బుల్లిగౌనులో పిచ్చెక్కిస్తున్న రష్మీ గౌతమ్… అలా చేతులు పైకెత్తి మరీ!
యాంకర్ రష్మీ తెలుగులో పాపులర్ యాంకర్. ముందు నుంచే సినిమాల్లో ఉన్న ఈ భామ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులలో మంచి పేరు సంపాదించింది. ప్రస్తుతం రష్మీ ఈటీవీ లో ప్రసారం అయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్, డీ షోలు చేస్తోంది. ఇవి కాకుండా ఈ టీవీ చేసే స్పెషల్ ఈవెంట్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ భామ అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉండేది. అయితే వీటన్నిటికీ మించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లు షేర్ చేస్తూ ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటుంది. ఆమె షేర్ చేసిన తాజా ఫోటోషూట్ రచ్చ రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

సినిమాలు వర్కౌట్ కాలేదు
రష్మీ వెండితెర మీద నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కంటే గ్లామర్ షో, అందాల ఆరబోతకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ అలాంటి పాత్రలు ఎంచుకుంది. ఆమె ఎంచుకుందో ఆమెకు అలాంటి అవకాశాలు మాత్రమే వస్తున్నాయో తెలియదు కానీ మొత్తానికి గ్లామర్ డోస్ ఎక్కువ ఉన్న పాత్రలే లభిస్తున్నాయి. ఇక ఆమె ఎంత అందాలు ఆరబోసినా సరే ప్రేక్షకులు బుల్లితెర మీద ఆదరించిన అంత బాగా వెండితెర మీద ఆదరించలేదు.

సోషల్ స్టార్
సినిమాల్లో పెద్దగా క్లిక్ కాలేదు కానీ బుల్లితెర మీద కనిపిస్తే మాత్రం ప్రేక్షకులు పట్టం కట్టేశారు. ఆమె ఉన్న అన్ని వీడియోలు మంచి వ్యూస్ ఆమె చేస్తున్న అన్ని షోలకు మంచి టిఆర్పిలు వస్తూ ఉంటాయి. రశ్మీకి షల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కేవలం తన హాట్ హాట్ ఫోటోలు అప్లోడ్ చేయడమే కాక తనలోని సామాజిక కోణాన్ని కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా అప్పుడుప్పుడూ చూపిస్తూ ఉంటుంది.

గుంటూరు టాకీస్
2016లో గుంటూరు టాకీస్ సినిమాతో కాస్త బ్రేక్ వచ్చింది అనుకున్నా కానీ ఆ తర్వాత రాజు గారి బంగ్లా, అంతం, తను వచ్చెనంట లాంటి సినిమాల్లో మంచి పాత్రలు దక్కినా సరే సినిమా అవకాశాలు మాత్రం పెద్దగా దక్క లేదు. తర్వాత నెక్స్ట్ నువ్వే, అంతకుమించి శివరంజని లాంటి సినిమాల్లో నటించినా ఆమెకు అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదు.

పసుపుపచ్చ బుల్లిగౌనులో
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తూ ఉండే ఈ భామ తాజాగా పసుపుపచ్చ హాట్ ఫోటో షూట్ షేర్ చేసింది. రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు దిగి వాటిని తన అభిమానులతో పంచుకుంది. ఇంకేముంది ఆమె అభిమానులు అందరూ ఆమె ఫోటో షూట్ కు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు

బంపర్ ఛాన్స్
ఇక జరుగుతున్న ప్రచారం మేరకు ఈ భామకు ఒక లక్కీ ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాగా ఒక షెడ్యూల్ గోవాలో పూర్తయింది. తర్వాత హైదరాబాద్ లో షూటింగ్ జరపాలని ప్లాన్ చేసినా కరోనా లాక్డౌన్ కారణంగా ప్రస్తుతానికి జరపడం లేదు. ఈ సినిమాలో ఆమెకు అవకాశం దక్కిందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











