Bigg Boss 7 Telugu: హౌస్‌లో రతికా మాజీ ప్రియుడు.. బోరున ఏడ్చిన లేడీ.. ఆ తప్పు చేయొద్దు అంటూ!

సాధారణంగా ఏదైనా ఒక షో సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపడం అంటే సాధారణమైన విషయం కాదు. అలాంటి దాన్ని సుసాధ్యం చేస్తూ హవాను చూపిస్తోన్న షోనే బిగ్ బాస్. ఇది తెలుగులో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకోవడంతో పాటు భారీ రేటింగ్‌ను రాబడుతోంది. దీంతో నిర్వహకులు సరికొత్త ప్లాన్లతో ముందుకు వస్తున్నారు. ఇలా ఇటీవలే ఏడోది మొదలెట్టారు.

బిగ్ బాస్ తెలుగులో సక్సెస్ అవడంతో దీని నుంచి ఏడో సీజన్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఇది మొదలైంది. ఇందులో ఆరంభం నుంచే ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉల్టా పుల్టా సీజన్ కావడంతో దీన్ని సరికొత్తగా నడుపుతున్నారు. దీంతో ఆరంభంలోనే ఇది రంజుగా మారి ఆసక్తిని పెంచేసింది.

Rathika Rose Crying for Her Ex Boyfriend in Bigg Boss 7 Telugu Show

కొద్ది రోజుల క్రితమే మొదలైన ఏడో సీజన్‌లోకి 14 మంది సెలెబ్రిటీలు వచ్చారు. అందులో తెలుగు పిల్ల రతికా రోజ్ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి కారణం ఈ అమ్మడు స్టేజ్‌పై నాగార్జునను విమర్శించడమే. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్‌లోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ముందుకు సాగుతోంది. అలాగే, తనదైన స్ట్రాటజీతో ఆడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.

రతికా రోజ్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె లవ్ స్టోరీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఆమె ప్రేమించింది ఎవరో కాదు.. బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లీగంజ్ అని ఓ న్యూస్ లీకైంది. ఆ తర్వాత వీళ్ల ఫొటోలు, కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ, చాలా రోజుల క్రితమే వీళ్లిద్దరూ బ్రేకప్ కూడా చెప్పుకున్నారు.

రాహుల్ సిప్లీగంజ్‌తో బ్రేకప్ అయిన తర్వాత కూడా రతికా రోజ్ బిగ్ బాస్ హౌస్‌లో తరచూ అతడి గురించి పరోక్షంగా మాట్లాడుంది. ముఖ్యంగా బిగ్ బాస్‌ను ఇంప్రెస్ చేసే టాస్కులో అతడే తన కోసం పాట పాడాడా? అని అడిగి డౌట్లు పెంచేసింది. ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్‌లో రతికా రోజ్ తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ గురించి మరోసారి ప్రస్థావన తీసుకు వచ్చి బోరున ఏడ్చేసింది.

మంగళవారం రాత్రి చూపించిన ఎపిసోడ్‌లో రతికా రోజ్ ఎమోషనల్ అవుతూ కనిపించింది. దీంతో శివాజి వచ్చి ఆమెను ప్రశ్నించాడు. అప్పుడామె 'ఇంట్లో వాళ్లు అందరూ నా ఎక్స్ (మాజీ ప్రియుడు) గురించి మాట్లాడుతున్నారు. పదే పదే గుర్తు చేస్తూ నన్ను బాధ పెడుతున్నారు. ఇప్పుడు కూడా ఇదే టాపిక్ నడిచింది' అని చెబుతూ బోరున ఏడ్చింది.

రతికా మాటలకు శివాజి 'ఊకో బిడ్డ ఊకో.. అసలు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది? వాళ్లకు దీని గురించి ఎవరు చెప్పారు' అని అడగ్గా.. 'నేనే చెప్పా' అని రతికా అంది. దీంతో శివాజి 'నీ పర్సనల్ నీ దగ్గర ఉంచుకోకుండా వాళ్లకు ఎందుకు చెప్పావ్. ఇలా అయితే నీ ఏకాగ్రత తప్పుతుంది. అలా అయితే నువ్వు షో నుంచి వెళ్లిపోతావ్ బిడ్డా' అంటూ హెచ్చరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X