Bigg Boss Telugu 7: ఆఫ్ర్ట్రాల్ శోభాశెట్టి.. నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆమేనట - నిజమెంత?

Shobha vs Rathika: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. మరికొన్ని వారాల్లో ఈ సీజన్ ముగుస్తుంది అనగా.. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రతిరోజూ ఎపిసోడ్ లను చూసేందుకు పెద్ద బుల్లితెర ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్ ఎపిసోడ్స్, నామినేషన్లు, కెప్టెన్సీ టాస్కు వచ్చే రోజు టీఆర్పీ మరింత ఎక్కువ అవుతోంది. ఇది చూస్తుంటేనే బిగ్ బాస్ షో అప్ డేట్లు తెలుసుకునేందుకు ఎంతమంది ఆసక్తి కనబరుస్తున్నారో అర్థం అవుతోంది. అయితే 9 వారంలో టేస్టీ తేజ ఎలిమినేట్ అయి వెళ్లిపోగా... సోమవారం నామినేషన్ల పర్వం అద్భుతంగా సాగింది. కంటెస్టెంట్లు మధ్య జరిగిన గొడవలతో షోను మరింత రసవత్తరంగా మార్చారు.

ముఖ్యంగా రాజమాతలుగా శోభా శెట్టి, ప్రియాంక జైన్, రతికా రోజ్, అశ్విని శ్రీలు ఉండగా.. నలుగురిని నామినేషన్లలో ఉంచారు. ఇక ఆ తర్వాత ఈ నలుగురు రాజ మాతల్లోంచి ఒకరిని ఏకాభిప్రాయంతో నామినేట్ చేయాలని బిగ్ బాస్ సూచించారు. కెప్టెన్ గా శోభా శెట్టి ఉండడంతో... ఆమెను నామినేట్ చేసే వీలు లేదని బిగ్ బాస్ ముందుగానే తెలిపారు. ఈక్రమంలోనే ముందుగా లేచిన ప్రియాంక జైన్ అశ్వినీ, రతికా రోజ్ లను నామినేట్ చేసింది. ఇక ఆ తర్వాత లేచిన రతికా రోజ్.. ప్రియాంక్ జైన్ ను నామినేట్ చేసింది. అలాగే అశ్విని శ్రీ కూడా ప్రియాంకనే నామినేట్ చేసింది.

Rathika Rose And Shobha Shetty Fight in Nomminations at Bigg Boss Telugu 7

ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ చెప్పుకున్న పాయింట్స్ చాలా సిల్లీగానే ఉన్నాయి. కానీ వీరి ముగ్గురి మధ్య బాగానే గొడవ జరిగింది. ఇక చివరగా తన ఒపీనియన్ చెప్పేందుకు వచ్చిన శోభా శెట్టి.. రతికా రోజ్ ను నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. దీనికి రతికా రోజ్ ఫుల్ ఫైర్ అయింది. ఇదెలా సాధ్యం అవుతుంది.. అసలు ఒక్క పాయింట్ కూడా లేకుండా నీవు నన్నెలా నామినేట్ చేస్తావని ప్రశ్నించింది. ఇందుకు స్పందించిన శోభా శెట్టి.. ఆమెను నామినేట్ చేసేందుకు గల కొన్ని కారణాలను వివరించింది. నీవు ఆల్రెడీ బయటకు వెళ్లి వచ్చి గేమ్ ఆడుతున్నావు, అందరిలో చూసుకుంటే నువ్వే నాకు వీక్ కంటెస్టెంట్ అనిపిస్తున్నావని తెలిపింది.

కానీ అందుకు ఒప్పుకోని రతికా.. నేను ప్రియాంక పేరే చెప్పాను, అలాగే అశ్విని కూడా ప్రియాంక పేరే చెప్పింది.. మెజార్టీ ప్రియాంక ఉంది కాబట్టి ఆమెనే నామినేట్ చేయాలని రతికా రోజ్ శోభా శెట్టికి తెలిపింది. నువ్వు నా పేరు ఎలా చెబుతావు, ఇక్కడ ఏకాభిప్రాయంతో అని అన్నారు.. నన్నెలా నామినేట్ చేస్తావంటూ గొడవకు దిగింది. రతికకు 2, ప్రియాంకకు 2 వచ్చాయి.. ఇద్దరూ టై అయ్యారు ఎవర్ని నామినేట్ చేయాలని శోభా శెట్టి బిగ్ బాస్ ను అడుగుతుండగా... రతికకు ఒకటే వచ్చిందంటూ రతికా చెప్పుకొచ్చింది. అలాగే నన్ను వీక్ అంటున్నావు కానీ నీవే వీక్ అంటూ వివరించింది.

Rathika Rose And Shobha Shetty Fight in Nomminations at Bigg Boss Telugu 7

ఇందుకు శోభా శెట్టి ఫుల్ ఫైర్ అవుతూనే.. వీక్ కాబట్టే ఫస్ట్ లేడీ హౌస్ మేట్ అయ్యాను, ఫస్ట్ కెప్టెన్ అయ్యాను అంటూ తెలిపింది. వీక్ అయ్యుంటే నీలాగా ఎలిమినేట్ అయి బయటకు వెళ్లేదాన్ని కానీ నేను ఎలిమినేట్ కాలేదని పేర్కొంది. 10 నిజంగా వీక్ అయ్యుంటే పది వారాలు ఇక్కడ ఉండేదాన్ని కాదని స్పష్టం చేసింది. ఈక్రమంలోనే రతికా రోజ్ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది నువ్వే అంటూ శోభాకు చెప్పింది. దానికి మరింత కోపంతో ఊగిపోయిన శోభా శెట్టి.. జనాలకు నచ్చకపోతే ఎలిమినేట్ అవుతానేమో అని చెప్పింది. ఇలా వీరిద్దరి మధ్య ఫుల్ గొడవ జరిగింది. మీరూ ఓసారి ఈ గొడవపై లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X