పెళ్లిపై రష్మీ గౌతమ్ షాకింగ్ నిర్ణయం.. స్టార్ యాంకర్ లైఫ్ మొత్తం ఇంతేనా
బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం లేదు. ఈ ముద్దుగుమ్మ స్మాల్ స్క్రీన్ ప్రజెన్స్ కు ఆడియెన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. రష్మీ గౌతమ్ కూడా తన టాలెంట్ తో టెలివిజన్ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. 'కరెంట్' మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన రష్మీ గౌతమ్ అప్పటి నుంచి సపోర్టింగ్ రోల్స్ బిగ్ స్క్రీన్ పై యాంకర్ గా స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తోంది.
ఇక పదేళ్లకు పైగా యాంకర్ రష్మీ గౌతమ్ 'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్'.. కామెడీ షోకు యాంకర్ గా వ్యవహరిస్తూ అలరిస్తోంది. తన టాలెంట్ తో బుల్లితెర ప్రేక్షకులకు మరింతగా దగ్గరవుతోంది. యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. ఆ మధ్యలో ఆయా సినిమాల్లో నటించేందుకని కాస్తా ఈ షోకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు మళ్లీ యాంకర్ గా 'జబర్దస్త్' షోలో సందడి చేస్తూనే ఉంది. తనదైన శైలిలో పంచులు కూడా విసురుతూ ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తోంది.

తాజాగా రష్మీ గౌతమ్ తన పెళ్లి గురించి కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. జబర్దస్త్ లేటెస్ట్ మార్చి 29వ ఎపిసోడ్ లో కమెడియన్ ఇమ్మాన్యుయేల్, వర్ష స్కిట్ ఆకట్టుకుంది. ఆ స్కిట్ లో ఇద్దరు ప్రేమికులు తమ ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఏం చేద్దామని ఆందోళన పడుతుంటారు. ఇప్పుడు ఏం చేద్దామని ఒకరికొకరు అడుగుతూ ఉంటారు. ఈ స్కిట్ లో రష్మీ గౌతమ్ కలుగ జేసుకొని నాలాగే సింగిల్ గా ఉండిపోండి అంటూ బదులిచ్చింది.
ఒక్కసారి యాంకర్ రష్మీ గౌతమ్ అలా తనను తానే ఉదాహరణగా సింగిల్ గా ఉండండి అంటూ అనడం హాట్ టాపిక్ గ్గా మారింది. రష్మీ గౌతమ్ ను కూడా తన ప్రియుడితో పెళ్లి చేసుకోకుండా తమ ఇంట్లో వాళ్లు ఏమైనా ఆపారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక సుడిగాలి సుధీర్ తో డేటింగ్ అంటూ వార్తలు వచ్చినా అవన్నీ నిజం కాదని, వారిద్దరూ మంచి స్నేహితులని పదే పదే చెప్పుకొచ్చారు. దాంతో ఆ రూమర్లలో వాస్తవం లేదని చెప్పింది.
ఇక రష్మీ తన పెళ్లి విషయం ఇలా హింట్ ఇచ్చిందని పలువురు అంటున్నారు. ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆసక్తి లేదని, సింగిల్ గానే ఉండేందుకు ఇష్టపడుతోందని అర్థమవుతోంది. ఇక రష్మీ గౌతమ్ కు రేపటితో 37 ఏళ్లు నిండుతుండటం విశేషం. 1988 ఏప్రిల్ 7న ఈ బ్యూటీ జన్మించింది. వయస్సు పెరుగుతున్నా పెళ్లి మాట ఎత్తకపోవడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రష్మీ గౌతమ్ యాంకర్ గా వందశాతం సక్సెస్ అయ్యింది. ఇక హీరోయిన్ గానూ రుజువు చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే గురు, గుంటూరు టాకీస్, రాజుగారి బంగ్లా, అంతం, నెక్ట్స్ నువ్వే, అంతకు మించి, చివరిగా హాస్టల్ బాయ్స్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ లోనూ క్యామియో అప్పీయరెన్స్ ఇచ్చి ప్రేక్షకులను అలరించింది.


Click it and Unblock the Notifications











