Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సుడిగాలి సుధీర్, రష్మీ మరింత రెచ్చిపోయారు.. అబ్బో! ఆ కౌగిలింతలు.. మామూలు సీన్లు కావవి..
యాంకర్ రష్మీ, సుడిడాలి సుధీర్.. ఈ జంట పేరు వింటేనే పూనకాలు వచ్చేస్తాయి బుల్లితెర ప్రేక్షకులకు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, పంచు డైలాగులు, ఒకరిపై ఒకరు కొంటె చూపులు.. ఒక్కటేంటి ఇలా అన్నీ కూడా హైలైటే. అలాంటి ఈ ఇద్దరూ ఒకే వేదికపై కౌగిలింతలు.. కన్ను కొట్టుకోవడాలు లాంటివి చేస్తే ఇంకేమన్నా ఉందా! అబ్బో.. అదో కిక్కేలే. తాజాగా విడుదలైన ఢీ ప్రోమో వీడియోలో ఆ సీన్లే కనిపించాయి. వివరాల్లోకి పోతే..
సెప్టెంబర్ 25న షో
సెప్టెంబర్ 25న ప్రసారం కాబోయే షో తాలూకు ప్రోమో విడుదల చేశారు. ఇందులో రష్మీ, సుధీర్ జోడీ లపై షూట్ చేసిన సన్నివేశాలు హైలైట్ అవుతున్నాయి. బుల్లితెరపై రొమాంటిక్ జోడీగా పేరుతెచ్చుకున్న వీళ్ళు ఈ ప్రోమోలో మాములుగా హంగామా చేయలేదు. పైగా కౌగిలింతలు కూడా. దీంతో ఈ ప్రోమో వైరల్ అవుతోంది.
ఆన్ స్క్రీన్ రొమాన్స్ అదరగొట్టేశారు
ఆన్ స్క్రీన్ రొమాన్స్‌లో రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్నోసార్లు ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి పిచ్చెక్కించారు ఈ ఇద్దరూ. అందుకే ఆ జోడీ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు మరోసారి రష్మీ, సుధీర్ జంట అదే రొమాంటిక్ కిక్ ఇచ్చి అదరగొట్టింది. తాజాగా విడుదలైన ఢీ ఛాంపియన్స్ ప్రోమోలో ఆ ఇద్దరూ ఫుల్లుగా రెచ్చిపోయారు.
సుధీర్‌ని అడిగిమరీ కన్ను కొట్టించుకున్న రష్మీ
గత ఢీ సీజన్లలోనూ ఎన్నో షోల్లో కనువిందు చేసిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు మళ్ళీ రంగంలోకి దిగారు. తాజా ఢీ సీజన్లో వాళ్ళ ప్రేమ ముచ్చట్లు కొనసాలాగుతూనే ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 25న ప్రసారం కాబోయే కొత్త ఎపిసోడ్ కోసం ఒకరిపై ఒకరు ప్రేమలు చూపించుకున్నారు. ముఖ్యంగా సుధీర్‌తో అడిగిమరీ రష్మీ కన్ను కొట్టించుకోవడం చూసి షాకవుతున్నారు జనం.
సెంటిమెట్‌తో కొట్టిన సుధీర్
రష్మీ దగ్గరకు వెళ్లి మరీ వేదిక మధ్యలోకి తీసుకొచ్చిన సుధీర్.. సెంటిమెంట్ డైలాగులతో ఆమెను పడేశాడు. 'నువ్వు గెలిస్తే నేను గెలిచినట్లే' అంటూ ప్రేమికుల నోళ్ళలో ఎప్పుడూ నానే డైలాగ్ తో రష్మీ గుండెల్లో గుచ్చేశాడు సుధీర్. దీంతో రష్మీ తెగ ఖుషీ అవుతూ నవ్వేసింది.
ఒకరి కౌగిలిలో ఒకరు
యాంకర్ రష్మీ, సుడిడాలి సుధీర్ ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకుంటూ డైలాగ్స్ పండించడమే గాక, ఒకరి కౌగిలిలో ఒకరు ఇమిడి అబ్బో అనిపించారు. ఈ ఇద్దరి కౌగిలింతలు ఈ ప్రోమోను మంచి కిక్కిచ్చాయి. సో ఈ ఎపిసోడ్ అంతా రష్మీ, సుధీర్ ఎంటర్టైన్మెంట్ ఖాయమే అని తెలిసిపోతోంది.
గతంలో రష్మీ, సుధీర్ పెళ్లి
రష్మీ, సుధీర్ జోడీకి ఉన్న క్రేజ్ క్యాచ్ చేసుకునేలా ఎప్పటికప్పుడు సరికొత్తగా వాళ్లపై స్కిట్స్ రెడీ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలోనే గతంలో ఓ కార్యక్రమంలో వేదికపై రష్మీ, సుధీర్ పెళ్లి కూడా చేసేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ వీడియో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది.