సుధీర్‌ను ఛీ కొట్టిన రష్మీ, ఫోటో కోసం వర్షిణితో గొడవ.. ఆ ఫోటో ఎవరిదంటే..
Recommended Video

ప్రఖ్యాత టెలివిజన్ షో నిర్వహించే డ్యాన్స్ షో హంగామాగా సాగిపోతుంటుంది. యాంకర్ ప్రదీప్ హోస్ట్‌గా వ్యవహరించే ఈ కార్యక్రమంలో రష్మి, వర్షిణి, సుధీర్ తదితరులు పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో రష్మీ, వర్షిణి, సుధీర్‌ను ప్రదీప్ ఆటపట్టించడం ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఈ షో సందర్భంగా రష్మీ, వర్షిణి ఓ ఫోటో కోసం గొడవ పడుతున్న నేపథ్యంలో ..

ఫొటో కోసం వర్షిణి, రష్మి కొట్లాట
నవ మన్ముథుడా.. అతి సుందరుడా అంటూ వర్షిణి ఫొటో పట్టుకొని పాట పడుతూ వేదికపైకి రాగా వారిని చూసి ప్రదీప్ సెటైర్ వేశాడు. మిమ్మల్ని చూస్తుంటే సంక్రాంతి గంగిరెద్దుల్లా కనిపిస్తున్నారు అని వెంటనే మళ్లీ సంక్రాతి పండుగ ముందే వచ్చిందని కామెంట్ చేశారు.

అందగత్తెలు ఎవరని ప్రశ్నించగా
ప్రదీప్‌తో వర్షిణి మాట్లాడుతూ.. మా ఇద్దరిలో అందగత్తెలు ఎవరు అని అడుగగా.. నువ్వే అని చెప్పాడు. దాంతో రష్మీ సీరియస్‌గా చూడటంతో నీకు ఏంత తక్కువ అని కవరింగ్ ఇచ్చాడు. దాంతో వర్షిణి నేను అనిచెప్పవుగా అంటూ నిలదీసింది.

మాలో రుక్మిణి, సత్యభామలు ఎవరని
వర్షిణి కోపంగా అడగడంతో రుక్మిణి, సత్యభామల్లో అందంగా ఎవరున్నారంటే కృష్టుడు ఏం చెబుతాడు అని తప్పించుకొనేందుకు చూశాడు. అంతలోనే మన ముగ్గురిలో కృష్ణుడు ఎవరు అంటూ రష్మీ అనుమానం వ్యక్తం చేసింది. వెంటనే వర్షిణి కూడా అదే డౌట్‌ను అడుగడంతో ప్రదీప్ ఇరుకున పడ్డి చేతిలో ఫొటో గురించి అడిగాడు.

శేఖర్ మాస్టర్ నావాడంటే
దాంతో రష్మి, వర్షిణి నా ఫొటో అంటే నాది అని గుంజుకోవడంతో రెండు ముక్కలైంది. ఆ రెండు ముక్కలను ఒక్క చోటకు చేర్చి చూడగా అది శేఖర్ మాస్టర్ కావడంతో అందరూ అవక్కాయ్యారు. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ నావాడంటే నా వాడు అని రష్మి, వర్షిణి గొడవపడటం జరిగింది. దాంతో నేను ఉన్నానుగా అంటూ సుధీర్ మధ్యలో దూరాడు.

సుడిగాలి సుధీర్‌ను ఛీ కొట్టిన రష్మి
నన్ను మీవాడిని అనుకొవచ్చుగా అంటూ మధ్యలో దూరిన సుధీర్‌ను తూ అంటూ రష్మి అక్కడి నుంచి వెళ్లడంతో అందరూ కంగు తిన్నారు. రష్మి వెళ్లిన తర్వాత ఏందిరా ఇంత ఘోరంగానా అంటూ ప్రదీప్‌తో చెప్పి సుధీర్ బాధపడటంతో వినోదం ముగిసింది.


Click it and Unblock the Notifications











