Bigg Boss 7 Telugu: నోరు జారిన రతికా రోజ్.. బూతులు తిట్టిన అమర్‌దీప్.. బిగ్ బాస్ ఏం చేశాడంటే!

బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని షో ఇది. అంతలా ఇది దాదాపు ఏడేళ్లుగా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ప్రేక్షకుల మద్దతును అందుకుని, రికార్డు స్థాయిలో రేటింగ్‌లను కూడా దక్కించుకుంటోంది. దీంతో నిర్వహకులు క్రమం తప్పకుండా సీజన్లను జరుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏదో దాన్ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఊహించని సంఘటనలు జరిగాయి. అసలేమైంది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

అలాంటి కంటెంట్‌తో ఆసక్తిగా:తెలుగులో బిగ్ బాస్ షోకు ఆదరణ పెరుగుతూనే ఉండడంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను మొదలు పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఏడో దాన్ని తీసుకొచ్చారు. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో వచ్చిన ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త టాస్కులు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను చూపిస్తున్నారు. దీంతో ఈ సీజన్ ఆసక్తిని పెంచేలా సాగిపోతోంది.

Rathika Rose and Amardeep Unexpected Behavior in Bigg Boss 7 Telugu Show

గెలిచింది వాళ్లు.. వీళ్ల చేతిలో:'మాయ అస్త్ర' టాస్కులో గెలిచిన రణధీర టీమ్ సభ్యులకు ఆరు మాయ అస్త్రాల దక్కాయి. దీంతో బిగ్ బాస్ 'పవర్ అస్త్ర' కోసం జరిగే పోటీకి వీళ్లంతా అర్హులు అయ్యారు. కానీ, తాజా ఎపిసోడ్‌లో రణధీర టీమ్‌లో పవర్ అస్త్ర సాధించేందుకు ఎవరు అర్హులో చెప్పాలని మహాబలి టీమ్‌కు టాస్క్ ఇచ్చాడు. ఇందుకోసం మాయ అస్త్రాలను ఒకరి నుంచి ఒకరికి మార్చాలని చెప్పాడు.

ఆ ఇద్దరు కామ్‌గా.. గొడవలు:బిగ్ బాస్ టాస్కు ప్రకారం.. మహాబలి టీమ్‌లోని సభ్యుల్లో శుభశ్రీ మొదట తన నిర్ణయాన్ని చెప్పింది. రణధీర టీమ్‌లో శోభా శెట్టి ఒక రౌండ్‌లో ఓడిపోయిందన్న కారణంతో ఆమె దగ్గర ఉన్న మాయ అస్త్రాన్ని ప్రిన్స్ యావర్‌కు ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన పల్లవి ప్రశాంత్.. అమర్‌దీప్ దగ్గర ఉన్న అస్త్రాన్ని తీసుకుని శివాజికి ఇచ్చాడు. కానీ, ఆ తర్వాతే మహాబలి టీమ్‌లో గొడవ మొదలైంది.

రచ్చ రచ్చ చేసేసిన రతికా:మహాబలి టీమ్‌లో ఇంకా నలుగురు మిగలడంతో అందరూ కలిసి రతికాను మూడో స్థానంలో పంపాలని నిర్ణయించారు. కానీ, ఆమె మాత్రం చివరి స్థానంలోనే వెళ్తానని పట్టుబట్టింది. ఈ విషయంలో టీమ్ సభ్యులను విభేదిస్తూ మాట్లాడింది. ఈ క్రమంలోనే దామినిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. ఈ ఘటన వల్ల సంచాలకుడు సందీప్‌తో పాటు అందరూ ఆమెను వ్యతిరేకించారు.

బఫూన్స్, జోకర్స్ అని తిట్టి:ఆ తర్వాత కూడా రతికా రోజ్ తన టీమ్‌ మెంబర్లతో గొడవకు దిగింది. ఆ సమయంలో 'చెండాలంగా ఆడుతున్నారు బఫూన్స్' అని నోరు జారేసింది. దీంతో సందీప్‌ 'నువ్వు రెండు రోజులు వాళ్లతో ఆడి ఇప్పుడెలా అంటావు' అని అడిగాడు. తర్వాత వీళ్లిద్దరికీ గొడవ జరిగింది. ఆ తర్వాత కూడా రతికా 'బఫూన్స్, జోకర్స్' అంటూ పలుమార్లు తిట్టి మరింతగా గొడవ చేసింది.

ట్విస్ట్ ఇచ్చేసిన బిగ్ బాస్:రతికా చేస్తున్న గొడవతో విసిగిపోయిన దామిని మూడో స్థానంలో వెళ్లి ప్రియాంక దగ్గర ఉన్న మాయ అస్త్రాన్ని షకీలాకు ఇచ్చింది. ఆ తర్వాత నాలుగో స్థానానికి ఎవరూ వెళ్లకపోవడంతో బిగ్ బాస్ 'మీరు సమయాన్ని వృథా చేసినందున.. మహాబలి టీమ్ నుంచి ఎవరు వెళ్లాలో రణధీర టీమ్ సభ్యులు నిర్ణయిస్తారు. అలాగే, అస్త్రం ఉన్న వాళ్లకే ఇంకోటి ఇవ్వాలి' అని ట్విస్ట్ ఇచ్చాడు.

బూతులు తిట్టిన అమర్:అప్పటికే మాయ అస్త్రం కోల్పోయిన అమర్, ప్రియాంక, శోభా శెట్టిలు టాస్క్ నుంచి ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ చెప్పాడు. దీంతో వాళ్లంతా రతికాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా అమర్‌దీప్.. ప్రశాంత్ సిల్లీ రీజన్ చెప్పాడని, రతికా లేట్ చేసిందని ఫైర్ అయ్యాడు. అలాగే బూతులు కూడా తిట్టాడు. దీంతో ప్రియాంక అతడిని కూల్ చేసేందుకు ట్రై చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X