తో రొమాన్స్ కూడా చేస్తూ మెప్పిస్తోంది.

అతడితో ప్రేమాయణంతో ఫుల్ పాపులారిటీ

అతడితో ప్రేమాయణంతో ఫుల్ పాపులారిటీ

రష్మీ గౌతమ్ యాంకర్‌గా ఎంత గుర్తింపు తెచ్చుకున్నదో... అంతకంటే ఎక్కువ శాతం జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ వల్ల సంపాదించుకుంది. అతడితో ప్రేమాయణం సాగిస్తుందన్న ప్రచారం వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఐదేళ్ల నుంచి వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని ఎన్నిసార్లు ఖండించినా ప్రచారం ఆగడం లేదు.

రష్మీ అందాలతో హిట్.. మిగిలినవన్నీ ఫ్లాప్

రష్మీ అందాలతో హిట్.. మిగిలినవన్నీ ఫ్లాప్

యాంకర్‌గా ఎనలేని కీర్తిని సంపాదించుకున్న రష్మీ గౌతమ్... హీరోయిన్‌గా మాత్రం మంచి గుర్తింపును అందుకోలేకపోయింది. ఆమె ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేసింది. వాటిలో 'గుంటూరు టాకీస్' మినహా ఏ సినిమా హిట్ అవలేదు. ఇందులో ఆమె హాట్ షో చేసి ఈ ఫలితాన్ని రాబట్టింది. మిగిలిన వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా యావరేజ్ టాక్‌ను కూడా తెచ్చుకోలేదు.

రెచ్చిపోయిన రష్మీ... అర్జున్ రెడ్డి తరహాలో

రెచ్చిపోయిన రష్మీ... అర్జున్ రెడ్డి తరహాలో

అటు జబర్ధస్త్.. ఇటు ఢీ షోలో తరచూ సుడిగాలి సుధీర్‌తో రొమాంటిక్ డ్యాన్సులు చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది యాంకర్ రష్మీ గౌతమ్. అయితే, ఈ సారి ఊహించని విధంగా జడ్జ్‌ అయిన శేఖర్ మాస్టర్‌తో రెచ్చిపోయి మరీ రొమాంటిక్ డ్యాన్స్ చేసిందామె. ఢీ షోలో భాగంగా 'అర్జున్ రెడ్డి' సినిమాలోని మధురమే సాంగ్‌కు రష్మీ.. ఆయనతో కలిసి అదిరిపోయే ప్రదర్శన ఇచ్చింది.

Recommended Video

Mahesh Babu Enroute Dubai | Sarkaru Vaari Paata 2nd Schedule | Filmibeat Telugu
ఆపకపోతే వచ్చే పండుగ దాక వేస్తూనే ఉంటాడు

ఆపకపోతే వచ్చే పండుగ దాక వేస్తూనే ఉంటాడు

ఢీ షోలోని లేడీ టీమ్ లీడర్లు అయిన రష్మీ గౌతమ్, దీపికతో కలిసి శేఖర్ మాస్టర్ రొమాంటిక్ డ్యాన్స్ చేశాడు. దీంతో విసుగెత్తిపోయిన సుధీర్.. హైపర్ ఆది ఆ పాటను ఆపించారు. అంతేకాదు, 'మీరు పాట ఆపకపోతే వచ్చే పండుగ దాక వేస్తూనే ఉంటాడు' అంటూ పంచ్ వేశాడు ఆది. దీంతో ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలు రకాల కామెంట్స్ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X