కుక్కలా తిరిగి ఏం చేస్తున్నావు.. పల్లవి ప్రశాంత్‌పై కంటెస్టెంట్ల మూకుమ్మడి దాడి.. రైతు బిడ్డకు రతిక వెన్నుపోటు
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో రెండోవారమే కంటెస్టెంట్లు రెండు జట్లుగా విడిపోయాయి. టెలివిజన్ సీరియల్‌లో నటించే యాక్టర్లు ఒక జట్టుగా, యాక్టర్ శివాజీ సపోర్ట్ చేసే టీమ్ మరో జట్టుగా విడిపోయారు. రెండోవారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఇంటి సభ్యులు తమ నిజస్వరూపాలను బయటపెట్టుకొన్నారు. నామినేషన్ ప్రక్రియలో రైతు బిడ్డగా చెప్పుకొనే పల్లవి ప్రశాంత్‌ను ఇంటి సభ్యుల మూకుమ్మడిగా మాటల దాడి చేశారు. ఈ నామినేషన్ల ప్రక్రియ వివరాల్లోకి వెళితే..
నామినేషన్ల ప్రక్రియలో మొదట షకీలా, సింగర్ దామిని ఒక్కసారిగా ప్రశాంత్‌పై విరుచుకుపడ్డారు. నీ ఇంటిలో ఏ గేమ్ ఆడుతున్నావు? నీ నాకు కనిపించడం లేదు అంటూ ఆరోపించారు. నీకు ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్లు, ఎప్పుడ నీ గురించి నీవే చెప్పుకొంటావు అని దామిని గట్టిగా అరిచింది. ఇక డాక్టర్ గౌతమ్ మాట్లాడుతూ.. నీవు రైతు బిడ్డవని చెప్పుకొంటూ.. సానుభూతి సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నావు అని అన్నాడు. అయితే నేను రౌతు బిడ్డనే.. నేను అది గొప్పగా చెప్పుకొంటున్నాను అని పల్లవి ప్రశాంత్ అన్నాడు.

అలాగే పల్లవి ప్రశాంత్‌ను డాక్టర్ గౌతమ్ టార్గెట్ చేస్తూ.. నీవు సోషల్ మీడియాలో పోస్టు పెడితే లక్ష రూపాయలు వస్తాయి. నీవు డబ్బు సంపాదించడం తెలుసు అంటే.. నాకు ఆ డబ్బు అవసరం లేదు. నాకు అలా డబ్బు వస్తే.. అలాంటి డబ్బును పేద రైతుకు ఇస్తాను అని పల్లవి ప్రశాంత్ చెప్పే ప్రయత్నం చేశాడు.
అయితే తాను సంపాదించే డబ్బును పేద రైతు కుటుంబానికి ఇస్తానని చెప్పడంపై అమర్ దీప్ అభ్యంతరం చెప్పాడు. పేద రైతుకు ఇస్తానని చెబుతున్నావు కానీ.. రైతు స్థానంలో లారీ డ్రైవర్, రిక్షా డ్రైవర్, ఆటో డ్రైవర్‌కు ఇస్తానని చెప్పడం లేదు అని అమర్ దీప్ గొంతు చించుకొని అరిచాడు. ప్రశాంత్ చలికి భుజం దించి ఉండే.. సక్కగా నిలచుకో. నా ముందు భుజం వంచి నిలుచోకు అంటూ అమర్ దీప్ వార్నింగ్ ఇచ్చారు. దాంతో నాకు చలి వేస్తుందని అని సమాధానం చెప్పాడు.

పేద రైతు పేరు చెప్పుకొని బతుకుతున్నావు. బీటెక్ చేసిన వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారో తెలియక, ఏ చేస్తున్నారో తెలియ ఆకలితో చచ్చిపోతున్నారు. వారి శవాలు కూడా ఏమౌతున్నాయో తెలియడం లేదు అని అమర్ దీప్ స్పీచ్ ఇచ్చాడు. వాళ్లకు నీవు ఏం చెబుతున్నావు. నీవు నటించకు. నేను నీకంటే పెద్ద నటుడిని అంటే.. నేను అలానే చేస్తా అని ప్రశాంత్ అంటే.. నీవు ట్రైనింగ్ తీసుకొన్న నటుడివి అంటూ అమర్ దీప్ ఆరోపించాడు.

నామినేషన్ సందర్భంగా అందరూ మూకుమ్మడి దాడి చేయడంతో పల్లవి ప్రశాంత్ భోరున ఏడ్చాడు. బిగ్‌బాస్‌లోకి రావడానికి స్టూడియో చుట్టు కుక్కలా తిరిగాను అని పల్లవి ప్రశాంత్ అంటే.. కుక్కలా తిరిగి నువ్వు ఏం చేస్తున్నావు అని రతిక ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అందరి దాడిని ఓపికగా భరించిన ప్రశాంత్.. నీకు గోలీలు ఆడటం వచ్చా? అంటే.. వచ్చు అని గౌతమ్ చెప్పగానే.. ఇంటికి వెళ్లేటప్పుడు తీసుకెళ్లు అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











