సుడిగాలి సుధీర్‌తో ఎఫైర్ రూమర్స్‌పై స్పందించిన రష్మి
హైదరాబాద్: తెలుగులో ఈ మధ్య కాలంలో బాగా హిట్టయిన టీవీ షో ‘జబర్దస్త్ కామెడీ షో'. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి యాంకర్‌గా చేస్తున్న రష్మి చుట్టూ రకరకాల రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో కామెడీ స్కిట్లు చేసే టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్‌తో రష్మి పరిచయం స్నేహం నుండి రొమాంటిక్ రిలేషన్‌షిప్‌గా మారిందని చాలా రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి.
జబర్దస్త్ కార్యక్రమంలో కూడా ఈ రూమర్స్ నిజమే అనే విధంగా ప్రవర్తిస్తుంటా ఇతర టీం మెంబర్స్. దీంతో ఈ షో చూసే జనాలు కూడా సుడిగాలి సుధీర్, రష్మి మధ్య లవ్ ఎఫైర్ ఉందని ఊహించుకుంటున్నారు. ప్రస్తుతం ఓ సినిమా షూటింగులో బిజీగా ఉన్న రష్మి... ఈవార్తలపై స్పందించింది. తమ మధ్య అలాంటిదేమీ లేదని తేల్చిచెప్పింది.

ఇటీవల మీడియాతో ఆమె మాట్లాడుతూ... నాకు తెలుగు సరిగా తెలియదు. సుధీర్ ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు కాబట్టి నాపై ఏమైనా జోక్స్ వేస్తే అడిగి తెలుసుకుంటాను. క్లోజ్ గా ఉన్నంత మాత్రాన తమ మధ్య ఏదో ఉన్నట్లు ఊహించుకోవడం సరికాదు అని అంటోంది.
ప్రస్తుతం రేష్మి... చారుశీల అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతో జశ్వంత్ అనే కొత్త హీరో, శ్రీనివాస్ ఉయ్యూరు అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. చారుశీలను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేసి త్వరలో చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా గుంటూరు టాకీస్ అనే చిత్రం లో కూడా రేష్మి నటించింది.


Click it and Unblock the Notifications











