అంటీ అనసూయ అంటూ నెటిజన్లు దారుణంగా.. పండుగ చేసుకోండి అంటూ రష్మీ గౌతమ్

యాంకర్, యాక్టర్ అనసూయ భరద్వాజ్, నెటిజన్ల మధ్య ట్విట్టర్ వార్ గట్టిగా కొనసాగుతున్నది. గత మూడు రోజులుగా అనసూయను ట్రోలింగ్ చేయడం, ఆ ట్రోల్స్‌కు సమాధానం ఇస్తూ తన వాదనను వ్యక్తం చేయడం ఆసక్తిగా మారింది. లైగర్ రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ కర్మ సిద్దాంతాన్ని చెప్పడంతో ఈ వివాదం మొదలైంది. అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, నెటిజన్లు అనసూయపై విరుచుకు పడుతున్న సమయంలో యాంకర్ రష్మీ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..

లైగర్‌పై అనసూయ కామెంట్

లైగర్‌పై అనసూయ కామెంట్

లైగర్ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో అనసూయ ట్విట్టర్‌లో.. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!' అని ట్వీట్ చేశారు. దాంతో నెటిజన్లు ఘాటుగా స్పందించారు. అనసూయ ట్వీట్‌పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ స్పందిస్తూ.. 'ఏమన్నాడు విజయ్ నిన్ను..? ఎందుకంత అక్కసు..? ఇండస్ట్రీలో ఉన్న మీకు మీరే సపోర్ట్ చేసుకోకపోతే ఇంకా బయటి వాళ్ళు ఎలా చేస్తారు అని ఓ నెటిజన్ ఘాటుగా స్పందించారు.

ఆంటీ అంటూ అనసూయను

ఆంటీ అంటూ అనసూయను

అయితే నెటిజన్లతో అనసూయ ట్విట్టర్‌లో వాగ్వాదం జరుగుతున్న సమయంలో ఆంటీ అంటూ నెటిజన్లు సంబంధించారు. తనను ఆంటీ అనకూడదు. నాకు ఒక పేరు ఉంది. ఆ పేరుతో పిలువండి అంటూ అనసూయ ఘాటుగా స్పందించింది. దాంతో మీరు 40 ఏళ్ల వయసులో ఉన్నారు. ఆంటీ అంటే తప్పేమిటి అని నెటిజన్లు గట్టిగా ట్వీట్లతో ఆటాడుకొన్నారు.

డీ గ్రేడ్ ఎందుకు అని..

డీ గ్రేడ్ ఎందుకు అని..

ఇలా గొడవ జరుగుతుంటే.. మేడమ్.. ఇలాంటి వాటిలో దూరడం మీకు అవసరమా? ఇంకొకరి చేత డీ గ్రేడ్ ఎందుకు చేయించుకొంటారు? మీరు చేసిన తప్పేమిటంటే.. మీరు సినిమా ఇండస్ట్రీలో ఉంటూ.. ఒక సినిమా ఫ్లాప్ టాక్ వస్తే.. దాన్ని సపోర్ట్ చేయడమా? ఇలా చేస్తే మీరు నెటిజన్ల నుంచి మంచి కామెంట్లు ఎక్స్‌పెక్ట్ చేయడం తప్పు అని ఓ నెటిజన్ ఘాటుగా స్పందించాడు.

నన్ను వేధించే వాళ్లను


నెటిజన్ కామెంట్లకు అనసూయ స్పందిస్తూ.. నన్ను వేధించే వాళ్లే డీ గ్రేడ్ అవుతారు. నేను డీ గ్రేడ్ ఎందుకు అవుతానండి. ఇదేం ప్రాబ్లెం. ఒక అమ్మాయిని ఎవరన్నా స్లట్ షేమ్ చేస్తే.. అమ్మాయి సిగ్గుపడి దాక్కోవాలి. అన్నవాడు మాత్రం దర్జాగా తిరగాలి. ఇది తప్పు కాదండి. నేను ఏదో ఒక సినిమా గురించి నా అభిప్రాయం చెబితే.. అది నా అభిప్రాయం మాత్రమే. నా అభిప్రాయాన్ని మీరు తప్పు పట్టకూడదు అని అనసూయ జవాబిచ్చింది.

ఆంటీ అంటే కేసు పెడుతా


ఇక తనను ఆంటీ అంటూ సంబంధించడంపై ఘాటుగా స్పందించింది నన్ను అనసూయ అని పిలువండి. నాకు మా అమ్మ, నాన్న ప్రేమతో ఆ పేరు పెట్టారు. నన్ను ఆంటీ అంటే పోలీస్ స్టేషన్‌లో కేసు పెడుతాను అంటూ నెటిజన్లను బెదిరించింది. దాంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ఎవరైనా హత్య చేస్తే కేసు పెడుతారు. ఆస్థి తగాదాలతో కేసు పెడుతారు. ఈవిడేంట్రా ఆంటీ అంటే కేసు పెడుతానంటుంది అని నెటిజన్లు సెటైర్ వేశారు.

రష్మీ ఫన్నీగా కామెంట్


అయితే అనసూయతో ట్విట్టర్‌లో వివాదం కొనసాగుతుంటే.. రష్మీ గౌతమ్‌ను ఉద్దేశించి ఓ వ్యక్తి ట్వీట్ చేస్తూ.. నీతో అసలు గొడవే లేదు. ఎవరు ఏమన్నా పట్టించుకోవు. అసలు ఎవరికైనా రిప్లై ఇవ్వవు. అసలు నీకు తెలుగు అర్ధం కాదు అని నెటిజన్ కామెంట్ చేశాడు. దాంతో పండగ చేసుకోండి అంటూ సింపుల్‌గా కామెంట్ పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X