Bigg Boss 7 Elimination: షోలో పెను సంచలనం.. 4వ వారం ఎలిమినేషన్ లీక్.. టైటిల్ ఫేవరెట్ ఔట్

వేరే భాషల్లో ఎప్పుడో మొదలైనా.. ఏడేళ్ల క్రితమే తెలుగులోకి పరిచయం అయింది బిగ్ బాస్ షో. అంచనాలను పక్కన పెడితే ఎన్నో అనుమానాలతో మన భాషలోకి వచ్చిన దీనికి చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులు మద్దతును అందించారు.

దీంతో ఇది తెలుగు బుల్లితెరపై సూపర్ హిట్ షోగా మారిపోయింది. దీంతో వరుసగా సీజన్లను తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఏడో దాన్ని మొదలు పెట్టారు. ఎంతో ఆసక్తికరంగా సాగుతోన్న ఈ సీజన్‌లో నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారన్న దానిపై న్యూస్ ఇప్పటికే లీకైంది. ఆ వివరాలను మీరే చూసేయండి!

 Rathika Rose Eliminated From Bigg Boss 7 Telugu Show in 4th Week

నిజంగా ఉల్టా పుల్టా సీజన్‌గా: తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వచ్చాయి కానీ, బిగ్ బాస్‌కు దక్కిన రెస్పాన్స్ దేనికీ రాలేదు అని చెప్పాలి. అంతలా ఈ షో సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఇప్పుడు నిర్వహకులు ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో మొదలు పెట్టారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని క్రేజీ కంటెంట్‌ను చూపిస్తున్నారు. తద్వారా ఆసక్తికరంగా నడుపుతూ రేటింగ్‌ను రాబడుతున్నారు.

ముగ్గురూ వాళ్లే ఎలిమినేట్: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి నటి షకీలా, ఆట సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, శివాజి, సింగర్ రతికా రోజ్, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, ప్రియాంక జైన్, రైతు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్‌లు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు. వీరి నుంచి మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామినిలు షో నుంచి ఎలిమినేట్ అయిపోయారు.

నాలుగో వారంలో ఆరుగురు: ఏడో సీజన్ నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియ కొన్ని గొడవలతో ఫుల్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఇందులో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. అందులో ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, రతికా రోజ్, శుభశ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజలు ఉన్నారు. వాస్తవానికి తేజ నామినేషన్స్‌లో లేకున్నా శివాజి, సందీప్, శోభా శెట్టి తమ స్పెషల్ పవర్స్‌తో నామినేట్ చేశారు.

మళ్లీ అతడికే టాప్ ఓటింగ్: బిగ్ బాస్ ఏడో సీజన్ నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లతో సాగింది. అయితే, ఇందులో టైటిల్ ఫేవరెట్లుగా పేర తెచ్చుకున్న వాళ్లు ఉన్నప్పటికీ ఎవరూ ఊహించని విధంగా ప్రిన్స్ యావర్ ఎక్కువ ఓటింగ్‌తో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అతడు ఒక్కడికే 30 శాతం వరకూ ఓటింగ్ నమోదు అయింది. దీంతో ఈ వారం కూడా సేఫ్ అయ్యాడు.

ఈ సారి రతికా ఎలిమినేట్: వాస్తవానికి బిగ్ బాస్ షోకు సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ఎంతో రహస్యంగా సాగుతుంది. అయినా ఇది ఒకరోజు ముందుగానే షూటింగ్ జరుపుకోవడంతో సమాచారం మొత్తం లీక్ అవుతూనే ఉంటోంది. ఇక, ఏడో సీజన్ 4వ వారంలో రతికా రోజ్ షో నుంచి ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే ఒక న్యూస్ బయటకు వచ్చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ షాక్‌ అవుతున్నారు.

అందుకే తక్కువ ఓటింగ్: నాలుగో వారం నామినేషన్స్‌లో ఉన్న వాళ్లందరిలోనూ రతికా రోజ్‌ మాత్రమే ఆరంభంలోనే అదిరిపోయే కంటెంట్‌ను ఇచ్చింది. ఫలితంగా ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్ అనిపించుకుంది. అలాంటిది పల్లవి ప్రశాంత్ విషయంలో వ్యవహరించిన తీరు, శివాజితో గొడవ పెట్టుకోవడం, ఒకరిపై ఒకరికి చాడీలు చెప్పడం వంటి వాటితో ఆమెకు వ్యతిరేకత పెరిగి ఓటింగ్ తగ్గిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X