బిగ్ బాస్‌2: కౌశల్ గెలవకపోతే ధర్నాలే.. నాకు మొత్తం తెలుసు.. బిగ్ బాస్‌పై రష్మీ కామెంట్స్!

Recommended Video

Bigg Boss Season 2 Telugu: Anchor Rashmi Superb Words About Kaushal Army

జబర్దస్త్ యాంకర్ గా రష్మీ బాగా పాపులర్ అయింది. గుంటూర్ టాకీస్ చిత్రంలో యువతకు పిచ్చెక్కించేలా అందాల ఆరబోసింది. మరో మారు తన అందాల ఘాటు చూపించేందుకు రష్మీ సిద్ధం అవుతోంది. తాజగా రష్మీ నటించిన చిత్రం అంతకు మించి. టీజర్, ట్రైలర్స్ లో రష్మీ సోయగాల గురించి యువత చర్చించుకుంటున్నారు. ఈ చిత్రం ఆగష్టు 24 న విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో రష్మీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా బిగ్ బాస్ 2 గురించి రష్మీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

బిగ్ బాస్ చూడను

బిగ్ బాస్ చూడను

తాను బిగ్ బాస్ షో పెద్దగా చూడనని రష్మీ తెలిపింది. బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న సభ్యులు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందువలన షోలో ఎం జరుగుతుందనే విషయాలు మాత్రం తెలుసుకుంటుంటాను అని రష్మీ తెలిపింది.

మంచి స్నేహితులు

మంచి స్నేహితులు

బిగ్ బాస్ హౌస్ సభ్యులైన నందిని రాయ్(నందిని ఎలిమినేట్ అయింది), కౌశల్ నాకు మంచి స్నేహితులు. గీత మధురితో పరిచయం ఉంది. బిగ్ బాస్ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి చర్చ జరుగుతుందో గమనిస్తూ ఉంటానని రష్మీ తెలిపింది.

చూడాల్సిన అవసరం లేదు

చూడాల్సిన అవసరం లేదు

బిగ్ బాస్ షోని పనికట్టుకుని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే షోలో ఏం జరిగినా వెంటనే సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతుంది. ఢీ షోలో కూడా ఎవరు గెలుస్తారో సోషల్ మీడియాలో ముందే చెప్పేస్తారు.

ధర్నాలే

ధర్నాలే

కౌశల్ ఆర్మీ పేరుతో కౌశల్ కు ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది. దీనిని బట్టే కౌశల్ గెలుపు ఏకపక్షం అని అర్థం అయిపోతోంది. ఒక వేళ కౌశల్ గెలవక పోతే బయట ధర్నాలు కూడా జరగొచ్చు అంటూ రష్మీ చమత్కరించింది.

ఎలిమినేషన్ గండం

ఎలిమినేషన్ గండం

ఇదిలా ఉండగా కౌశల్ మద్దత్తుదారులు కలవరపడేలా ప్రస్తుతం కౌశల్ నామినేషన్ లో ఉన్నాడు. అంటే కౌశల్ కు కూడా ఎలిమినేషన్ గండం ఉంది. ఈ వారం నామినేట్ అయిన వారు కేవలం నలుగురే కావడంతో మరింత ఉత్కంఠ నెలకొని ఉంది. కౌశల్ కు దక్కుతున్న మద్దత్తు దృష్ట్యా అతడు బయటపడడం పెద్ద కష్టం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎలిమినేషన్ ఖరారు

ఎలిమినేషన్ ఖరారు

ఈ వారం దీప్తి ఎలిమినేట్ కావడం ఖాయం అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీప్తితో పాటు నామినేషన్ లో కౌశల్, తనీష్, పూజ ఉన్నారు. కౌశల్, తనీష్ కు మద్దత్తు ఎక్కువగా లభించే అవకాశాలు ఉన్నాయి. పూజ హౌస్ లోకి వచ్చి కొద్దిరోజులు మాత్రమే అవుతోంది కాబట్టి ఆమెకు ప్రమాదం ఉండకపోవచ్చు. ఇక మిగిలింది దీప్తినే. ఈ సస్పెన్స్ వీడాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X