Rathika Rose: ప్రశాంత్ హీరో అయిపోయాడు... రతికను రెచ్చగొట్టిన సీరియల్ బ్యాచ్

బిగ్ బాసీ సీజన్ 7 ప్రారంభం అయి... ఈసారి అంతా ఉల్టా పుల్టాగా నడుస్తోంది. మూడు వారాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో.. నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా హాట్ హాట్ గా నడిచింది. రతిక ఇప్పుడిప్పుడే సీరియల్ బ్యాచ్ తో తిరుగుతుంది. నామినేషన్స్ ప్రక్రియకు ముందు ఇక రతికను సీరియల్ బ్యాచ్ రెచ్చిగొట్టింది. తన వల్లే ప్రశాంత్ హీరో అయిపోయాడు... ఆ యావర్ కూడా లీనియస్ తీసుకుని వెంటపడ్డాడు అంటూ చెప్పుకువచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ సీజన్ 7 నాలుగోవారంలోకి ఎంటర్ అయింది. ఇక నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఇక అంతకు ముందు కంటెస్టెంట్స్ ఎవరిని నామినేట్ చేయాలో చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే సీరియల్ బ్యాచ్ లో ఒకరైన అమర్ దీప్.. రతికను రెచ్చగొట్టేలా మాట్లాడాడు. అంతేనా యావర్, పల్లవి ప్రశాంత్ ల గురించి చర్చించారు. ఇక శివాజీ అన్న మాటలు సరికావని.. ఇద్దరు డిస్కర్షన్ పెట్టారు. ఇక మొత్తానికి రతికను రెచ్చగొట్టేలా అమర్దీప్ మాట్లాడాడు.

Rathika Rose and Amardeep discussion About Pallavi Prashant, Yawar in Bigg Boss Telugu 7

రతిక అమర్ దీప్ తో మాట్లాడుతూ.... నేను అసలు ఎందుకు ల్యాగ్ చేశానో తెలీదు... కానీ అప్పటి నుంచి వాడు (ప్రశాంత్) హీరో అయిపోయాడు అంటూ చెప్పుకొచ్చింది. ల్యాగ్ కాదు అసలు వాడిని ముందుకి తీసుకు వచ్చిందే నువ్వు.. అంటూ అమర్ రెచ్చిపోయాడు. ఈసారి గుద్దు.. ఏరోజైనా వాడిని నామినేట్ చేశావా.. అలానే ప్రిన్స్ ని కూడా.. అంటూ అమర్.. రతికకు క్లాస్ ఇచ్చాడు.

Rathika Rose and Amardeep discussion About Pallavi Prashant, Yawar in Bigg Boss Telugu 7

రేపు జరగబోయే నామినేషన్లు గురించి బాగా ఆలోచించి చెయ్.. నీ వల్లే వాళ్లు హౌస్‌లో ఉంటున్నారంటూ... అమర్ బాగా ఎక్కించాడు. దీంతో రతిక... ఛీ అంది.. కాసేపు వాళ్ల గురించి మాట్లాడుకున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ కూర్చొని ఉన్నాడు. అక్కడి నుంచి వెళ్తున్న రతికను చూసి చాలా మారిపోయావ్ అంటాడు. నేనేం మారలేదు అని చెప్పి వెళ్తుంది రతిక. ఇక రతిక ఇప్పుడిప్పుడే.. సీరియల్ బ్యాచ్ లో కలుస్తూ.. యావర్, పల్లవి ప్రశాంత్ లకు దూరంగా ఉంటుంది.

Rathika Rose and Amardeep discussion About Pallavi Prashant, Yawar in Bigg Boss Telugu 7

ఇక హౌజ్ లో నామినేషన్స్ ప్రక్రియ అయితే హాట్ హాట్ గా నడిచింది. నిన్న చూపించిన ఎపిసోడ్ లో మాత్రం నామినేషన్స్ లో ఉన్నది ఆరుగురు. గౌతమ్, ప్రిన్స్, శుభ శ్రీ, తేజ, రతిక, ప్రియాంక.. వీరంతా ఈ వారం నామినేట్ అయ్యారు. మరి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మాత్రం టేస్టీ తేజ అంటున్నారు. ఆయనకు ఓటింగ్ తక్కువగా వచ్చిందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X