సుధీర్ క్యారెక్టర్‌పై రష్మీ వివాదాస్పద వ్యాఖ్యలు: ఆ టైంలో ‘గే’లా అంటూ షాక్.. మేటర్ రివీల్ చేయడంతో!
తెలుగు బుల్లితెర హిస్టరీలో జబర్ధస్త్ షోది ప్రత్యేకమైన స్థానం. ఇక, ఈ షో వల్ల పదుల సంఖ్యలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వారిలో కొందరు మాత్రం విపరీమైన స్టార్‌డమ్‌ను అందుకున్నారు. అయితే, వీళ్లంతా ఒంటరిగా ఫేమస్ అయితే.. ఒక ఇద్దరు మాత్రం జంటగా పాపులర్ అయ్యారు. వాళ్లే కమెడియన్ సుడిగాలి సుధీర్.. యాంకర్ రష్మీ గౌతమ్. చాలా కాలంగా వీళ్లిద్దరి మధ్య సంథింగ్ నడుస్తుందన్న టాక్ ఉంది. వీళ్ల పెళ్లిపైనా కామెంట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుధీర్ క్యారెక్టర్‌పై రష్మీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళ్తే...

అలా మొదలైన కెరీర్లు.. ఇలా కలిశారుగా
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది రష్మీ గౌతమ్. ఈ క్రమంలోనే జబర్ధస్త్ అనే కామెడీ షోకు యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె వచ్చిన కొద్ది రోజులకే ఆ షోలోకి ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. ఆ తర్వాత తక్కవ సమయంలోనే తన టాలెంట్‌ను నిరూపించుకుని టీమ్ లీడర్ అయ్యాడు. మొత్తానికి ఈ షో వల్ల ఇద్దరూ కలిశారు.

రష్మీపై సుధీర్ కామెంట్లు.. టాక్ మొదలు
జబర్ధస్త్ షో సమయంలో రష్మీ గౌతమ్ గురించి తరచూ కామెంట్లు చేస్తూ ఉండేవాడు సుడిగాలి సుధీర్. దీంతో ఆమెను ప్రేమిస్తున్నాడేమో అని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే సదరు యాంకర్ కూడా రెస్పాండ్ అయ్యేది. దీంతో ఆమెకు కూడా అతడిపై ప్రేమ ఉందన్న టాక్ వినిపించింది. ఇలా ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు ప్రచారం ప్రారంభం అయింది.

యూట్యూబ్ జోడీ.. ఎప్పుడూ ట్రెండింగ్‌లో
జబర్ధస్త్‌తో పాటు 'ఢీ' డ్యాన్స్ రియాలిటీ షోలో తరచూ రొమాన్స్ చేస్తూ.. హాట్ టాపిక్ అవుతున్నారు రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్. షోలలో రొమాన్స్ చేయడం.. ప్రపోజ్ చేసుకోవడం.. డ్యాన్స్ చేయడం వంటి వాటి కారణంగానే ఈ జంట యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. దీంతో వీళ్లిద్దరూ ప్రేమాయణం సాగిస్తున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.

పెళ్లి గురించే ప్రశ్నలు.. సమాధానం ఇలా
యాంకర్‌గా రష్మీ గౌతమ్ తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతుండగా.. సుడిగాలి సుధీర్ మాత్రం కమెడియన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. విడివిడిగా పాపులర్ అయినప్పటికీ.. జంటగా మరింత ఫేమస్ అయిందీ యూట్యూబ్ జోడీ. ఈ నేపథ్యంలో పెళ్లిపై తరచూ వీళ్లిద్దరికి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే తమ మధ్య ఏమీ లేదని, కేవలం ఫ్రెండ్స్ అని చెబుతున్నారు.

సుధీర్‌పై యాంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ శుక్రవారం ప్రసారం కానున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో సుడిగాలి సుధీర్ టీమ్ సూపర్ హిట్ అయిన స్కిట్‌కు సీక్వెల్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, సుధీర్‌లు గేలు గెటప్‌లు వేసుకుని ఎంట్రీ ఇచ్చారు. ఒక్కొక్కరూ ఒక్కో మేరిజాన్ని ప్రదర్శించారు. ఈ సమయంలోనే యాంకర్ రష్మీ సుధీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

మూడేళ్ల క్రితం ‘గే'లా ఉండేవాడంటూ షాక్
ఆ టీమ్‌లోని ముగ్గురు గేలుగా రావడంతో అందరూ పడిపడి నవ్వుకున్నారు. ఇలాంటి సమయంలో యాంకర్ రష్మీ 'ఆ గెటప్‌కు రియాలిటీకి పెద్దగా ఏమీ తేడా లేదు. సుడిగాలి సుధీర్ మూడేళ్ల క్రితం ఇలానే ఉండేవాడు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో స్టేజ్‌పై ఉన్న ఆర్టిస్టులతో పాటు అందరూ బిగ్గరగా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











