నూకరాజుతో రష్మి గౌతమ్ ఫైట్.. జబర్దస్త్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ చిచ్చు

By Lekhaka

సినిమాలైనా, టెలివిజన్ షోలైనా నటీనటుల మధ్య వివాదాలు రావడం అనేది సర్వసాధారణం. ఒకవేళ గొడవలే జరిగితే, వారి మధ్య వివాదం నడిచిందో ఆ ఇద్దరు నటీనటులు ఎక్కువగా ఎదురుపడకుండా, లేదంటే కలిసి సినిమాలు చేయకుండా చూసుకుంటారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే కాంప్రమైజ్ అవుతారు, లేదా అవకాశాన్ని వదిలేసుకుంటారు. తాజాగా బుల్లితెరపై కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రెండు పాపులర్ షోలైన శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన గొడవను జబర్దస్త్ లో కూడా కంటిన్యూ చేస్తున్నారు నూకరాజు, రష్మీ. మరి వీరిద్దరి మధ్య జరిగిన వివాదం ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

తాజాగా జబర్దస్త్ కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోకు సంబంధించిన ఎపిసోడ్లు జూలై 12, 13న అంటే వచ్చే శుక్రవారం, శనివారం టెలికాస్ట్ కాబోతున్నాయి. ఇక ప్రతివారం శుక్రవారం, శనివారం రెండు రోజుల్లో ప్రసారమవుతున్న ఈ షోకు రష్మీ ఒక్కతే యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే జబర్దస్త్ కు కుష్బూ, కృష్ణ భగవాన్ జడ్జిలుగా ఉండి షోను నడిపిస్తున్నారు.

Rashmi Gowtham fight with nooka raj in Jabardasth Latest episode

తాజా ప్రోమోలో నూకరాజు రష్మీకి గతంలో వారిద్దరి మధ్య జరిగిన వివాదాన్ని గుర్తు చేస్తూ సెటైర్ వేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన విషయాన్ని నూకరాజు స్కిట్ లో మరోసారి చూపించారు. అందులో రష్మీ నా పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటూ నూకరాజుపై సీరియస్ అవ్వగా, నూకరాజు కూడా ఎక్కడా తగ్గకుండా మాట్లాడాడు. దీంతో దాదాపుగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినంత పనైంది.

సెట్లో అందరూ ఉన్నప్పటికీ ఈ విషయాన్ని సీరియస్ గా చూస్తున్నారు తప్ప ఎవ్వరూ వీరి వివాదాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. అదంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి వెళ్లి చూసుకోవాలి అని రష్మీ సలహా ఇవ్వగా, అవునా అయితే అలాగే అంటూ నూకరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు గతంలో శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన వివాదాన్ని జబర్దస్త్ తాజా ప్రోమోలో చూపించారు.

Rashmi Gowtham fight with nooka raj in Jabardasth Latest episode

రానున్న జబర్దస్త్ ఎపిసోడ్లో నూకరాజు రశ్మిని ఉద్దేశిస్తూ ఆ ఇంట్లో జరిగిన గొడవలకు ఈ ఇంట్లో అలక ఎందుకు చిలకా? అంటూ శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన గొడవను జబర్దస్త్ లో ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు అన్నట్టు పంచ్ వేశాడు. దీంతో రష్మీ ఇంకా అలకబూనినట్టుగానే ఎక్స్ప్రెషన్ పెట్టింది. కానీ సెట్ లో ఉన్న మిగతా వాళ్లంతా కడుపుబ్బా నవ్వారు నూకరాజు పంచ్ కి.

కాగా రానున్న ఎపిసోడ్ లో నూకరాజు ఈసారి తన స్కిట్ లో భాగంగా ఏఎన్ఆర్ శైలిలో నటిస్తూ కనిపించాడు. పైగా ఖుష్బూపై కూడా రొమాంటిక్ పంచ్ వేశాడు. అప్పట్లో నువ్వు పరిచయమై ఉంటే కడవెత్తుకొచ్చింది ఖుష్బూ పిల్ల అంటూ ఒక సాంగ్ వేసే వాడిని తెలుసా? అని డైరెక్ట్ గా ఖుష్బూకే చెప్పేశాడు. ఇదిలా ఉండగా రష్మి, నూకరాజు వివాదం ఇక్కడితో ముగిసినట్టేనా? లేదా టిఆర్పి రేటింగ్స్ కోసం ఇంకా తమ మధ్య విషయాలు సద్దుమనగలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X