Bigg Boss Telugu 7: 12వ వారం డబుల్ ఎలిమినేషన్.. ఉల్టాపుల్టాగా ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తుంది. ఇక ఈ షో చివరి దశకు చేరుకోవడంతో.. బిగ్ బాస్ లవర్సే కాకుండా సామాన్యులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఈ వారం 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. అంతే కాదు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని గతవారమే నాగార్జున్ చెప్పుకువచ్చాడు. ఆయన చెప్పినట్లుగానే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగిందని తెలుస్తోంది. అనుకున్నట్లుగానే ఆ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయినట్లు బిగ్ బాస్ వర్గాల సమాచారం. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 7 చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో... డిసెంబర్ 17కి ముగియనుంది. గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17న రాత్రి 7 గంటలకు జరగనుందని తెలుస్తోంది. అయితే ఆ గ్రాంఢ్ ఫినాలేకి టాప్ 5 లేదా టాప్ 7 కంటెస్టెంట్స్ ను తీసుకుపోవాలని చూస్తున్నారట. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కాబట్టి టాప్ 7 ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు. మరి టాప్ 7 ఉంటుందా.. టాప్ 5 ఉంటుందా అనేది క్లారిటీ లేదు.

Rathika Rose and Ashwini Sri Eliminated 13th week Bigg Boss Telugu 7 Show Full Details Here

ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. శివాజీ, యావర్, ప్రశాంత్, రతికా రోజ్, అశ్విని శ్రీ, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ ఉన్నారు. వీరిలో ఈ వారం 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ప్రియాంక కెప్టెన్ కాబట్టి ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. ఇక శోభా శెట్టి కూడా సేఫ్ అయిపోయింది. ఇక 8 మంది కంటెస్టెంట్స్ లో డబుల్ ఎలిమినేషన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది.

ఓటింగ్ స్టార్టింగ్ నుంచి అమర్ దీప్, యావర్, ప్రశాంత్, శివాజీ సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక డేంజర్ జోన్ లో రతికా రోజ్, అశ్విని శ్రీ, గౌతమ్, అర్జున్ అంబటి ఉన్నారు. అయితే వీరిలో ఇద్దరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని నాగార్జున చెప్పినట్లుగానే బిగ్ బాస్ ఈ వారం ఇద్దరిని ఇంటికి పంపేశాడు. అందులో మొదటి వ్యక్తి అశ్విని శ్రీ. ఈ బ్యూటీ ఈ వారం సెల్ప్ నామినేట్ అయిపోయిన సంగతి తెలిసిందే.

ఇక సెల్ఫ్ నామినేట్ చేసుకున్న ఈ బ్యూటీ... శనివారం ఎపిసోడ్ అంటే నవంబర్ 25న ఎలిమినేట్ కానుంది. డైరెక్టుగా ఎలిమినేట్ అయిపోతుంది. ఇక ఆదివారం ఎపిసోడ్ ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఆసక్తిగా మారింది. అయితే అందరూ మేల్ ఎలిమినేషన్ ఉంటుందని అనుకున్నారు. కానీ రతికా రోజ్ ఎలిమినేట్ అయిపోయిందని తెలుస్తోంది. ఇక 12వ వారం ఇద్దరు ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు.

Rathika Rose and Ashwini Sri Eliminated 13th week Bigg Boss Telugu 7 Show Full Details Here

అశ్విని శ్రీ, రతికా రోజ్ ఎలిమినేషన్ తో హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉంటారు. అందులో ఇద్దరు ఫీమేల్ కంటెస్టెంట్స్ కాగా.. మరో 6 మంది మేల్ కంటెస్టెంట్స్. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ లో అమర్ దీప్, ప్రశాంత్, యావర్, శివాజీ, ప్రియాంక నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక టాప్ 7 పెడితే కనుగ గౌతమ్, శోభా శెట్టి కూడా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X