Bigg Boss Telugu7: నోట్లో పేడ కొట్టి.. డ్రాయర్‌లో ఐస్ వేసి..యావర్‌పై రతిక శాడిజం..ఇలా ఉన్నారేంట్రా బాబు

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ ప్రారంభం అయింది. ఇక ప్రారంభం అయిన మొదటి రోజు నుంచే ఈ సీజన్ కాస్త డిఫరెంటుగా ప్లాన్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఇద్దరు ఎలిమినే అవ్వగా... 14 మందిలో మిగిలింది 12 మంది. ఇక వారి మధ్య సైతం గొడవలు సృష్టించే పనిలో పడిపోయాడు బిగ్ బాస్. తాజాగా ప్రిన్స్ యావర్ కు పవర్ అస్త్ర సాధించుకునేందుకు అర్హుడువనే నిరూపించుకునేందుకు ఓ టాస్క్ ఇచ్చాడు. ఇక ఈ టాస్కులో శాడిజం చూపిస్తూ రతిక, దామిని రెచ్చిపోయారు. ఆ వివరాల్లోకి వెళితే....

బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తోంది. హౌజ్ లోకి ఎంటర్ అయిన 14 మందిలో ఇద్దరు ఎలిమినే అవ్వగా... (కిరణ్ రాథోడ్, షకీలా) 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఇప్పటికే హౌజ్ లో నామినేషన్స్ గొడవలు, టాస్కుల గొడవలు సృష్టిస్తూ ప్రేక్షకులకు ఎంటర్ టైన్ అందించే పనిలో ఉండిపోయాడు బిగ్ బాస్. తాజాగా యావర్ కు ఇచ్చిన టాస్కుతో హౌజ్లో రతిక, దామిని రెచ్చిపోయారు.

Rathika Rose and Damini, Teja Terrible Punishment to Prince Yawar in Bigg Boss Telugu 7 day 17

అసలు విషయం ఏమిటంటే... ఈరోజు టెలికాస్ట్ ప్రోమో తాజాగా విడుదల అయింది. ప్రిన్స్ యావర్‌ ను పవరాస్త్ర పొందుకోవడానికి అనర్హుడిగా ప్రకటిస్తూ.. అతన్ని రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.ఇక ఈ ప్రోమోలో బిగ్ బాస్ అతనికి మరో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. పవరాస్త్ర పొందుకోవడానికి ప్రిన్స్ అనర్హుడు అంటూ రతిక, దామిని, టేస్టీ తేజాలు రిజెక్ట్ చేసిన సంగతి తెలిసేందే. దాంతో కుమిలిపోయిన ప్రిన్స్ నిన్నటి ఎపిసోడ్‌లో శాడిస్ట్‌గా ప్రవర్తించాడు.

దీనితో ఈ రోజు ఎపిసోడ్ లో యావర్ కు మరో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అతని ఓపీకకు పరీక్షగా... స్టాండ్‌పై తల పెట్టి ఇంటి సభ్యులు ఏం చేసినా కూడా ఆ స్టాండ్‌పై నుంచి తల తీయకూడదని బిగ్ బాస్ చెప్తాడు. దీంతో అతను ఆ స్టాండ్ పై తలపెట్టి నిలబడుతాడు. ఇక ఇంటి సభ్యులు ముఖ్యంగా రతిక, దామిని, టేస్టీ తేజా శాడిజం అంటే ఏంటో చూపించారు.

Rathika Rose and Damini, Teja Terrible Punishment to Prince Yawar in Bigg Boss Telugu 7 day 17

రతిక అయితే మరీ దారుణంగా ప్రిన్స్ ముఖంపై కోడి గుడ్లు కొట్టి... దామిని అయితే ముక్కులో ఈకలు పెడుతూ... వీళ్లు మనుషులేనా అనిపించేలా బిహేవ్ చేశారు. తప్పమ్మా? అని శివాజీ అనడంతో.. సార్ ఇవ్వన్నీ మా ప్రయత్నాలు అంటూ తనని తాను సమర్దించుకుంది దామిని. వీళ్ల చేష్టలు చూస్తే మాత్రం ఎవరికైనా కోపం రావాల్సిందే.

ఇక టేస్టీ తేజా అయితే ఐస్ తీసుకు వస్తాడు. దీంతో అవి తీసి యావర్ డ్రాయర్ లో వేస్తుంది రతిక. ఆ తరువాత బిగ్ బాస్ పేడనీళ్లు పంపించడంతో వాటిని దామిని, రతిక ప్రిన్స్ ముఖంపై కొడుతారు. నోట్లోకి పోతున్నా పట్టించుకోకుండా శాడిజం చూపిస్తారు. అయితే బిగ్ బాస్ ఏదో టాస్క్ ఇస్తే మాత్రం ఇంతలా బిహేవ్ చేయాలా అని నెటిజన్స్ అంటున్నారు. ఇలాంటి శాడిస్టులను ఎక్కడ చూడలేదని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ టాస్కులో ప్రిన్స్ పవర్ అస్త్ర గెలుస్తాడో లేదో ఈరోజు ఎపిసోడ్ లో తేలనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X