నీకు ఫస్ట్‌నైట్ అయిందా? ఓంకార్ షాకింగ్ ప్రశ్న.. రష్మి గౌతమ్, వర్షిణి రచ్చ రచ్చ..

టాప్ యాంకర్, సినీ దర్శకుడు ఓంకార్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న సిక్త్‌సెన్స్ షో సందడిగా కొనసాగుతున్నది. వారం వారానికి రేటింగ్‌ను మెరుగు పరుచుకొంటూ ముందుకెళ్తున్నది. తాజా ఎపిసోడ్‌లో రష్మీ గౌతమ్, వర్షిణి సౌందర్‌రాజన్ హంగామా చేశారు. ఇంకా లేటేస్ట్ ఎపిసోడ్‌లో ఓంకార్ చేసిన హంగామా, రష్మీ, వర్షిణి చేసిన హల్‌చల్ ఏమిటంటే..

సిక్త్ సెన్స్‌లో గ్లామర్‌ పంట

సిక్త్ సెన్స్‌లో గ్లామర్‌ పంట

ప్రస్తుత వారంలో ప్రసారం కాబోయే సిక్త్ సెన్స్ ఎపిసోడ్‌లో గ్లామర్‌తో ఓంకార్‌ నింపేశాడు. టాప్ యాంకర్లు రష్మీ, వర్షిణితోపాటు బుల్లితెరపై టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకొంటున్న జానకి కలగనలేదు సీరియల్ నటీనటులు ఈ షోలో పాల్గొన్నారు. వీరంతా ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచేందుకు నానా హంగామా చేశారు.

ఓంకార్‌ను ఆటపట్టించిన రష్మి, వర్షిణి

ఓంకార్‌ను ఆటపట్టించిన రష్మి, వర్షిణి

సిక్త్ సెన్స్ తాజా ఎపిసోడ్‌లో ఓంకార్‌ను పొగుడ్తలతో రష్మీ, వర్షిణి ఆటపట్టించారు. ఓంకార్‌ను షూట్ చేసేందుకు రష్మీ సిద్ధం కాగా, వన్ సెకన్ అంటూ ఓంకార్ తనదైన శైలిలో ఆపాడు. దాంతో నీలో నచ్చనిది అదే అంటూ కొంటెగా ప్రశ్నించింది. అయితే నీలో నచ్చేదే నాకు అదే అంటూ సమాధానం ఇవ్వడంతో... ఏమిటని రష్మీ మళ్లీ అడిగింది. దాంతో నీ క్యూట్ నెస్ అని ఓంకార్ సమాధానం చెప్పడంతో రష్మీ సిగ్గు పడుతూ నవ్వుల్లో మునిగిపోయింది.

నిన్ను పిస్టల్‌తో కాల్చేస్తా

నిన్ను పిస్టల్‌తో కాల్చేస్తా

ఇక ఓంకార్‌ను రష్మి పొగుడుతూ.. నీ గడ్డం ఎంత బాగుంటుందంటే అని అనగానే.. పక్కనే వర్షిణి ట్రెండ్ సెట్టింగ్ అంటూ కామెంట్ చేసింది. అంతటితో వర్షిణి ఆగక ఆయన హెయిర్ స్టయిల్ కూడా నెక్ట్స్ లెవెల్ అంటూ కామెంట్ చేసింది. ఇన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం చేయాలనిపిస్తున్నదో తెలుసా? మిమ్మల్ని పిస్టల్‌తో షూట్ చేయాలనిపిస్తుంది అంటూ ఓంకార్ షాకిచ్చాడు.

డ్యాన్స్‌తో రష్మి, వర్షిణి రచ్చ

డ్యాన్స్‌తో రష్మి, వర్షిణి రచ్చ

ఆ తర్వాత వేదిక మీద నా తప్పు ఏమున్నదబ్బా అనే పాటపై స్టెప్పులే వేసి అందరగొట్టారు. రష్మి, వర్షిణి చేసిన డ్యాన్స్‌కు ఫ్లోరంతా అదిరిపోయింది. పక్కనే ఉన్న డ్యాన్సర్లు కూడా వారితో కలిసి జోష్‌గా స్టెప్పులేశారు. ఇలా సిక్త్ సెన్స్‌కు మరింత గ్లామర్‌ను అద్దారు. ఇలా సరదాగా సిక్త్ సెన్స్ ఎపిసోడ్ అదిరిపోయింది.

జానకి కలగనలేదు టీమ్‌తో హంగామా

జానకి కలగనలేదు టీమ్‌తో హంగామా

రష్మీ, వర్షిణి హంగామా తర్వాత జానకి కలగనలేదు సీరియల్ నటీనటులు రంగ ప్రవేశం చేశారు. జానకిగా నటించిన ప్రియాంక జైన్, రామచంద్ర అమర్ దీప్ చౌదరీ తదితరులు ఈ షోలో పాల్గొన్నారు. జానకి కలగనలేదు అంటూ ఇద్దరూ కలిసి పాట పాడారు. ఆ పాట పూర్తి కాగానే.. ఇంతకు ఫస్ట్ నైట్ అయిందా? అని అడిగితే.. మా అన్నయ్యకు అయితే 250 ఎపిసోడ్స్ అయినాయి. మాకు ఫస్ట్ నైట్ కావాలంటే 500 అవుతాయేమో.. అంటే అప్పటి వరకు మంగళవారమేనా అంటూ ప్రశ్నించాడు.

మంచమేసి దుప్పటేసి.. అంటూ

మంచమేసి దుప్పటేసి.. అంటూ


ఆ తర్వాత జానకి కలగనలేదు టీమ్ మంచమేసి దుప్పటేసి పాటపై డ్యాన్సులు చేసి రచ్చ చేశాడు. ప్రియాంక జైన్, అమర్ దీప్ డ్యాన్స్ ఫ్లోర్‌ను దడదడలాడించారు. తన అన్నా, వదిన పాత్రధారులను ఆటపట్టిస్తూ.. వినోదాన్ని పంచారు. ఈ ఎపిసోడ్ శనివారం, ఆదివారాల్లో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X