Bigg Boss Telugu 7: పెళ్లి చూపుల్లా మారిన నామినేషన్లు.. ఒకరినొకరు చూస్కుంటూ తెగ సిగ్గుపడిపోయిన జంట!
బిగ్ బాస్ తెలుగు షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కాని అద్భుతమైన టీఆర్పీతో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఏడో సీజన్ ఉల్టాపుల్టాగా వస్తుండగా.. అంతా తెగ ఎగ్జైట్ అయిపోయి మరీ చూస్తున్నారు. రాత్రి 9 అయిందంటే చాలు టీవీల ముందు వాలిపోతున్నారు. అయితే ఇప్పటికే విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో... ప్రస్తుతం 12వ వారంలోకి అడుగు పెట్టబోతుంది. ఈక్రమంలోనే ఈరోజు నామినేషన్ల పర్వం రసవత్తరంగా సాగుతోంది.
ముఖ్యంగా బిగ్ బాస్ ఈసారి అదిరిపోయే నామినేషన్స్ టాస్క్ ఇచ్చారు. ఆ పులి బాగా ఆకలిగా ఉంది.. కాబట్టి మీరు ఎవరెవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటో పెట్టి ఓ చికెన్ ముక్కును పులి నోట్లో వేయాలని చెప్పాడు. అందుకు తగ్గట్లుగానే హౌస్ మేట్స్ అంతా నామినేట్ చేయడం ప్రారంభించారు. ఎప్పుడూ హీటెక్కించే నామినేషన్స్ లో ఈసారి ఫుల్ కామెడీ చోటు చేసుకుంది. రతికా రోజ్ చేసిన కామెడీ అయితే అందరినీ ఆకట్టుకుంటోంది.

ముందుగా నామినేట్ చేసేందుకు లేచి నిలబడ్డ రతికా రోజ్.. దా అంటూ ప్రశాంత్ ను పిలవడం చాలా ఫన్నీగా తోచింది. దీనికి తెగ సిగ్గుపడిపోతు వచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మొహం అంతా సిగ్గుతో నిండిపోయింది. వీరిద్దరూ ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ చూసిన హౌస్ మేట్స్ అంతా ఫుల్లుగా నవ్వుకున్నారు. అందరూ వారిద్దరి మొహాలు చూస్తూ.. ఇదేంటి అనుకుంటూ మాట్లాడుకున్నారు. ముందుగా చాలా ఫన్నీగా ప్రారంభం అయిన వీరి నామినేషన్స్ ఆ తర్వాత చాలా హాట్ గా సాగాయి. విపరీతైమన హీటెక్కించేలా నడిచింది. రైతుబిడ్డ అయితే అక్కా అక్కా అంటూ ఆమె చేసిన తప్పులు గురించి చెప్పడం మనం ప్రోమోలో చూడవచ్చు.

నీది అయిపోతే నేను మాట్లాడతానంటూ రతికా అనగా... నువ్వు నన్ను నామినేట్ చేసేందుకు చెప్పిన ఒక్క కారణం కూడా కరెక్టు కాదనిపిస్తుందని పల్లవి ప్రశాంత్ చెప్పాడు. పల్లవి ప్రశాంత్ ఏం గేమ్ ఆడిండు.. ఎన్ని ఇటుకలు సేకరించిండంటూ రతికా ఫైర్ అయింది. తాను గేమ్ ఆడానని రైతుబిడ్డ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత అమర్ దీప్ ను పిలిచిన రతికా రోజ్ ... అతిడితో కూడా చాలానే కామెడీ చేసింది. 15వ వాంలో ఎంతమంది ఉంటారు, అసలు ఇంట్లో ఎంత మంది ఉన్నారంటూ అమర్ దీప్ ను రతికా అడిగిన ప్రశ్నలు చాలా సిల్లీగా అనిపించాయి.

రతికా అలా అడుగుతుంటే.. అమర్ దీప్ మాత్రం పులి మీసాలు పట్టుకొని ఆడుకున్నాడు. అవెన్ని ఉన్నాయో లెక్కపెట్టమని రతికా అనగా.. లెక్కపెట్టానంటూ అమర్ దీప్ సమాధానం చెప్పాడు. మళ్లీ ఇది రిపీట్ అవ్వొద్దంటూ రతికా చెప్పగా.. అమర్ దీప్ మీసాలు తిప్పడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. చాలా కామెడీగా, ఫన్నీగానే కాకుండా.. విపరీతమైన అగ్రెషన్ తో ఈ నామినేషన్ల పర్వం సాగినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











