నెటిజన్‌ను కడిగి పారేసిన రష్మీ.. తెలుగు నేర్చుకోండి అంటూ..
స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. తరచు ఆసక్తికరమైన పోస్టులతో దడదడలాడిస్తుంటారు. అయితే కొందరు నెటిజన్లు నెగిటివ్ స్పందిస్తే మొహమాటం లేకుండా రఫ్ ఆడేస్తుంటారు. తాజాగా సంక్రాంతి శుభాకాంక్షలు విషయంలో ఓ నెటిజన్‌కు క్లాస్ పీకారు.
పండుగను పురస్కరించుకొని మకర సంక్రాంతి అని రష్మీ ట్వీట్ చేశారు. అయితే దానికి నెటిజన్ సమాధానం ఇస్తూ మకర సంక్రాంతి కాదు మేడమ్.. ఈ రోజు భోగి అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇంకాస్త ముందడుగు వేసి తెలుగు నేర్చుకోండి అంటూ ఝలక్ ఇచ్చాడు. దాంతో రష్మీ ఫైర్ అయింది.

మా ఫ్యామిలీలో మకర సంక్రాంతిని ఘనంగా జరుపుకోవడం సంప్రదాయం. అందుకే విష్ చేశాను. ఒకరి సంప్రదాయాలను మరొకరు గౌరవించుకోవాలి. కారణం లేకుండా బాధపెట్టే స్టేట్‌మెంట్స్ ఇవ్వడం మంచిది కాదనుకుంటా. కాస్త గౌరవించడం నేర్చుకోండి అంటూ రష్మీ జవాబిచ్చింది.
రష్మీ కౌంటర్‌కు నెటిజన్లు ఘాటుగా స్పందించారు. వైజాగ్‌లో పుట్టారు. తెలుగు సంప్రదాయాలను తెలుసుకోండి. సలహాలు ఇస్తే ఇలా మాట్లాడుతారా? అంటూ ఫైర్ అవుతున్నారు. కాగా, జబర్దస్త్ కామెడీ షోతోపాటు పలు తెలుగు సినిమాల్లో నటిస్తూ రష్మీ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. త్వరలోనే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











