రష్మి గౌతమ్‌ జబర్దస్త్‌లోకి రాకపోయుంటే? యాంకర్ పరువు తీసేసిన ఏఐ..

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 13 ఏళ్లుగా జబర్దస్త్‌కి యాంకర్‌గా కొనసాగుతున్నారు. ఎంతమంది జడ్జిలు, యాంకర్లు, కమెడియన్లు వచ్చినా ఆమె మాత్రం జబర్దస్త్‌ను అంటిపెట్టుకునే ఉన్నారు. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇతర షోలకు హోస్ట్‌గా, అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తున్నారు. అయితే మెజారిటీ మాత్రం బుల్లితెర మీదే ఫోకస్ పెట్టారు రష్మీ గౌతమ్. వయసు పెరుగుతున్నప్పటికీ ఇప్పటికీ బ్యాచిలర్‌గానే లైఫ్ సాగిస్తున్నారు ఈ ముద్దుగుమ్మ.

ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోని కూడా రష్మీ గౌతమ్ అద్భుతంగా నడిపిస్తున్నారు. వారం వారం బుల్లితెర సెలబ్రిటీలతో రష్మీ ఆడించే ఆటలు, సరదా స్కిట్‌లు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తున్నాయి. ఈమెకు హైపర్ ఆది తోడు కావడంతో అన్ని స్కిట్స్ అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు దీనితో కొన్ని దుష్పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో ఎంతోమంది జీవితాలు బజారునపడుతున్నాయి. అలాగే మనం భవిష్యత్తులో ఏం అవబోతున్నామో కూడా ఏఐ చూపిస్తోంది. ఏఐలో చోటు చేసుకునే అంశాలపై శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫన్నీ స్కిట్స్ రూపంలో చూపించి నవ్వులు పూయించారు.

Rashmi Gautam s AI Pic creates Fun in Sridevi Drama Company Episode

తొలుత స్టేజ్ మీద హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చి మనవాళ్లు సీరియల్స్, ఇతర వర్క్స్‌లోకి రాకపోతే ఏమయ్యే వాళ్లు? ఏ ప్రొఫెషనల్‌లో ఉండేవాళ్లు అనేది ఏఐ ద్వారా పరిశీలిద్దామని ఆది చెబుతాడు. తొలుత పండు మాస్టర్‌ ఫోటోను ప్రదర్శించగా... గుడిమెట్ల మీద బిక్షగాడిగా ఏఐ చూపిస్తుంది, దాని కింద ఈ సాలా చిల్లర మనదే అని రావడంతో అంతా నవ్వేస్తారు. తర్వాత వర్షని, ఇంకో అమ్మాయిని పిలిచి అడుక్కోవడానికి చిల్లర వేయమని అడుగుతాడు పండు. చివరిలో ఆది వచ్చి ఎప్పుడైనా పార్ట్‌టైమ్ ఇది కంటిన్యూ చేయమని చెప్పి నవ్విస్తాడు.

ఆ తర్వాత యాంకర్ శ్రీవాణి- ఆమె భర్త విక్రమాదిత్య ఫోటోలను స్క్రీన్ మీద ప్రదర్శించగా.. వాళ్లిద్దరూ చేపల మార్కెట్‌లో చేపలు అమ్ముకుంటున్నట్లు ఏఐ చూపిస్తుంది. అది చూసి భార్యాభర్తలిద్దరూ అవాక్కవుతారు. ఆది వాళ్లిద్దరినీ పిలిచి చేపలు అమ్మడం బాగుందని మీరు.. ఈ పొజిషన్‌కు వచ్చిందే నీ వల్లేనని ఆయన అన్నారంటూ పంచ్‌లు వేస్తాడు ఆది. విక్రమాదిత్య మాట్లాడుతూ.. నాకు చేపలంటే చాలా ఇష్టమని అంటాడు. అప్పుడు నువ్వు అమ్మేది ఉండదు, అన్నీ తింటానికే సరిపోతాయని పంచ్ వేస్తాడు హైపర్ ఆది.

ఆ వెంటనే యాంకర్, జబర్దస్త్ నటి వర్ష బెలూన్లు, బొట్టుబిల్లలు అమ్ముకుంటున్నట్లుగా ఏఐ చూపిస్తుంది. అది చూసిన ఆది.. ఇంత నేచురల్‌గా ఉంది ఫోటో అని పంచ్ వేస్తాడు. వర్షని పిలిచి అలా యాక్ట్ చేయమని చెప్పడంతో ఆమె బుడగలు, బొట్టు పిల్లలు అమ్ముకుంటున్నట్లు నటించింది. యాక్టింగ్ చేస్తున్నట్లు అనుకుంటున్నావు కానీ మొన్న చెక్‌పోస్ట్ దగ్గర చూశానని ఆది అనడంతో వర్ష షాక్ అవుతుంది. ఆ తర్వాత బుల్లితెర నటి వందన పూలు అమ్ముతున్నట్లు ఏఐ చూపిస్తుంది.

చివరిలో మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పిక్స్ రాబోతున్నాయి. చూడాలని ఉండా? అని యాంకర్ రష్మి గౌతమ్ ఫోటోని స్క్రీన్ మీద వేయిస్తాడు ఆది. కూరగాయలు అమ్ముతూ, బండిని తోసుకుంటూ వెళ్తున్న రష్మి ఫోటోని చూసి అంతా నవ్వేస్తారు. రష్మిని పిలిచి నీకు తెలిసిన ఐదు ఆకుకూరల పేర్లు చెప్పమని ఆది టాస్క్ ఇవ్వగా.. తోటకూర, గొంగూర, బచ్చలికూర, పాలకూర, బెండకాయ, దొండకాయ అని రష్మి చెబుతుండగా.. ఓన్లీ ఆకుకూరలు మాత్రమే చెప్పమని ఆది అంటాడు. ఒకసారి కూరగాయలు అమ్మమని టాస్క్ ఇవ్వగా.. బండిని ముందుకు తోస్తూ అద్భుతంగా కూరగాయలు అమ్ముతుంది రష్మి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X