For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుడిగాలి సుధీర్- రష్మీ రహస్యాలు బట్టబయలు చేసిన తాగుబోతు.. ఇదన్నమాట మనోడి అసలు వ్యవహారం!

|

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ప్రేమ వ్యవహారం అనగానే అందరికీ టకీమని గుర్తొచ్చేది ఎవరో ప్రత్యేకంగా చెప్పాలా! ఇంకెవరు మన జబర్దస్త్ యాంకర్ రష్మినే. ఆమె ప్రేమ కోసం ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అందరి ముందే ప్రయత్నాలు చేశాడు సుడిగాలి సుధీర్. కానీ రష్మీ మాత్రం ఓకే చెప్పీ చెప్పనట్లుగా ఇటు ఆడియన్స్‌కి, అటు సుధీర్‌కి ఎప్పుడూ టెన్షన్ పెట్టిస్తూనే ఉంటుంది. ఈ తరుణంలో తాజాగా సుడిగాలి సుధీర్‌కి సంబంధించిన ఓ సీక్రెట్ బయటపెట్టేశాడు ఓ తాగుబోతు. దీంతో ఇది కాస్త నెట్టింట సెన్సేషన్‌గా మారింది. ఇంతకీ ఆ తాగుబోతు ఏం చెప్పాడు? వివరాల్లోకి పోతే..

అందరి ముందే ఆ తాగుబోతు..

అందరి ముందే ఆ తాగుబోతు..

సాధారణం గానే యాంకర్ రష్మీ, సుడిడాలి సుధీర్ జంట గురించి వింటేనే పూనకాలు వచ్చేస్తాయి బుల్లితెర ప్రేక్షకులకు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, పంచు డైలాగులు, ఒకరిపై ఒకరు కొంటె చూపులు.. ఒక్కటేంటి ఇలా అన్నీ కూడా హైలైటే. అలాంటి ఈ ఇద్దరి గురించిన సీక్రెట్ ఓ తాగుబోతు అందరి ముందే చెప్పేయడంతో.. ఆ సీక్రెట్ కాస్త జనాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సుధీర్ -రష్మీ ఆన్ స్క్రీన్ రొమాన్స్

సుధీర్ -రష్మీ ఆన్ స్క్రీన్ రొమాన్స్

ఆన్ స్క్రీన్ రొమాన్స్‌లో రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ పర్‌ఫార్‌మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్నోసార్లు ఆన్ స్క్రీన్ రొమాన్స్‌ చేసి పిచ్చెక్కించారు ఈ ఇద్దరూ. అందుకే ఆ జోడీ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు మరోసారి రష్మీ, సుధీర్ జంట అదే రొమాంటిక్ కిక్ ఇచ్చి అదరగొట్టేశాడు. తాజాగా విడుదలైన ఢీ 12 ఛాంపియన్స్ ప్రోమోలో ఆ ఇద్దరూ ఫుల్లుగా రెచ్చిపోయారు.

గాంధీ జయంతి రోజే.. నేనున్నా రా అంటూ

గాంధీ జయంతి రోజే.. నేనున్నా రా అంటూ

అక్టోబర్ 2 (గాంధీ జయంతి) రోజు ప్రసారం కాబోయే ఢీ 12 షో తాలూకు ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ఇందులో రష్మీ, సుధీర్ జోడీ లపై షూట్ చేసిన సన్నివేశాలు హైలైట్ అవుతున్నాయి. బుల్లితెరపై రొమాంటిక్ జోడీగా పేరుతెచ్చుకున్న ఈ ఇద్దరి రహస్యాలు బట్టబయలయ్యాయి. ఓ తాగుబోతు.. నేనున్నా రా అంటూ సుడిగాలి సుధీర్‌తో రష్మీకి లవ్ ప్రపోజ్ చేయించే సీన్ అట్రాక్ట్ చేస్తోంది.

 కన్నుల్లో నీ.. రూపమే అంటూ సుధీర్

కన్నుల్లో నీ.. రూపమే అంటూ సుధీర్

కన్నుల్లో నీ.. రూపమే అంటూ సుడిగాలి సుధీర్ రష్మిపై ఉన్న ప్రేమకు బయటపెట్టేశాడు. ఇది చూసి రష్మి సిగ్గు పడటం ప్రోమో వీడియోలో కనిపిస్తోంది. మరోవైపు వీళ్లిద్దరి లవ్ ట్రాక్ చూస్తూ ఎంజాయ్ చేస్తోంది పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. అక్టోబర్ 2న జరగబోయే ఈ ఢీ 12 షోకి ప్రత్యేక జడ్జిగా వ్యవహరిస్తోంది రేణు దేశాయ్.

మనోడు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర..

మనోడు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర..

నువ్వు ఊ అనకముందే ఐదు సంవత్సరాలనుండి ఆగుతున్నాడు.. నువ్వు గనక ఊ అంటే నీకోసం ఐదొందల సంవత్సరాలైనా ఆగుతాడు మనోడు అంటూ సుధీర్ గాఢమైన ప్రేమను రష్మీకి చెప్పేశాడు ఆ తాగుబోతు. అంతేకాదు.. అందరూ అనుకునేట్టుగా రోజూ సుధీర్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఆగేది ఎవరి కోసమో కాదు.. నీ కోసమే అంటూ మరో సీక్రెట్ కూడా రివీల్ చేశాడు తాగుబోతు డాన్సర్. దీంతో ఈ సీన్ సెన్సేషన్‌గా మారింది.

స్కిట్‌లో భాగంగానే

అయితే ఇదంతా జరిగింది స్కిట్ లో భాగంగానే. ఢీ 12 షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచేందుకు గాను ఈ స్కిట్ వేశారు. కాకపోతే సుధీర్- రష్మీ లవ్ ట్రాక్ జనాలను అనుకున్న దానికి మించి ఎంటర్‌టైన్ చేసింది. ప్రోమోనే ఇలా ఉందంటే ఇక షో ఎలా ఉండబోతోందో! చూద్దాం.

గతంలో రష్మీ, సుధీర్ పెళ్లి

గతంలో రష్మీ, సుధీర్ పెళ్లి

రష్మీ, సుధీర్ జోడీకి ఉన్న క్రేజ్ క్యాచ్ చేసుకునేలా ఎప్పటికప్పుడు సరికొత్తగా వాళ్లపై స్కిట్స్ రెడీ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలోనే గతంలో ఓ కార్యక్రమంలో వేదికపై రష్మీ, సుధీర్ పెళ్లి కూడా చేసేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ వీడియో కూడా నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది.

English summary
Rashmi Gautam and Sudigali Sudheer special performence hilighted in latest episode promo which is came from Dhee 12. This Show will telecast on October 2nd.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more