twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్కొక్కరికి ముగ్గురు నలుగురు పిల్లలు.. కొందరు అలా కూడా కంటున్నారు.. యాంకర్ రష్మీ ఫైర్

    |

    జబర్దస్త్ యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరను, వెండితెరను తన అందాలతో షేక్ చేసి.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే అందంలోనే కాదు.. సాయం చేయడంలో, సేవా గుణంలోనూ రష్మీకి ఎవ్వరూ సాటిరారని నిరూపించుకుంది. మూగజీవాల పట్ల ఎంతో ప్రేమన చూపిస్తూ.. వాటికి కోసం పరితపిస్తూ ఉంటుంది. దేశం ఎదుర్కొంటున్నా ప్రధాన సమస్య అయినా జనాభా నియంత్రణ అంశంపై రష్మీ ఓ నెటిజన్‌కు క్లాస్ పీకింది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

    Recommended Video

    Anchor Rashmi Gautam Feeding Road Dogs During Lockdown!
    వ్యక్తిగత బాధ్యత..

    వ్యక్తిగత బాధ్యత..

    దేశంలోని ప్రస్తుత పరిస్థితి, కరోనా లాంటి విపత్కర పరిస్థితిపై నెటిజన్లతో వాగ్వాదానికి దిగింది రష్మీ. ఈ మేరకు స్పందిస్తూ.. ‘ప్రతీ సమస్యకు ప్రభుత్వాలను వేలెత్తి చూపుతారని, ఏ ఒక్కరూ కూడా వ్యక్తిగత బాధ్యతను తీసుకోరని రష్మీ ఫైర్ అయింది. ఎగబడి పిల్లల్ని కనడం ఆపితే దేశంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంద'ని రష్మీ సలహా ఇచ్చింది.

    అందరూ నిరక్షరాస్యులే..

    మన దేశంలో ఎక్కువ మంది నిరక్ష్యరాస్యులేనని రేషన్ కార్డ్, బ్యాంక్ ఖాతాలు కూడా లేవని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దానికి స్పందించిన రష్మీ.. వారికి ఎందుకు లేవ్.. రేషన్ కార్డ్ ఎందుకు లేదు.. అదొక అడ్రస్ ఫ్రూఫ్ కదా అని ప్రశ్నించింది. వారెమీ టన్నుల కొద్దీ సంపాదించి.. దాచిపెట్టుకునేవారు కాదు.. వారంతా నిరక్షరాస్యులని చెప్పుకొచ్చాడు సదరు నెటిజన్. అయితే వారు చదువుకోకపోవడానికి గల కారణం ఏమై ఉంటుందని తిరిగి ప్రశ్నించింది రష్మీ.

    అలా చేయమనండి..

    ‘చివరగా చెప్పేది ఏంటంటే.. మన దేశంలోని ఎన్నో సమస్యలను పరిష్కారంటే మీకు సాధ్యమైనంత వరకు అందరికీ చెప్పండి..మన జనాభాను నియంత్రణలో ఉంచాలనే ఆలోచనను అందరికీ కలిగించండి. డబ్బులు బాగా ఉన్నవారు కనీసం దత్తతకు కూడా ముందుకురారు.. పైగా సరోగసి ద్వారా పిల్లల్నీ కంటున్నారు.

    ముగ్గురు నలుగుర్ని కంటున్నారు..

    ముగ్గురు నలుగుర్ని కంటున్నారు..

    ఈ విషయం అందరికీ వర్తిస్తుంది.. పేదవారని తప్పించుకోవడానికి వీల్లేదు. ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు పిల్లలు కంటున్నారు. ఇంకొంత మంది ఇంకా ఎక్కువ మందినే కంటున్నారు. ఇలా జరగుతుంది కాబట్టే ఇంతటి విపత్కర పరిస్థితిలో ఇన్ని బాధలు పడుతున్నాము. ఇలాగే కొనసాగితే ఎలాంటి పథకం పెట్టినా ఉపయోగం ఉండద'ని చెప్పుకొచ్చింది.

    English summary
    Rashmi Gautam Suggests That Controlling Population For Better India. Bottom line guys Enlighten as many as u can to control population and not to multiple Controlling our numbers is the only way to eradicate most of our issues And tis includes the previlged ones too Most of them r not even open to adoption and prefer surrogacy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X