twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ షోలో అపశృతి: సుడిగాలి సుధీర్‌పై చేయి చేసుకున్న రష్మీ.. చేయకూడని పని చేసినందుకే ఇలా!

    |

    తెలుగు బుల్లితెరపై ఎంతో మంది సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. అందులో కొందరు మాత్రం జంటగానే ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్.. కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రముఖంగా చెప్పుకుంటారు. దీనికి కారణం వీళ్లిద్దరూ చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నారన్న వార్తలు వస్తుండడమే. లేదు లేదు అంటూనే రెచ్చిపోతూ రొమాన్స్ చేస్తున్న ఈ జోడీ.. నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సుడిగాలి సుధీర్ ఓ చేయకూడని పని చేశాడు. దీంతో వెంటనే రష్మీ గౌతమ్ అతడిపై చేయి చేసుకుంది. ఆ వివరాలు మీకోసం!

    ఇద్దరి కెరీర్‌లు అలా.. దాని వల్ల కలిశారు

    ఇద్దరి కెరీర్‌లు అలా.. దాని వల్ల కలిశారు

    సినిమా నటిగా కెరీర్‌ను ఆరంభించింది రష్మీ గౌతమ్. కెరీర్ ఆరంభంలోనే చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఈటీవీలో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షోతో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి అన్ని రకాలుగా రాణిస్తోంది. ఇక, ఇదే షో ద్వారా పరిచయం అయ్యాడు సుడిగాలి సుధీర్. తక్కువ సమయంలోనే టీమ్ లీడర్ అయ్యాడు. దీని ద్వారానే రష్మీ సుధీర్ కలిశారు.

    ఇద్దరి మధ్య లవ్ ట్రాక్.. పెళ్లి కూడా అని

    ఇద్దరి మధ్య లవ్ ట్రాక్.. పెళ్లి కూడా అని

    యాంకరింగ్ చేస్తున్న రష్మీ గౌతమ్‌పై పంచులు వేస్తూ ప్రేమ ఉన్నట్లు కలరింగ్ ఇస్తూ ఉండేవాడు సుడిగాలి సుధీర్. దీనికి తోడు వీళ్లిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాకులు క్రియేట్ చేస్తున్నారు నిర్వహకులు. దీంతో ఈ జంట మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

    క్యాష్ చేసుకుంటున్నారు... ఫ్యాన్స్ షాక్

    క్యాష్ చేసుకుంటున్నారు... ఫ్యాన్స్ షాక్

    కొంత కాలంగా రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ గురించి వరుసగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం తరచూ వీళ్లిద్దరూ రొమాన్స్ చేస్తుండడమే. అసలు వీళ్లిలా ఫేమస్ అవడానికి షో నిర్వహకులు పెడుతోన్న రొమాంటిక్ స్కిట్‌లే కారణమని చెప్పొచ్చు. ఇలా పెళ్లి చేసుకోవడం వల్లో.. హగ్గులు ఇచ్చుకోవడం వల్లో వీళ్లకు జంటగా పేరొచ్చింది. ఇవి చూసి ఫ్యాన్స్‌ షాకవుతున్నారు.

    ఇద్దరూ రెండూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు

    ఇద్దరూ రెండూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు

    దాదాపు ఐదారేళ్లుగా రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ ప్రేమాయణం గురించి వార్తలు వస్తుండగా.. వాళ్లిద్దరూ దాని గురించి స్పందిస్తూనే ఉన్నారు. తద్వారా తమ మధ్య ఏ బంధం ఉందో క్లారిటీ ఇస్తున్నారు. రష్మీ గౌతమ్ తామిద్దరం స్నేహితులమని వెల్లడిస్తుండగా.. సుధీర్ మాత్రం భిన్నంగా చెబుతున్నాడు. ఆమె లేకపోతే తాను లేనని ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతూ వస్తున్నాడు.

    వెంకటేష్ కోసం సరదాగా చిందేసిన జోడీ

    వెంకటేష్ కోసం సరదాగా చిందేసిన జోడీ

    దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది 'ఢీ'. ఇప్పటికే పన్నెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. పదమూడో సీజన్‌ను కూడా ప్రారంభించింది. 'కింగ్ వర్సెస్ క్వీన్స్' పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో వచ్చే వారం విక్టరీ వెంకటేష్ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. ఇందులో రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ కూడా భాగమై డ్యాన్స్ చేయడం విశేషం.

    సుడిగాలి సుధీర్‌‌కు కౌగిలి... చెంప దెబ్బ

    సుడిగాలి సుధీర్‌‌కు కౌగిలి... చెంప దెబ్బ

    వచ్చే వారం ప్రసారం కానున్న ఢీ షోకు సంబంధించి ప్రోమో విడుదలైంది. ఇందులో అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌లతో పాటు కామెడీ ట్రాక్‌లను చూపించారు. ఇక, ఈ షోలో ఓ అపశృతి కూడా కనిపించింది. అదే.. ఓ టీమ్‌కు మెంటర్‌గా పని చేస్తోన్న రష్మీ గౌతమ్.. జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌కు హగ్ ఇవ్వడంతో పాటు అందరి ముందే అతడి చెంపను చెల్లుమనిపించింది.

    Recommended Video

    Mahesh Babu Enroute Dubai | Sarkaru Vaari Paata 2nd Schedule | Filmibeat Telugu
    చేయకూడని పని చేసినందుకు కోపంతో

    చేయకూడని పని చేసినందుకు కోపంతో

    రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్‌ను కొట్టడానికి కారణం ఏమిటంటే.. ముందుగా చెప్పినట్లు వెంకటేష్‌కు డెడికేట్ చేస్తూ వేసిన ఓ పాటలో అతడు అదిరిపోయే స్టెప్పులు వేశాడు. దీంతో అది ముగిసిన తర్వాత రష్మీ వచ్చి 'సుధీర్‌కు రెండు ఇస్తాను' అని బాగా చేసినందుకు హగ్ ఇచ్చింది. అలాగే, 'కాలికి దెబ్బ ఉన్నా డ్యాన్స్ ఎందుకు చేశావ్' అంటూ అతడి చెంపపై కొట్టిందీ హాట్ యాంకర్.

    English summary
    Actress Rashmi Gautam, who is known for anchoring on TV show Jabardasth, has opened up on her wedding and link up with Sudigali Sudheer and said that she would prefer to have a baby first and then marry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X