Bigg Boss Telugu 7: రూటు మార్చిన రతిక రోజ్... ఇది కదా రియలైజేషన్ అంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా ఆసక్తిగా సాగుతున్న విషయం తెలిసిందే. 7 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో.. 8వ వారంలోకి అడుగుపెట్టింది. అయితే 7వ వారంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నాలుగో వారంలో ఎలిమినేట్ అయిన రతికా రోజ్ 7 వ వారంలో రీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఈ బ్యూటీ కొత్త స్ట్రాటజీతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. రెమోలా ఉండే రతికా ఒక్కసారిగా అపరిచితుడు సినిమాలో రాములా మారిపోయింది. అసలు సంగతి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ హౌస్ లో రతికా రోజ్ అడుగుపెట్టిన మొదటి రోజే అందరి దృష్టిని ఆకర్షించింది. దానికి కారణం నాగార్జున ఆమెను.. బ్రేకప్ నుంచి తేరుకున్నట్టేనా అంటూ పలకరించడం. ఇక ఆ మాటతో నెటిజన్స్ ఆరా తీశారు. రతికా.. రాహుల్ సిప్లిగంజ్ మాజీ ప్రియురాలు అని పసిగట్టారు. రతికా కూడా రాహుల్ ఫేమ్ యూజ్ చేసుకునేందుకు తెగ ప్రయత్నాలు చేసింది. తన ప్రియుడు గుర్తుకు వస్తున్నట్లు బిగ్ బాస్ హౌస్ లో కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఇక ఆ నాటకానికి రాహుల్ ఒకే ఒక్క ఇన్ స్టాగ్రామ్ పోస్టుతో తెరదించాడు.

 Rathika Rose Changed Her Behaviour in Bigg Boss Telugu 7 House

తనను తన ఫేమ్ ను కొంత మంది వాడుకుంటున్నారంటూ రాహుల్.. రతికను టార్గెట్ చేస్తూ పోస్టు చేశాడు. ఇక రతికకు నెట్టింట నెగిటివ్ వచ్చేసింది. ఇక ఆ విషయం పక్కన పెడితే.. రతికా బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ తో పులిహోర కలిపి మరింత నెగిటివిటీ మూట గట్టుకుంది. మొదటి వారం పల్లవి ప్రశాంత్ తో కలిసి లవ్ ట్రాక్ నడిపిన ఈ భామ రెండో వారం వచ్చేసరికి రివర్స్ అయింది. నామినేషన్స్ లో రెచ్చిపోయి మాట్లాడింది.

 Rathika Rose Changed Her Behaviour in Bigg Boss Telugu 7 House

ఇక మూడో వారం పల్లవి ప్రశాంత్, రతికా రోజ్ కలిసిపోయినట్లు కనిపించినా... ఆ తర్వాత బద్ద శత్రువులుగా మారిపోయారు. ప్రశాంత్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడింది. పల్లవి ప్రశాంత్ పవర్ అస్త్ర సాధించుకునే క్రమంలో అమర్ దీప్ తో కలిసి రెచ్చిపోయి మాట్లాడింది. ఇంట్లో వాళ్లను తిడుతూ... ప్రశాంత్ పై రెచ్చిపోయింది. ఇక నెట్టింట ఈ బ్యూటీకి బాగా నెగిటివిటి పెరిగిపోయి... ఇక నాలుగోవారంలో రతికా రోజ్ ఎలిమినేట్ అయింది.

ఇక ఏడో వారంలో రతికా రోజ్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సారి ఫుల్ స్ట్రాటజీతో వచ్చినట్లు తెలుస్తోంది. రావడం రావడమే శివాజీని హాగ్ చేసుకుని క్షమించాలి అన్నా అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టింది. ఇక శివాజీకి ఉన్న క్రేజ్ తెలుసుకున్న రతికా రోజ్.. ఆయన పార్టీలో చేరిపోయింది. శివాజీ కాళ్లు మొక్కి... క్షమించండి అన్న అంటూ ఆయన టీములో చేరిపోయింది. ఇక రతికా రోజ్.. ఎంట్రీతో ప్రశాంత్ రసగుల్లతో స్వాగతం పలికాడు.

 Rathika Rose Changed Her Behaviour in Bigg Boss Telugu 7 House

ఇక రతికా ఈ వారం ఆమె ప్రవర్తన చూసి నెటిజన్స్ అంతా రతికా రూటు మార్చిందని అంటున్నారు. ముఖ్యంగా రెమోలా ఉండే రతికా.. అపరిచితుడిలో రాములా మారిపోయిందని కామెంట్స్ పెడుతున్నారు. ఇక రతికా బిహేవియర్ లో చాలా మార్పులు వచ్చాయని... ఇక ఆమె టాప్ 5 నిలవనుందని అంటున్నారు. రతికా గేమ్ స్ట్రాటజీతో వచ్చిందని కామెంట్స్ పెడుతున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X