twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుక్కల్ని కాదు మనుషుల్ని చూడు.. రష్మీకి నెటిజన్ చురక.. జబర్దస్త్ యాంకర్ కూల్ రిప్లై

    |

    ప్రస్తుతం మనమంతా ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. కరోనా వైరస్ ధాటికి దేశం మొత్తం అతలాకుతలం అవుతోంది. కోవిడ్ 19 దెబ్బకు అగ్రరాజ్యం కూడా కుదేలైపోతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 27 లక్షల మంది కరోనా బారిన పడగా.. లక్షకుపైగా ప్రాణాలను కోల్పోయారు. మనుషుల పరిస్థితి ఇలా ఉంటే మూగ జీవాల పరిస్థితి ఇంకోలా ఉంది.

    మూగజీవాల ద్వారా కరోనా..

    మూగజీవాల ద్వారా కరోనా..

    మూగజీవాల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందన్న ఫేక్ న్యూస్ తెగ వైరల్ అయింది. దీంతో చాలా మంది పెంపుడు జంతువులను వదిలించుకున్నారు. మూగ జీవాల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు లేవని, అదంతా గాలివార్తేనని అంతర్జాతీయ సంస్థలు చెప్పుకొచ్చాడు.

    మూగ జీవాలకు ఆహారం..

    మూగ జీవాలకు ఆహారం..

    కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందడంతో దాన్నికట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించారు. దీంతో ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. కొన్ని చోట్ల మనుషులకు కూడా తినడానికి తిండిలేని పరిస్థితి ఏర్పడింది. మనుషుల పరిస్థితే ఇలా ఉందంటే.. ఇక మూగ జీవాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీటికి ఆహారాన్ని అందించేందుకు జబర్దస్త్ యాంకర్ రష్మీ ముందుకు వచ్చింది.

    బకెట్ పట్టుకుని రోడ్లపైకి..

    మూగ జీవాలకు తిండి దొరకడం లేదని గ్రహించిన రష్మీ స్వయంగా రోడ్లపైకి ఎక్కింది. చేతిలో బకెట్ పట్టుకుని వీధి కుక్కలకు ఆహారాన్ని పెట్టసాగింది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. రష్మీ చేసిన మంచి పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపించారు. రష్మీ ఇలా మూగజీవాల కోసం పాటు పడుతూ ఉంటే నెగెటివ్ కామెంట్ చేసేవారు కూడా ఉన్నారు.

    Recommended Video

    Anchor Sreemukhi About Her Movie Career
    మూడు కిలోమీటర్ల దూరంలోపే..

    మూడు కిలోమీటర్ల దూరంలోపే..

    అయితే రష్మీ మూగ జీవాల పట్ల చూపిస్తున్న ప్రేమ, చేస్తోన్న సేవలపై నెటిజన్స్ నెగెటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. కుక్కల్ని కాదు గుంటూరు వెళ్లి చూడండి.. ఆకలితో చనిపోయేవాళ్లు చాలా మంది ఉన్నారు అంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన రష్మీ.. క్షమించండి ఇది లాక్ డౌన్ కదా.. కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోపే ప్రయాణించాలి.. అలాంటి సమస్యలకు మీ దగ్గర్లోని రాజకీయ నాయకులను, ఎన్జీవోలను సంప్రదించండ'ని కూల్‌గా రిప్లై ఇచ్చింది.

    English summary
    Rashmi gautam Satire To Netizens Serving Pets Instead of People. In This Covid 19 Epidemic Rashmi Feeds Street Dogs And Pets. Sorry andi it's a lockdown Max 3 km travel allowed For these issues connect to ur area politicians and ngos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X