Bigg Boss Telugu 7: రతిక, పల్లవి ప్రశాంత్ రొమాంటిక్ వీడియో లీక్... మామూలుగా లేదుగా!
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సెప్టంబర్ 3న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. రెండు వారాలు దాటిపోయింది. ఇక ఈసారి పల్లవి ప్రశాంత్, రతిక మధ్య లవ్ ట్రాక్ మొదలైంది. ఇక నామినేషన్స్ లో ఈ లవ్ ట్రాక్ కాస్త... బ్రేక్ అయిపోయింది. ఇక వీరు మాట్లాడుకోవడం కూడా లేదు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఓ వీడియోను బయట పెట్టాడు. అందులో రతిక, పల్లవిప్రశాంత్ రొమాంటిక్ సీన్ ఉంది. ఆ వివరాల్లోకి వెళితే....
బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయి రెండు వారాలు దాటిపోయింది. ఇక ఏ బిగ్ బాస్ సీజన్ లోనైనా లవ్ ట్రాక్ కామన్. ఇక ఈ సారి పల్లవి ప్రశాంత్, రతిక మొదటి నుంచి క్లోజ్ గా ఉండటంతో వీరి మధ్య లవ్ ట్రాక్ ఏర్పడింది. అసలు బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టిన మొదటి రోజే... రతిక తన లేడీ లక్ అంటూ పల్లవి ప్రశాంత్ ఓ బ్యాండ్ కట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండురోజుల పాటు వీరిద్దరూ ఒకరిని విడిచి మరొకరు లేరు అన్నట్లుగా తిరిగారు.

ఇక బిగ్ బాస్ హౌజ్‌లో రెండో వారం జరిగిన నామినేషన్స్ లో అంతా రివర్స్ అయింది. బిగ్ బాస్ సీజన్ 7లో రెండో వారం నామినేషన్స్‌లో చాలామంది కంటెస్టెంట్స్.. పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేశారు. ఆయన రైతు బిడ్డ అనే ట్యాగ్ వాడాటాన్ని నచ్చని కంటెస్టెంట్స్... ప్రశాంత్ ను నామినేట్ చేశారు. ఇక రతిక వెనుక తిరగడం తప్పా ఏమీ చేయడం లేదు అంటూ ఒక కంటెస్టెంట్ కామెంట్ చేయగా... దానికి ఒప్పుకోని ప్రశాంత్.. నేను నిన్ను లవ్ చేస్తున్నా అని ఎప్పుడైనా చెప్పానా అని రతికను అడిగాడు. రతిక నేరుగా కాకపోయినా చూస్తున్నవాళ్లకు తెలుసు అన్నట్టుగా సమాధానం చెప్పింది.
బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చేందుకు నేనూ కుక్కలాగా తిరిగాను ప్రశాంత్ చెప్పగా.. దానికి రతిక కుక్కలాగా తిరిగితే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావ్ అని ప్రశ్నించింది. దీంతో ప్రశాంత్ ను రతిక మాటాలు చాలా బాధపెట్టాయి. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా కలిసి రతికకు దూరంగా ఉండమని సలహా కూడా ఇచ్చారు. అప్పటినుండి వీరిద్దరు మధ్య పెద్దగా మాటలు లేవు. గతవారం జరిగిన పవర్ అస్త్రా టాస్క్‌లో రతిక, పల్లవి ప్రశాంత్.. ఒకే టీమ్‌లో ఉన్నారు. అయినా కూడా వారు అసలు మాట్లాడుకోలేదు.

వారం రోజులు గడిచిన తర్వాత రతికతో ఉన్న మనస్పర్థలను క్లియర్ చేసుకోవాలి అనుకున్న ప్రశాంత్.. తన దగ్గరకు వెళ్లి చేసిన తప్పులేంటో అడిగాడు. రతిక చెప్పిన సమాధానాలకు ఒప్పుకొని, ఇంకెప్పుడూ అలా చేయను అన్నాడు. అప్పటినుండి వీరిద్దరూ మళ్లీ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తాజాగా కంటెస్టెంట్స్ అంతా పడుకున్న తర్వాత వీరిద్దరు పడుకోకుండా కబుర్లు చెప్పుకున్న సందర్భం బిగ్ బాస్ బజ్‌లో ప్రసారం అయ్యింది. దానికి సంబంధించిన వీడియోను బయటపెట్టాడు బిగ్ బాస్.
బెడ్ రూమ్‌లో రతిక పడుకొని ఉండగా.. గ్లాస్ కు అటువైపుగా ప్రశాంత్ కూర్చొని ఉన్నాడు. కొంచెం ముందుకు రా అని ప్రశాంత్ అడగడంతో... డ్యాన్స్ రాదని బాగానే డ్యాన్స్ చేశావంటూ రతిక.. ప్రశాంత్ తో అంటుంది. దానికి ప్రశాంత్ సరదాగా డిస్కో డ్యాన్సర్ అంటూ పాటపాడాడు. ఫ్లోర్ మూమెంట్ అంటూ కామెడీ చేశాడు. ఆ తర్వాత కబుర్లు చెప్పుకున్నారు, సరదాగా చేతులతో ఆడుకున్నారు. ఈ సీన్ కు ఓ లవ్ సాంగ్ వేసి.. లవ్ ఫీల్ వచ్చేలా చేశాడు.


Click it and Unblock the Notifications











