Bigg Boss 7 Telugu: కిస్ ఇచ్చాడు.. అలా బట్టలు వేసుకోవద్దన్నాడు.. అతడిపై రతికా సంచలన ఆరోపణలు

కంటెస్టెంట్ల మధ్య ఫైటింగ్స్, గొడవలు, రొమాన్స్, ప్రేమ కహానీలు ఇలా రకరకాల ఆసక్తికరమైన సంఘటనలను చూపిస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. తెలుగులో సూపర్ డూపర్ సక్సెస్ అయిన ఈ షోను నిర్వహకులు మరింత రంజుగా నడిపిస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా సీజన్లను కూడా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను మరింత ఆసక్తికరంగా చూపిస్తున్నారు. ఇక, ఇందులో యమ హైలైట్ అవుతోన్న రతికా రోజ్‌ తాజాగా మరో కంటెస్టెంట్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఆ వివరాలు మీకోసమే!

సాధారణంగా ఏ భాషలో వచ్చే బిగ్ బాస్ షోలో అయినా ఎక్కువగా హైలైట్ అయ్యేది కంటెస్టెంట్ల మధ్య ఏర్పడే లవ్ ట్రాకులే అని చెప్పుకోవచ్చు. వాళ్ల మధ్య లవ్ ఉన్న లేకున్నా.. నిర్వహకులు మాత్రం జోడీలుగా మార్చాలని ట్రై చేస్తారు. ఇలా ప్రతి సీజన్‌లోనూ కనీసం ఒక్క జంటనైనా హైలైట్ చేస్తున్నారు. ఇలా ఏడో సీజన్‌లో పల్లవి ప్రశాంత్, రతికా రోజ్ మధ్య ట్రాక్ ఫోకస్ చేశారు.

 Rathika Rose Allegations on Pallavi Prashanth in Bigg Boss Show

బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి కంటెస్టెంట్లుగా వచ్చిన పల్లవి ప్రశాంత్, రతికా రోజ్ ఆరంభంలోనే పలు కారణాలతో హైలైట్ అయ్యారు. అదే సమయంలో నవీన్ పోలిశెట్టి వచ్చి అతడిని నీ లేడీ లక్ ఎవరని అడిగాడు. దీంతో రతికా పేరు చెప్పాడు. అప్పటి నుంచి వీళ్ల బంధం ఏర్పడింది. ఆ తర్వాత రతికా ఏకంగా తన దిల్‌ను ప్రశాంత్‌కు ఇస్తానని చెప్పడంతో అది స్ట్రాంగ్‌గా మారింది.

ఆ తర్వాత కూడా పల్లవి ప్రశాంత్, రతికా రోజ్ మధ్య కొన్ని సీన్లను హైలైట్ చేసి చూపించి.. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే ఫీల్ కలిగేలా చేశారు. అయితే, ఈ వారం జరిగిన నామినేషన్స్ టాస్కులో 'నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పానా' అని ప్రశాంత్.. రతికను సూటిగా ప్రశ్నించాడు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ కాస్త దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

 Rathika Rose Allegations on Pallavi Prashanth in Bigg Boss Show

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో రతికా రోజ్.. పల్లవి ప్రశాంత్‌తో వాదనకు దిగింది. అసలు ఏ ఉద్దేశంతో నాతో ఓవర్‌గా బిహేవ్ చేశావని ప్రశ్నించింది. దీనికతడు 'నిన్ను చూడగానే మనోళ్ల అమ్మాయి అనిపించింది. అందుకే కొంచెం క్లోజ్‌గా ఉన్నాను. అప్పుడప్పుడూ మజాక్ చేశాను' అని చెప్పాడు. ఈ మాటలకు ఒప్పుకోని రతికా అతడి గురించి ఎన్నో విషయాలను బయట పెట్టింది.

'నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్ లేనప్పుడు నా పేరు ఎందుకు రాశావు? ఫ్లయింగ్ కిస్ ఎందుకు ఇచ్చావు? పొట్టి బట్టలు వేసుకోవద్దని నువ్వు చెప్పలేదా? దామినిని వదినా అని పిలవమన్నావు.. సందీప్ మాస్టర్, అమర్‌దీప్‌తో మాట్లాడుతుంటే కోప్పడ్డావు. మగాళ్లతో ఉంటే లాక్కుని వచ్చేశావు' అని ఆరోపించింది. దీంతో ప్రశాంత్ ఆమెకు క్షమాపణ చెప్పి దీనికి పుల్‌స్టాప్ పెట్టేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X