శ్రీముఖి గురించి నాకంతా తెలుసు.. అందుకే! వీడియోతో ముందుకొచ్చిన రష్మీ
Recommended Video
బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షోలో ఆయన ఇస్తున్న టాస్క్‌లు స్పెషల్ కిక్ ఇస్తున్నాయి. నాగార్జున హోస్ట్‌గా జులై 21వ తేదీన ప్రారంభమైన ఈ షో విజయవంతంగా పద్నాలుగో వారం ఫినిష్ చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు కానున్నారనే దానిపై బుల్లితెర ఆడియన్స్ లో క్యూరియాసిటీ నెలకొంది. సరిగ్గా ఈ తరుణంలో యాంకర్ శ్రీముఖి గురించి రష్మీ మాట్లాడటం హాట్ టాపిక్ అవుతోంది.

15 మంది పార్టిసిపెంట్స్.. ఒక్కొక్కరుగా
15 మంది పార్టిసిపెంట్స్‌తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 నుంచి.. ప్రతీ వారం ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ చివరగా ఆరుగురు మాత్రమే మిగిలారు. అలీ, రాహుల్, శివజ్యోతి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, శ్రీముఖి మాత్రమే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు. దీంతో ఈ ఆరుగురిలో విన్నర్ ఎవరు అవుతారు? ఎవరెవరికి ఏయే సపోర్ట్ లభిస్తుందనేది చర్చనీయాంశం అయింది.

సడెన్‌గా ఎంటరైన వీడియోతో రష్మీ..
అలీకి సీరియల్ నటులంతా సపోర్ట్ ఇస్తుండగా, శివజ్యోతికి హిమజ, వరుణ్ కి పునర్నవి, వితికాలు సపోర్ట్ చేస్తున్నారు. ఇంతలో యాంకర్ శ్రీ ముఖి విషయమై సడెన్‌గా ప్రత్యక్షమైంది రష్మీ గౌతమ్. తాను శ్రీముఖికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నానంటూ ఈ వీడియోలో పేర్కొంది రష్మీ.

శ్రీముఖి గురించి నాకంతా తెలుసు
యాంకర్ శ్రీముఖి గురించి తనకు మొత్తం తెలుసని చెప్పిన రష్మీ గౌతమ్.. తన ఫుల్ సపోర్ట్ శ్రీముఖికి మాత్రమే అని చెప్పింది. ఈ సందర్బంగా లవ్ యూ శ్రీ ముఖి అని కూడా అనేసింది. శ్రీముఖిని బిగ్ బాస్ విన్నర్‌గా చూడాలని ఉందని ఆమె చెప్పింది. దీంతో శ్రీముఖి ఓ బలమైన సపోర్ట్ దొరికినట్లయింది.

ఇదీ శ్రీముఖిపై టాక్..
బిగ్ బాస్ షో ప్రారంభం నుంచే బిగ్ బాస్ హౌస్‌లో యాక్టీవ్‌గా ఉంటూ వస్తున్న శ్రీముఖిపై కొన్ని రూమర్స్ మాత్రం ఉన్నాయి. ఆమె బిగ్ బాస్ హౌస్‌మేట్స్ మధ్య గొడవలు పెట్టిస్తుందని, ఇక్కడివి అక్కడ.. అక్కడివి ఇక్కడ చెబుతుందని పలువురు బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీముఖికి రష్మీ సపోర్ట్ అందడం కొండంత బలాన్నిచ్చినట్లే మరి.

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా..
100 రోజుల పాటు సాగిపోనున్న ఈ షో చివరి దశకు చేరుకోవడంతో బిగ్ బాస్ విన్నర్ కావాలని ఆరాట పడుతున్నారు ఇప్పటిదాకా హౌస్ లో ఉన్న పార్టిసిపెంట్స్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆడియన్స్‌ని పెద్ద ఎత్తున ఓట్లు అడుగుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిగ్ బాస్ ఓటింగ్ గురించిన పోస్టులే కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ సారి విజేత ఎవరనేది.!


Click it and Unblock the Notifications











