ఒక్కొక్కడికి పళ్లు రాలగొడతా... ఓపిక చచ్చిపోయిందంటూ యాంకర్ రష్మి ఘాటు వ్యాఖ్యలు

టాలీవుడ్‌లోని స్టార్ యాంకర్‌లలో రష్మి గౌతమ్ ఒకరు. దాదాపు 13 ఏళ్లుగా జబర్దస్త్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఎందరో కమెడియన్లు, యాంకర్లు, జడ్జిలు మారినా తను మాత్రం జబర్దస్త్‌కే అంకితమైపోయారు. ఆడపాదడపా సినిమాలు చేస్తున్నా జబర్దస్త్‌ను మాత్రం విడిచిపెట్టడం లేదు. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు రష్మి. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఈ ముద్దుగుమ్మ సీరియస్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..

ప్రతివారం ఏదో ఒక థీమ్‌‌తో శ్రీదేవి డ్రామా కంపెనీ ముస్తాబై వస్తుంది. తాజాగా వారం తెలంగాణలో ఘనంగా జరుగుతున్న ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క - సారక్కల జాతర బ్యాక్‌డ్రాప్‌తో ప్రత్యేకంగా రెడీ అయ్యింది. ప్రోమో స్టార్టింగ్‌లోనే తెలుగు వాళ్లంతా మన తెలంగాణ దిక్కు చూసే పండగ వచ్చిందని అదిరే అభి అంటాడు.. ఏం పండగ అని కెవ్వు కార్తీక్ అడుగుతాడు. సమ్మక్క- సారక్క జాతరని అభి చాలా గర్వంగా చెబుతాడు. ఆ వెంటనే సమ్మక్క - సారక్క జాతర విజువల్స్‌తో పాటు పలువురు జానపద గాయకులు వనదేవతల గురించి లైవ్ పర్ఫారెన్స్ ఇచ్చారు. మేడారం జాతరని తీసి.. మా శ్రీదేవి డ్రామా కంపెనీ గోడౌన్‌లో దింపారని ఇంద్రజ మెచ్చుకుంది.

Rashmi Gautam Turns Serious in Sridevi Drama Company Samakka Sarakka Jathara Special Episode

ఆ వెంటనే పొట్టి నరేష్ సోదీ చెప్పే అవ్వలా రాగా.. యాంకర్ రష్మి చేయి పైకెత్తి సూదమ్మ, సూదమ్మ అని పిలుస్తుంది. సూదమ్మ, దారం అమ్మ కాదే.. సోదమ్మ అని అంటాడు పొట్టి నరేష్. నా పెళ్లి ఎప్పుడు అవుతుందని రష్మి అడగ్గా... నీకు కాబోయేవాడు మహారాజులా ఉంటాడు. రాత్రయితే ఎవ్వరికీ కనపడడు. జేబులో నుంచి పావురాలు తీస్తాడు. రాత్రయితే ఆ పావురాల్ని వాడుకుంటూ ఉంటాడు. నాకెందుకో వాడు కాకుండా ఇంకెవరో ఉన్నాడనిపిస్తోంది నీ భవిష్యత్‌లో అని నరేష్ చెప్పగానే రష్మి నవ్వేస్తుంది.

అనంతరం రష్మి చాలా సీరియస్‌గా కొంతమంది చాలా ఎక్స్‌ట్రాలు చేస్తున్నారు.. అందుకే నేను మీ పళ్లు రాలగొట్టాలని అనుకుంటున్నానని వార్నింగ్ ఇవ్వగానే.. జడ్జి ఇందిర సహా కమెడియన్లు, ఇతర ఆర్టిస్ట్‌లు షాక్ అయ్యారు. తన ఎదురుగా ఉన్న బోర్డ్‌పై కర్టెన్ తీయగా అందులో పొట్టి నరేష్, ఆటో రాంప్రసాద్ ఫోటోలు ఉంటాయి. వాటిపై అమ్మాయిలతో బంతులతో కొట్టిస్తుంది రష్మి. ఆ తర్వాత రష్మి, బుల్లితెర నటి భావనల ఫోటోలు కూడా ఉంటాయి. వాటిని కూడా అలాగే పళ్లు రాలగొడుతుండగా రష్మీ షాక్ అవుతుంది.

ఇక రిపబ్లికన్ డేను పురస్కరించుకుని ఇండియన్ ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో సైనికుడిని తన తల్లి సరిహద్దులకు పంపుతూ పడే ఆవేదనను, సైనికుడు యుద్ధంలో చనిపోతే అతని కుటుంబం పడే నరకయాతనను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న ఓ సైనికుడిని స్టేజ్ మీదకి తీసుకొచ్చి సన్మానించారు. నాలుగేళ్ల క్రితం ఇక్కడ ఢీ షోలో డ్యాన్సర్‌గా చేశానని.. అక్కడ మీతో ఫోటో దిగాలని అనుకున్నానని చెబుతాడు ఆ జవాన్. అప్పుడు మీరు అనుకోవడం కాదు.. ఇప్పుడు మేమంతా మీతో ఫోటో దిగాలని కోరుకుంటున్నాం అని ఇంద్రజ చెప్పగా.. కమెడియన్లు, ఇంద్రజ, ఇతర ఆర్టిస్ట్‌లతో కలిసి ఆ జవాన్ సెల్ఫీ దిగాడు.

ఆ తర్వాత అమ్మాయితో కంచంలో ముక్కలు.. మంచం మీద చుక్కలు అనే ఆట ఆడిస్తుంది రష్మి. దీనిలో భాగంగా అమ్మాయిలు వీపుపై బంతిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్లి ఖాళీ డబ్బాలో వేయాలి. ఆ ఆట వినోదాన్ని పంచినట్లుగా కనిపిస్తోంది. మరి సమ్మక్క - సారక్క జాతర సందర్భంగా కంటెస్టెంట్స్ చేసిన అల్లరి, సైనికుడు దేశం గురించి చెప్పిన మాటలు, ఇతర సందడి చూడాలంటే ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X