ఎవడో ఒకడిని చేసుకోవాల్సిందే... ఇది ఫిక్స్... పెళ్లిపై రష్మీ గౌతమ్ షాకింగ్ కామెంట్స్

తెలుగునాట స్టార్ యాంకర్లలో ఒకరిగా వెలుగొందుతున్నారు రష్మీ గౌతమ్. మల్లెమాల నిర్మాణంలో ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోకు యాంకర్‌గా దాదాపు 13 ఏళ్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కాలంలో జబర్దస్త్‌లో కమెడియన్లు మారారు, యాంకర్లు మారారు, జడ్జిలు మారారు.. ఇంకా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ రష్మి గౌతమ్ మాత్రం మారలేదు. తనతో కలిసి జబర్దస్త్ జర్నీ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ ఈ షోకు, యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పినా, మధ్యలో ఎంతోమంది యాంకర్లు వచ్చినా .. ఇప్పుడు మానస్‌తో కలిసి యాంకరింగ్ చేస్తున్నా రష్మి అలాగే చెక్కు చెదరకుండా దూసుకెళ్తున్నారు.

పెళ్లిపై రష్మి గౌతమ్ వ్యాఖ్యలు
ఇన్నేళ్ల కెరీర్‌లో ఏ వివాదం లేకుండా తన జర్నీ సాగిస్తున్నారు రష్మీ గౌతమ్. 40కి దగ్గర పడుతున్నా ఇంత వరకు ఈ ముద్దుగుమ్మ తన పెళ్లి గురించి ఏం మాట్లాడటం లేదు. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో రష్మీ ప్రేమాయణం సాగిస్తున్నారని.. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నో ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ వీరిద్దరి మధ్య ఎలాంటి లవ్‌ట్రాక్ లేదని, అది కేవలం స్క్రిప్ట్‌లో భాగమని ఎంతమంది చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు.. కానీ సుధీర్- రష్మిల ప్రేమాయణంపై ఇప్పటికీ రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. సంక్రాంతిని పురస్కరించుకుని ఈ వారానికి సంబంధించి జబర్దస్త్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. దీనిలో తన పెళ్లిపై రష్మీ గౌతమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

Rashmi Gautam s Interesting Comments on Marriage in Jabardasth Sankranthi Special Promo

మా షాప్‌లో అల్లుళ్లు అమ్మబడును
సంక్రాంతికి మంచి షాప్ పెట్టుకున్నాను.. మన షాపులో అల్లుళ్లని కూడా అమ్ముతున్నాం. ఎలాంటి క్వాలిటీస్ కావాలంటే అలాంటి అల్లుళ్లని ఇస్తామని చెబుతాడు ఆటో రాంప్రసాద్. మంచివాడు, పద్ధతి గలవాడు కావాలని ఓ వ్యక్తి అడగ్గా.. సాంప్రదాయిని అంటూ దొరబాబు పట్టుబట్టల్లో ఎంట్రీ ఇస్తాడు. రాగానే కాళ్లు కడుక్కోవాలని నీళ్లు ఇస్తాడు. ఆ తర్వాత నూకరాజు ఇద్దరు అమ్మాయిలో ఎంట్రీ ఇస్తాడు. సంక్రాంతికి గుండాట ఆడతారట కదా.. మరి పర్లేదా అని ఓ అమ్మాయి అడగ్గా... నిన్నరాత్రి గుండాటకు వెళ్లానని నూకరాజు తనచేతికి ఉన్న ఉంగరాలు చూపిస్తాడు. రెండు రింగులు వచ్చాయా అని ఆ అమ్మాయి అడగ్గా.. మూడు రింగులు పోయాయని నూకరాజు చెప్పడంతో అంతా నవ్వేస్తారు.

సంక్రాంతిపై నూకరాజు పంచ్‌లు
అసలు సంక్రాంతి అంటే ఏంటో చెప్పమని అమ్మాయి అడగ్గా.. పక్క రాష్ట్రాల నుంచి భీమవరం, నర్సాపురానికి డబ్బులతో వెళ్లి వాటిని గుండాటలో, కోడిపందాల్లో పొగొట్టుకుని వెళ్లేటప్పుడు ఛార్జీకి మళ్లీ అప్పులు చేసుకుని వెళ్తారు చూడు. దానినే సంక్రాంతి అని అంటారని నూకరాజు సెటైర్లు వేస్తాడు. అనంతరం రెండు దినాల నుంచి నువ్వు పనిలోకి రాలేదంటూ పనివాడితో లేడీ వేషంలో ఉన్న అప్పారావు గొడవ పడతాడు. ఇంకో దానిని చూసుకున్నందుకే గొడవ అని అవతలి వ్యక్తి చెప్పడంతో అందరూ పడిపడి నవ్వుతారు.

బావా అంటే .. రేపు రావా అంటావు
ఇక సంక్రాంతికి బుల్లెట్ భాస్కర్ తన టీమ్‌తో కొత్తగా స్కిట్ చేశాడు. పండుగ పేరు చెప్పి అత్తారింటి దగ్గర వారం రోజులు కూర్చొని మెక్కడానికి మీకు సిగ్గుగా లేదా? అని పెళ్లాం ప్రశ్నించగా.. మేం వారం రోజులే మెక్కుతాం, మరి 365 రోజులు అత్తారింట్లో మెక్కడం లేదా? అని బుల్లెట్ భాస్కర్ పంచ్‌లు వేస్తాడు. మీ అక్క మొగుడిని ఒక్కరోజైనా బావా అని పిలిచావా అని ఫైమాతో గొడవపడతాడు భాస్కర్. ఈరోజు బావా అంటా.. రేపు రావా అంటావు, నాకెందుకు అవన్నీ అని ఫైమా రివర్స్‌లో తగులుకుంటుంది.

రష్మి పెళ్లి ఎప్పుడంటే?
ఈ సంక్రాంతికి మా వూరికి కోడలిగా వస్తావా? చూడమంటావా అబ్బాయిని అంటూ రష్మిని జబర్దస్త్ వర్ష ప్రశ్నిస్తుంది. ఆ మాటలతో ఏం సమాధానం చెప్పాలో తెలియక రష్మి నవ్వేస్తుంది. ఇంతకీ ఆ అల్లుడు ఎవరు అని అడగ్గా.. ఎవరో ఒకడు అని వర్ష అంటుంది. మొత్తానికి ఇదే ఫిక్స్... ఎవడో ఒకడు అని రష్మి కన్నుకొడుతుంది. సంక్రాంతి సందర్భంగా యాంకర్ మానస్‌కు రష్మి సర్‌ప్రైజ్ ఇచ్చింది. అతని భార్యాబిడ్డలను పిలిచి.. కొడుకు ధ్రువ్‌కు భోగీపళ్లు పోస్తారు. మరి రష్మి తన పెళ్లిపై ఏం చెప్పింది? కోడి పందాలకు వచ్చినవాళ్లు ఎంత పొగొట్టుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే జనవరి 16, 17 తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X