సుధీర్ మీదకు ఎక్కిన రష్మీ: ఒకరిపై ఒకరు పడుకుని.. దుప్పట్లో దూరిపోయి.. తొలిసారి ఇంత ఘాటుగా!

రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్.. ఈ పేర్లకు పెద్దగా పరిచయం అవసరం లేదు. దాదాపు ఏడేళ్లుగా వీళ్లిద్దరూ తమ తమ విభాగాల్లో సత్తా చాటుతూ స్టార్లుగా వెలుగొందుతున్నారు. అదే సమయంలో జంటగానూ ఎంతో ఫేమస్ అయ్యారు. అందుకే వీళ్లు ఒంటరిగా కంటే జోడీగానే ఎక్కువ అవకాశాలను అందుకుంటున్నారు. తద్వారా వీళ్లు రీల్ కోసం చేసినా.. రియల్ కపుల్ అన్న పేరు వచ్చేసింది. ఇలాంటి సమయంలో రష్మీ.. సుధీర్ తొలిసారి రెచ్చిపోయి రొమాన్స్ చేశారు. ఒకరి మీద ఒకరు పడుకోవడమే కాదు.. దుప్పట్లో దూరిపోయి మరీ రచ్చ చేశారు. ఆ వీడియోపై మీరూ లుక్కేయండి!

అలా మొదలైన కెరీర్లు.. అందులో కలిశారు

అలా మొదలైన కెరీర్లు.. అందులో కలిశారు

కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపును అందుకోలేకపోయింది రష్మీ గౌతమ్. అలాంటి సమయంలోనే ఈటీవీలో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షోతో యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టుకుంది. అప్పటి నుంచి సత్తా చాటుతోంది. ఇదే షో ద్వారా పరిచయం అయ్యాడు సుడిగాలి సుధీర్. తక్కువ సమయంలోనే టీమ్ లీడర్ అయ్యాడు. ఇలా రష్మీ సుధీర్ కలుసుకున్నారు.

ప్రేమ పెళ్లితో ఫేమస్... యూట్యూబ్ జోడీగా

ప్రేమ పెళ్లితో ఫేమస్... యూట్యూబ్ జోడీగా

జబర్ధస్త్‌లో ఒకరికొకరు ప్రేమ ఉన్నట్లుగా కనిపించేవారు రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్. ఆరంభంలోనే కొన్ని స్కిట్లలో రొమాంటిక్ యాక్టులు చేయడంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న టాక్ గట్టిగా వినిపించింది. అంతేకాదు.. ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తద్వారా వీళ్లిద్దరూ యూట్యూబ్ జోడీగా మారిపోయారు.

వాళ్లకు లాభం చేకూరేలా... అయోమయం

వాళ్లకు లాభం చేకూరేలా... అయోమయం

ఈ మధ్య కాలంలో సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్ మధ్య వచ్చిన వార్తలు మరో జంటపై రాలేదు. అంతలా వీళ్లిద్దరూ కొన్నేళ్లుగా రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో వీళ్ల బంధంపై పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో తమ మధ్య ఏమీ లేదని క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. కానీ, షో నిర్వహకుల ప్లాన్ల కారణంగా లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు నటిస్తుండడంతో అయోమయం నెలకొంది.

రష్మీ ఒకలా.. సుధీర్ మరోలా.. మొత్తానికి

రష్మీ ఒకలా.. సుధీర్ మరోలా.. మొత్తానికి

సుడిగాలి సుధీర్ విషయంలో రష్మీ గౌతమ్ మొదటి నుంచీ స్పష్టతతోనే ఉంది. అతడు తనకు ఫ్రెండ్ మాత్రమేనని చెబుతూనే ఉంది. అయితే, సుధీర్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే, ఇది స్క్రీన్ వరకే అని చెబుతుంటాడు. నిజానికి తనకు ఆఫర్లు రావడానికి, పేరు ప్రతిష్టలు పెరగడానికి యాంకర్ రష్మీనే కారణం అని సుధీర్ ఎన్నో సందర్భాల్లో ఒప్పుకున్నాడు కూడా.

ఉగాదికి ప్రత్యేకంగా.. వాళ్లిద్దరూ గెస్టులుగా

ఉగాదికి ప్రత్యేకంగా.. వాళ్లిద్దరూ గెస్టులుగా

ప్రతి పండుగకూ ఈటీవీలో స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తుంటారు నిర్వహకులు. అందులో జబర్ధస్త్ ఆర్టిస్టులతో పాటు యాంకర్లు కూడా సందడి చేస్తుంటారు. వీళ్లతో పాటు మరికొందరు స్పెషల్ ఎంట్రీ ఇస్తుంటారు. ఇలా ఈ ఉగాదికి 'ఉగాది జాతి రత్నాలు' అనే ఈవెంట్‌ను తీసుకొస్తున్నారు. దీనికి నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ రీతూ వర్మ గెస్టులుగా వచ్చారు. ఇది సందడిగా సాగనుంది.

సుధీర్ మీదకు ఎక్కిన రష్మీ: ఒకరిపై ఒకరు

సుధీర్ మీదకు ఎక్కిన రష్మీ: ఒకరిపై ఒకరు

'ఉగాది జాతి రత్నాలు' ఈవెంట్‌లో రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి కారణం వీళ్లిద్దరూ కలిసి 'ఉప్పెన' సినిమాలోని రొమాంటిక్ సాంగ్ 'జలజలజలపాతం నువ్వు'కు స్ఫూఫ్ చేయడమే. ఇందులో అచ్చం ఆ సినిమాలోలా నీళ్లు, బోట్ సెటప్‌ చేశారు. దీంతో రష్మీ సుధీర్ రెచ్చిపోయి రొమాన్స్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

దుప్పట్లో దూరిపోయి.. తొలిసారి ఘాటుగా

దుప్పట్లో దూరిపోయి.. తొలిసారి ఘాటుగా

ఈ పాటలో భాగంగా రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ మీదకు ఎక్కేసింది. అంతేకాదు, ఇద్దరూ కలిసి దుప్పటిలో దూరిపోయారు. ఇక, చివర్లో అతడి మీద తల పెట్టి పడుకుందామె. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. గతంలో రష్మీ సుధీర్ ఎన్నో రొమాంటిక్ సాంగ్స్ చేసినప్పటికీ.. ఈ రేంజ్‌లో ఎప్పుడూ కనిపించలేదు. దీంతో ఈ ప్రోమో చూసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X